అధిక బరువు ఎలా పెరుగుతారో తెలుసా

Weight loss: కొంతమంది బరువు తగ్గడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. జిమ్‌లో చెమ చిందిస్తారు, డైటింగ్‌ ప్లాన్‌, యోగా, రన్నింగ్‌, స్విమ్మింగ్‌ లాంటివి ప్రయత్నిస్తూ బరువు తగ్గాలనుకుంటారు. వెయిట్‌ లాస్‌ అవ్వడానికి వ్యాయామం తప్పనిసరి అనడంలో సందేహం లేదు, దానితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం కూడా ముఖ్యం. వైయిట్‌ లాస్‌ అవ్వాలనుకునే వారికి ఎర్ర పప్పు (మసూర్‌ దాల్‌) బెస్ట్‌ ఆప్షన్‌ అని నిపుణులు చెబుతున్నారు. ఎర్ర పప్పుులో ప్రొటీన్‌తో పాటు అవసరమైన విటమిన్లు, మినరల్స్‌ పుష్కలంగా ఉంటాయని ఫ్యాట్‌ టూ స్లిమ్‌ డైరెక్టర్‌, పోషకాహార నిపుణురాలు, డైటీషియన్‌ శిఖా అగర్వాల్‌ శర్మ అన్నారు. ఇవి బరువు తగ్గాలనుకునేవారికి మేలు చేస్తాయని అన్నారు. ఈ పప్పులో ఎక్కువ మొత్తంలో ఫైబర్‌, కొవ్వు, కార్పోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయని అన్నారు.


ఈ పోషకాలు ఉంటాయి..
ఒక కప్పు ఎర్ర పప్పు లో 10 గ్రాముల ప్రొటీన్‌, 6 గ్రాముల ఫైబర్‌తో పాటు 180 కేలరీలు ఉంటాయి. ఒక సర్వింగ్‌ ఎర్ర పప్పులో 14 గ్రాముల ప్రోటీన్, 8 గ్రాముల ఫైబర్‌తో పాటు 120 కేలరీలు ఉంటాయి.
బరువును ఎలా తగ్గిస్తుంది..?

red lentil


బరువు తగ్గడానికి ఎర్ర పప్పు బెస్ట్‌ ఆప్షన్‌ అని శిఖా అగర్వాల్‌ సూచిస్తున్నారు. దీనిలో కొవ్వు, కార్బోహైడ్రేట్ల కంటెంట్‌ తక్కువగా ఉంటుంది. దీనిలోని అధిక ఫైబర్‌ కంటెంట్‌ కడుపును నిండుగా ఉంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరస్తుంది. ఫైబర్‌ రక్తంలోని చక్కెర స్థాయిలు నెమ్మదిగా వెళ్లేలా చేస్తుంది. ఇది బరువు తగ్గాలనుకునేవారికి మంచిది.
ప్రొటీన్‌ మెండుగా ఉంటుంది..
బరువు తగ్గాలనుకునే వారికి ప్రోటీన్ చాలా ముఖ్యం. మీరు శాఖాహారులైతే, మసూర్ దాల్ మీకు మంచి ఎంపిక. ఒక కప్పు పప్పులో 10 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఈ పప్పు మన ఆహారంలో తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఫలితంగా ఆహార కోరికలను అదుపు చేసుకొని బరువు తగ్గుతాం.
ఫైబర్‌ రిచ్‌..

lentils


ఎర్ర పప్పు మన డైట్‌లో చేర్చుకుంటే.. ఊబకాయం తగ్గుతుంది. దీనిలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఫైబర్‌ మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కడుపును నిండుగా ఉంచి, అతిగా తినకుండా నిరోధిస్తుంది. దీంతో మీ బరువు కంట్రోల్‌లో ఉంటుంది.
ఈ లాభాలు ఉంటాయి..
ఈ పప్పులో శరీరానికి అవసరమైన పోషకాలతో పాటు.. యాంటీఆక్సిడెంట్, యాంటీకార్సినోజెనిక్, హైపోలిపిడెమిక్, యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉంటాయి. ఇది తరచుగా తీసుకుంటే డయాబెటిస్‌ కంట్రోల్‌లో ఉంటుంది, క్యాన్సర్‌ మప్పును తగ్గించవచ్చు, గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
ఎలా తీసుకోవాలి..?
ఎర్ర పప్పుతో కూర, కబాబ్స్, దాల్‌ బిర్యానీ, పప్పు-బియ్యం క్యాస్రోల్ వంటి టేస్టీ టేస్టీ వెరైటీలు చేసుకుని హ్యాపీగా బరువు తగ్గొచ్చు. ఈ పప్పు వండే ముందు కనీసం 4-5 గంటలు నానబెట్టాలని శిఖా అగర్వాల్‌ అన్నారు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *