[ad_1]
అంచనాల్లో దాదాపు సగానికి కోత:
ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను వరల్డ్ బ్యాంక్ సవరించింది. 3% వృద్ధి నమోదవుతుందని గత జూన్‌లో ప్రకటించినా… అధిక ద్రవ్యోల్బణం కారణంగా మాంద్యం భయాలు వెంటాడుతూనే ఉన్నట్లు పేర్కొంది. తద్వారా వృద్ధి రేటు 1.7 శాతానికి పరిమితమవుతుందని తెలిపింది. 2009 ఆర్థిక సంక్షోభం, 2020 కరోనా విలయతాండవం అనంతరం మూడవ సారి అత్యంత తక్కువ వృద్ధి రేటు నమోదుకానున్నట్లు అంచనా వేసింది. వెరసి మూడేళ్లలో రెండవ సారి సంక్షోభం దిశగా ప్రపంచం పయనిస్తోందంటూ హెచ్చరించింది.
అమెరికాకూ తప్పని తిప్పలు…
ఆయా ప్రభుత్వాల రుణ భారాలు, అసమాన ఆదాయ వ్యయాలు, యుద్ధాలు… అభివృద్ధి చెందుతున్న దేశాల ఎదుగుదలకు ఆటంకం కలిగిస్తున్నాయని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. ఇదే సమయంలో అమెరికా వృద్ధి 0.5 శాతానికి పడిపోతుందని అంచనా వేసింది. 1970 నుంచి ఇప్పటి వరకు ఆ దేశానికి ఇదే అత్యంత తక్కువ వృద్ధి(అనధికారికంగా) కావడం గమనార్హం. ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే క్రమంలో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు 6 శాతంగా ఉంటాయని JPMorgan సీఈవో అభిప్రాయపడ్డారు.
భళా భారత్:
భారత్‌కు సంబంధించి తమ అంచనాలు దాదాపు స్థిరంగానే ఉన్నట్లు వరల్డ్ బ్యాంక్ తెలిపింది. గతంలో 6.9% వృద్ధి రేటు అంచనా వేయగా… కేవలం మూడు బేస్ పాయింట్లు తగ్గించి 6.6 శాతానికి కుదించింది. కరోనా ఆంక్షల సడలింపు కారణంగా పొరుగు దేశం చైనాలో ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోనున్నట్లు పేర్కొంది. 2020లో 2.7 శాతం అంచనా వేయగా… ఈ ఏడాది 4.3 శాతం సాధించవచ్చని చెప్పింది. ఐరోపా దేశాల నుంచి ఎటువంటి వృద్ధిని ఆశించలేమని వెల్లడించింది.
యుద్ధమే ముంచేసింది…
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం కారణంగా ఇరు దేశాలు చాలా తీవ్రంగా నష్టపోనున్నట్లు ప్రపంచ బ్యాంక్ అభిప్రాయపడింది. రష్యాపై ఆంక్షల నేపథ్యంలో ఇప్పటికే ఆ దేశం మాంద్యంలో చిక్కుకోగా… మరో 4.1 శాతం మేరకు వృద్ధి మందగిస్తుందని తెలిపింది. యుద్ధంలో వల్ల ఉక్రెయిన్‌లో ఇప్పటికే పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు నాశనమయ్యాయంది. అందువల్ల 45.1 శాతం మేర వృద్ధి మందగించనున్నట్లు పేర్కొంది.
[ad_2]
Source link