ఐటీ నియామకాలు..

గత కొన్ని నెలలుగా ఐటీ రంగంలో నియామకాలు చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా అనుభవజ్ఞులైన సిబ్బంది నియామకం గణనీయంగా తగ్గింది. అయితే ఫ్రెషర్లకు అవకాశం తగ్గినప్పటికీ రిక్రూట్‌మెంట్ మాత్రం కొనసాగే అవకాశం ఉంది. గతంలో టీసీఎస్ ఫ్రెషర్స్ కోసం రిక్రూట్‌మెంట్‌ను ప్రకటించింది. ఇప్పుడు దీన్ని అనుసరించి విప్రో కూడా ఫ్రెషర్లను రిక్రూట్‌ నియమించుకునేందుకు ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

కరోనా తర్వాత..

కరోనా తర్వాత..

కరోనా కాలంలో కంపెనీల్లో ఉద్యోగుల టర్నోవర్ చాలా ఎక్కువగా ఉంది. దీంతో చాలా కంపెనీలు ఫ్రెషర్లను నియమించుకుంటున్నాయి. ఇటీవలి కాలంలో ఈ ధోరణి భారీగా పెరిగింది. దీంతో మార్కెట్లోకి వస్తున్న యువతకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి.

మారిన పరిస్థితులు..

మారిన పరిస్థితులు..

అయితే ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మాంద్యం ఛాయలు పెరిగాయి. అది కూడా టెక్, ఐటీ సేవల కంపెనీలకు ఈ సెగ భారీగానే తగిలింది. ప్రాజెక్టులు లేక పెరిగిన ఖర్చులతో కంపెనీల మార్జిన్లు తగ్గిపోయాయి. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ కంపెనీలు ఇప్పటికీ ఫ్రెషర్లను నియమించుకోవడం ఐటీ పరిశ్రమలో గొప్ప ఊరటనిస్తోంది. ఈ క్రమంలో టీసీఎస్ దాదాపు 1.25 లక్షల మందిని నియమించుకుంటుందని తెలుస్తోంది.

అదరగొట్టిన విప్రో..

అదరగొట్టిన విప్రో..

ఇటీవల ఐటీ కంపెనీ విప్రో తన మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. దీంతో రూ.30.5 బిలియన్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అలాగే కంపెనీ ఆదాయం రూ.232.3 బిలియన్లకు పెరిగింది.

దీనికి తోడు లాభాల మార్జిన్ నిష్పత్తి 120 బేసిస్ పాయింట్లకు మెరుగుపడిందని విప్రో సీఈవో థియరీ డెలాపోర్ట్ తెలిపారు. కంపెనీ వరుసగా నాలుగో త్రైమాసికంలోనూ తన ఉద్యోగుల సంఖ్యను పెంచుకుంది. కస్టమర్లతో మంచి సంబంధాన్ని కొనసాగిస్తున్నట్లు అందుకే మంచి వృద్ధిని సాధించగలిగినట్లు విప్రో వెల్లడించింది.

రిక్రూట్‌మెంట్ ప్లాన్..

రిక్రూట్‌మెంట్ ప్లాన్..

విప్రో దాదాపు 8000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ప్రకటించింది. పూర్తి వివరాలను http://careers.wipro.com/లో చూడవచ్చు. దీని ద్వారా కంపెనీ ఉన్న వివిధ ఓపెనింగ్స్ కు అర్హతల ఆధారంగా విద్యార్థులు, ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *