National
oi-Srinivas Mittapalli
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీల ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కొంతమంది ఉద్యోగులు ఆఫీస్ కంటే ఇంట్లో పనిచేయడమే బాగుందని చెబుతుంటే… మరికొంతమంది మాత్రం ఆఫీస్‌కు వెళ్లడమే బెటర్ అంటున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో కంపెనీలు ఓవర్ టైమ్ పనిచేస్తున్నాయని కంప్లైంట్ చేస్తున్నవారూ లేకపోలేదు.
ఇవన్నీ పక్కనపెడితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేటప్పుడు కొన్నిసార్లు ఇంటి చికాకులు పనిపై ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. సీరియస్‌గా పనిచేసుకుంటున్నప్పుడు పిల్లలు లేదా భార్య/భర్త…లేదా ఇంకెవరైనా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయొచ్చు. తాజాగా సోషల్ మీడియాలో ఇలాంటిదే ఓ వీడియో వైరల్‌గా మారింది. భర్త సీరియస్‌గా జూమ్ మీటింగ్‌లో మాట్లాడుతుండగా… ఆ గదిలోకి ఎంట్రీ ఇచ్చిన భార్య.. అతని చెంపపై ముద్దు పెట్టేందుకు ప్రయత్నించింది. దీంతో షాక్ తిన్న భర్త.. ఆమె వైపు ఆగ్రహంగా చూడటంతో… అక్కడినుంచి వెనక్కి వెళ్లింది.

‘ఏంటీ అర్థంలేని పని… అక్కడ కెమెరా ఆన్‌లో ఉంది…’ అంటూ ఆమెపై అతను చిరుబుర్రుమన్నాడు. అయినప్పటికీ ఆమె నవ్వుతూనే ఉంది. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆ గది నుంచి వెళ్లిపోయింది. ఇదంతా నిమిషాల వ్యవధిలోనే జరిగిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Zoom call …..so funny 😄 😄😄pic.twitter.com/6SV62xukMN
— Harsh Goenka (@hvgoenka) February 19, 2021
ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా సైతం ఈ వీడియోపై సరదాగా స్పందించారు. ‘హహ.. వైఫ్ ఆఫ్ ఇది ఇయర్‌గా ఆమెను నేను నామినేట్ చేస్తాను. ఒకవేళ ఆమె చర్యకు అతను కూడా సంతోషించి ఉంటే… ఇద్దరినీ కపుల్ ఆఫ్ ది ఇయర్‌గా నామినేట్ చేసేవాడిని. కానీ ఆమెపై చిరాకుపడి అతను ఆ అవకాశం కోల్పోయాడు.’ అని కామెంట్ చేశారు. మరో నెటిజన్… ‘ఆహా… ఎంత అందమైన కొంటె భార్య… సార్ కాస్త సీరియస్‌నెస్ తగ్గించుకోండి…’ అని కామెంట్ చేశాడు. వీడియోని చూసిన చాలామంది విరగబడి నవ్వుతున్నారు.