[ad_1]
మూడవ స్థానం దిశగా..
బ్రిటన్ ను వెనక్కి నెట్టిన భారత్.. ఇటీవల ప్రపంచ టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో చోటు సంపాదించింది. 2029 నాటికి జపాన్ ను సైతం దాటి మూడవ స్థానానికి దూసుకుపోతుందని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రపంచ ఆర్థిక ర్యాంకింగ్ 2022 ప్రకారం.. ఈ ఏడాది మొదటి త్రైమాసికం (ఏప్రిల్ – జూన్) లో 13.5 శాతం వృద్ధితో దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం చూస్తే RBI వేసిన 16.5 శాతం అంచనాను మాత్రం అందుకోలేకపోయింది.
ఇవే ప్రపంచ మేటి
ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అగ్రరాజ్యం అమెరికా కొనసాగుతోంది. ఆ దేశ GDP 26 ట్రిలియన్ డాలర్లు కాగా.. ప్రపంచ GDPలో ఇది దాదాపు 24 శాతానికి పైమాటే. ప్రపంచ GDPలో 20 శాతంతో చైనా రెండో స్థానాన్ని ఆక్రమించింది. 4.8తో మూడవ స్థానంలో జపాన్, 4.1తో నాలుగులో జర్మనీ ఉన్నాయి. 3.8 ట్రిలియన్ డాలర్లతో, ప్రపంచ GDPలో 3.5 శాతంతో భారత్ ఐదో స్థానంలో ఉంది.
ద్రవ్యోల్బణంమే పెద్ద సమస్య
అగ్రరాజ్యం అమెరికాతో సహా యూరప్ దేశాలు.. గత 40 సంవత్సరాల్లోకెల్లా తీవ్ర స్థాయిలో ద్రవ్యోల్బణం సమస్యను ఎదుర్కొంటున్నాయి. చైనా సైతం దాదాపుగా ఇదే పరిస్థితిలో ఉంది. నిర్మాణ రంగంలో క్షీణత, బ్యాంకింగ్ రంగంలో ఆటుపోట్లతో మన దేశమూ ఇబ్బంది పడుతోంది.
కానీ పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మాత్రం ఇక్కడ ద్రవ్యోల్బణం చాలా తక్కువ. PLI పథకం ప్రకటించడం, ఆటోమొబైల్ భాగాలు, సెమీకండక్టర్లు, టెలికాం పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, వైద్య పరికరాల తయారీలో చైనాతో పోటీపడటం కోసం చూస్తోంది. తద్వారా ఈ ఏడాది పరిస్థితి మరింత మెరుగవుతుందని ఆశిస్తున్నారు.
[ad_2]
Source link