చైనీస్ లాంగ్వేజ్‌లో హువాంగ్చా అని పిలిచే ఈ టీని ఒకప్పుడు రాజకుటుంబీకులు, సంపన్న వర్గాలకు చెందిన వారే తాగేవారు. అయితే, నేడు ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌లో దీనిని కొనుక్కోవచ్చు. దీని వల్ల కలిగే లాభాలు అన్ని ఇన్ని కావు. ఈ టీ గురించి ముఖ్య విషయాలన్నీ చూద్దాం.

ఎల్లో టీలోని గుణాలు..

ఎల్లో టీ అంటే.. కామెల్లియా సినెన్సిస్ మొక్క నుండి ప్రాసెస్ చేసిన ఆకులతో చేస్తారు. ఇది చూడ్డానికి గ్రీన్ టీ లానే ఉంటుంది. ఇది మిగతా టీల కంటే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది.

ఈ ఎల్లో టీలో పాలీఫెనాల్స్ ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడతాయి. అంతేకాకుండా హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ నుండి మిమ్మల్ని రక్షిస్తాయి. ఇందులోని పాలీఫెనాల్స్ రక్తంలోని చక్కెర నియంత్రణని మెరుగుపరుస్తాయి. దీని వల్ల షుగర్ పేషెంట్స్‌కి మంచిది.

Also Read : Coffee for Weight Loss : ఈ కాఫీలు తాగితే బరువు తగ్గడాన్ని ఎవరు ఆపలేరు..

గుండె ఆరోగ్యానికి..

గుండె ఆరోగ్యానికి..

ఎల్లో టీ తాగడం గుండెకి మంచిదని చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. దాదాపు అన్ని టీ రకాలలానే ఎల్లో టీలో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి గుండె జబ్బుల నుండి రక్షిస్తాయి. ఎండోథెలియల్ కణాల యాంటీ ఆక్సిడెంట్ రక్షణను కూడా పెంచి కరోనరీ హార్ట్ ప్రాబ్లమ్స్‌ నుండి రక్షిస్తాయి. ఈ టీలోని ముఖ్య సమ్మేలనాలైన ఫ్లేవనోల్స్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.

క్యాన్సర్స్‌కి దూరంగా..

క్యాన్సర్స్‌కి దూరంగా..

ఎల్లో టీలో ఎన్నో బయోయాక్టివ్ సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి క్యాన్సర్‌కి వ్యతిరేకంగా పని చేస్తాయి. ఈ సమ్మేలనాలు ఆక్సీకరణ, వాపుతో పోరడతాయి. ఈ కారణంగా క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. టీలోని పాలీఫెనాల్స్ క్యాన్సర్‌కి వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఈ సమ్మేళనాలు యాంటీ ఆక్సిడెంట్స్‌గా పనిచేయడమే కాకుండా సెల్యులార్ మెకానిజమ్స్‌ని ప్రభావితం చేస్తాయి.

షుగర్ పేషెంట్స్‌కి మందులా..

షుగర్ పేషెంట్స్‌కి మందులా..

ఎల్లో టీ టైప్ 2 డయాబెటిస్ సమస్యల్ని దూరం చేస్తుంది. దీనికి కారణం ఇందులోని పాలీఫెనాల్స్. టీలోని పాలీఫెనాల్స్ ప్రధాన కారకం కాటెచిన్స్. ఇవి ఎలుకలపై జరిగిన పరిశోధనలో ఊబకాయం, జీవక్రియ సిండ్రోమన్ ఎదుర్కోవడంలో సాయపడుతుందని తేలింది. అదే విధంగా పాలీ ఫెనాల్స్ రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కూడా ప్రభావితం చేసి డయాబెటిస్ సమస్యల్ని నియంత్రిస్తాయి.

జీర్ణ సమస్యలు..

జీర్ణ సమస్యలు..

ఈ టీ తాడం వల్ల జీర్ణ సమస్యలు చాలా వరకూ దూరమవుతాయి. విరేచనాలు, అల్సర్స్ వంటివన్నింటికి ఈ టీ మందులా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు.
Also Read : Stove Cleaning : స్టౌని ఇలా క్లీన్ చేయండి.. మెరిసిపోద్ది..

బరువు తగ్గడం..

బరువు తగ్గడం..

ఎల్లో టీ బరువుని కూడా తగ్గిస్తుంది. బాడీ మాస్ ఇండెక్స్‌ని తగ్గిస్తుంది. దీనిని తాగినప్పుడు కడుపు నిండుగా అనిపిస్తుంది. అందుకే చాలా వరకూ ఆకలిగా అనిపించదు. దీనిని తాగడం వల్ల శరీర బరువు తగ్గి వృద్దుల్లో గుండె జబ్బులు దూరమవుతాయని తేలింది.

ఫ్యాటీ లివర్..

ఫ్యాటీ లివర్..

ఈ టీలోని పాలీఫెనాల్స్ ఫ్యాటీ లివర్ సమస్యకి మందులా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పాలిఫెనాల్స్ లివర్‌లో కొవ్వు జీవక్రియను తగ్గించగలవని పరిశోధనలు చెబుతున్నాయి. దీనిని తాగడం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య ట్రీట్‌మెంట్‌లో బాగా పనిచేస్తుందని తెలుస్తుంది.

ఎలా తయారు చేయాలి..

ఎలా తయారు చేయాలి..

ఇంట్లోనే ఎల్లో టీ తయారు చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.

కావాల్సిన పదార్థాలు

నీరు
ఎల్లో టీ లీవ్స్

iతయారీ విధానం..

i-

ముందుగా ఓ చిన్న గిన్నెలో నీటిని వేడి చేయండి. నీరు వేడిగా అవ్వగానే కొద్దిగా అంటే కొద్దిగా అంటే 2, 3 ఎల్లో టీ లీవ్స్ వేయండి. ఓ 5 నిమిషాలు మరగనివ్వండి. ఎక్కువగా మరగనిస్తే ఆ టీలోని రుచి తగ్గుతుంది.
ఇప్పుడు ఆ టీని వడకట్టి టేస్ట్ చేయడమే.

ఎక్కువసార్లు చేసుకోవచ్చు..

ఎక్కువసార్లు చేసుకోవచ్చు..

ఈ టీ ఆకుల్ని 3 నుంచి 5 సార్లు మళ్ళీ మళ్ళీ వాడొచ్చు. ఒకసారి చేశాక పారేయకుండా వీటిని కనీసం మూడుసార్లు టీ ప్రీపేర్ చేసుకోవచ్చు. మరి ఇన్ని లాభాలు ఉన్న టీని మీరు కూడా ట్రై చేస్తారుగా..

గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Read More : Relationship News and Telugu NewsSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *