[ad_1]
గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా ఒక మహిళా రోబోను ఇస్రో నింగిలోకి పంపించనుందని.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ వివరించారు. ఆ మహిళా రోబో పేరు వ్యోమమిత్ర అని తెలిపారు. దీనికి సంబంధించిన ట్రయల్స్ అక్టోబరు నెల మొదటి వారం లేదా రెండో వారంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎన్డీటీవీ నిర్వహించిన జీ 20 కాంక్లేవ్‌లో శనివారం పాల్గొన్న జితేంద్ర సింగ్.. ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ క్రమంలోనే గగన్‌యాన్ ప్రయోగాన్ని 2022 ఏడాదిలోనే అంతరిక్షంలోకి పంపించాల్సి ఉన్నా.. కొవిడ్ మహమ్మారి కారణంగా అది ఆలస్యం అయినట్లు తెలిపారు. ఈ గగన్‌యాన్ ప్రయోగంలోని మొదటి ట్రయల్ మిషన్‌ను అక్టోబర్ తొలి వారం లేదా రెండో వారంలో చేపట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే మరిన్ని వ్యాఖ్యలు చేసిన జితేంద్ర సింగ్.. వ్యోమగాములను అంతరిక్షంలోకి సురక్షితంగా పంపించడం ఎంత ముఖ్యమో.. అంతే సురక్షితంగా వారిని తిరిగి మళ్లీ భూమిపైకి తీసుకురావడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు. ఈ గగన్‌యాన్ రెండో మిషన్‌లో మహిళా రోబో వ్యోమమిత్ర ఉంటుందని ఈ సందర్భంగా జితేంద్ర సింగ్ వెల్లడించారు. ఆ వ్యోమమిత్ర.. మనిషి చేసే అన్ని రకాల కార్యకలాపాలను నిర్వహిస్తుందని చెప్పారు. అనుకున్న ప్రకారం.. అన్ని ప్రక్రియలు సజావుగా జరిగితే.. ఈ ప్రయోగం మరింత ముందుకు వెళ్లవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలోనే చంద్రయాన్ 3 ప్రయోగం గురించి మాట్లాడిన జితేంద్ర సింగ్.. చంద్రుని దక్షిణ ధ్రువంపైన విక్రమ్ ల్యాండర్ అడుగు పెట్టడం భారత్‌కు అతిపెద్ద విజయాన్ని సాధించిపెట్టిందని తెలిపారు. ఈ ప్రయోగంలో భాగంగా ఇస్రో శాస్త్రవేత్తలతోపాటు యావత్ భారత దేశమంతా ఎంతో టెన్షన్ పడ్డామని చెప్పారు. చివరికి ఇస్రో పంపిన చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమై ల్యాండర్ జాబిల్లిపై దిగడంతో తాము ఎంతో సంబరాలు చేసుకున్నట్లు వివరించారు.
Read More Latest Science & Technology News And Telugu News
[ad_2]
Source link
Leave a Reply