News
oi-Mamidi Ayyappa
Wipro
News:
దేశీయ
ఐటీ
దిగ్గజం
విప్రో
ఇటీవల
తన
నాలుగో
త్రైమాసిక
ఫలితాలను
విడుదల
చేసింది.
అయితే
దీనికి
ముందు
కంపెనీ
ఫ్రెషర్ల
ఆన్‌బోర్డింగ్
విషయం
వివాదాస్పదం
అయిన
విషయం
తెలిసిందే.
ఈ
క్రమంలో
వేతన
కోతలు
విధించటం
చాలా
పెద్దదిగా
మారింది.
ఈ
విషయంపై
కంపెనీ
చీఫ్
హ్యూమన్
రిసోర్సెస్
ఆఫీసర్
(CHRO)
సౌరభ్
గోవిల్
స్పందించారు.
ఉన్నతస్థాయి
మేనేజ్మెంట్లోని
వారు
కంపెనీని
వీడటం,
ఫ్రెషర్ల
వివాదం
వంటి
అంశాలపై
మాట్లాడారు.
తాము
ఈ
విషయాల్లో
న్యాయంగా,
పారదర్శకంగానే
ఉన్నామని..
దురదృష్టవశాత్తు
తమని
లక్ష్యంగా
చేసుకున్నారని
వెల్లడించారు.

వాస్తవానికి
క్యాంపస్
ప్లేస్మెంట్
రిక్రూట్మెంట్
లో
ఎంపికైన
వారికి
రూ.3.5
లక్షలకు
వ్యక్తులకు
నియమించుకున్నట్లు
తెలిపింది.
అయితే
మానవ
వనరులపై
పెట్టుబడి
పెట్టి
వారికి
ట్రైనింగ్
ఇచ్చి
స్టాక్
ఇంజనీర్లు
కావటానికి
శిక్షణ
ఇచ్చినట్లు
వెల్లడించారు.
శిక్షణ
పూర్తి
చేసి,
అసెస్‌మెంట్‌ను
క్లియర్
చేసిన
తర్వాత
రూ.6.5
లక్షల
అధిక
వేతనంతో
వారిని
ఆన్‌బోర్డ్
చేస్తామని
రిక్రూట్మెంట్
సమయంలోనే
వెల్లడించినట్లు
గోవిల్
వెల్లడించారు.
ఈ
ఏడాది
క్యాంపస్
ప్లేస్మెంట్లకు
వెళ్లటం
లేదని
వెల్లడిస్తూ
ఉద్యోగులకు
హైక్స్
క్యూ-2లో
ఉంటాయని
తెలిపారు.
ఈ
క్రమంలో
మెుదటి
బ్యాచ్
వెలాసిటీ
ఫ్రెషర్లను
ఆన్‌బోర్డ్
చేసినట్లు
హెచ్ఆర్
హెడ్
వెల్లడించారు.
అయితే
ప్రస్తుతం
కంపెనీకి
ట్రేనింగ్
చేసిన
స్కిల్
అవసరం
తక్కువగా
ఉన్నందున
ఆన్
బోర్డింగ్
లేటవుతోందని
తెలిపారు.
అయితే
ఇప్పటికీ
వారి
పాత
ఆఫర్
చెల్లుబాటు
అవుతుందని
స్పష్టం
చేశారు.
అయితే
దిగువ
బ్యాండ్
లో
చేరేందుకు
కంపెనీ
పారదర్శకంగా
అవకాశాన్ని
కల్పించిందని
తెలిపారు.
90
శాతం
మంది
అభ్యర్థులు
దిగువ
బ్యాండ్‌లో
చేరేందుకు
అంగీకరించారని
ఆయన
వెల్లడించారు.
ఇది
పూర్తి
పారదర్శకంగా
జరుగుతోందని
ఎవరి
జీతంలోనూ
కోతలు
పెట్టలేదని
వివరణ
ఇచ్చారు.
English summary
Wipro HR officer clarifies over freshers onboarding issue, says 90 percent chose lower salary
Wipro HR officer clarifies over freshers onboarding issue, says 90 percent chose lower salary..
Story first published: Saturday, April 29, 2023, 10:37 [IST]