News
oi-Mamidi Ayyappa
YouTube: తమకుండే ప్రతిభను ప్రపంచానికి చూపటానికి ఈ రోజుల్లో అందుబాటులో ఉన్న అత్యంత ప్రభావవంతమైన మార్గాల్లో యూట్యూబ్ ది అగ్రస్థానం. అయితే ఇది కంటెంట్ క్రియేటర్లకు మాత్రమే కాకుండా భారత ఆర్థిక వృద్ధిలోనూ భాగంగా నిలిచింది.
2021 ఆర్థిక సంవత్సరంలో సామాజిక మాద్యమం యూట్యూబ్ భారత జీడీపీకి రూ.10,000 కోట్లను అందంచింది. ఈ విషయాన్ని గూగుల్ అండ్ ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ నివేదిక వెల్లడించింది. సుమారు 5,633 మంది యూట్యూబ్ క్రియేటర్ల ద్వారా సేకరించిన సమాచారంతో ఈ రిపోర్టును తయారు చేశారు. ఇందులో యూజర్లతో పాటు బిజినెసెస్ కూడా ఉన్నాయి.

2021లో యూట్యూబ్ ఇండియా మెుత్తం 7,50,000 ఫుల్ టైమ్ ఉద్యోగాలకు సమానమైన జాబ్స్ సృష్టించిందని నివేదిక వెల్లడించింది. 2020లో యూట్యూబ్ భారత జీడీపీకి రూ.6,800 కోట్లను జోడించింది. ఇదే సమయంలో 6,83,900 ఉద్యోగాలకు మద్దతునిచ్చింది. 2020లో యూట్యూబ్ ఛానళ్ల సంఖ్య భారీగా పెరిగింది. పైగా యూట్యూబ్ ఇటీవల కోర్సులను కూడా ప్రవేశపెట్టింది. ఇది ఇప్పటికే దేశంలో వ్యాపారాలను నిర్వహిస్తున్న బైజూస్, వేదాంతు వంటి ఎడ్ టెక్ కంపెనీలకు భారీ దెబ్బగా నిలవనుంది. ఇప్పుడు కంటెంట్ క్రియేటర్లకు అందుబాటులో ఉన్న ఎనిమిది మానిటైజేషన్ పద్ధతుల్లో ఇది కూడా ఒకటి.
భారతదేశంలో అర్హత కలిగిన కంటెంట్ క్రియేటర్లు కోర్సుల ద్వారా ట్యుటోరియల్లను అందించవచ్చని కంపెనీ వెల్లడించింది. ఇది వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానున్నట్లు కంపెనీ ఇటీవల ప్రకటించింది. ప్రస్తుతం పనిచేస్తున్న ప్రతి ఇద్దరు వినియోగదారులలో ఒకరు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి యూట్యూబ్ పై ఆధారపడుతున్నారు. 45% మంది ఉద్యోగార్ధులు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కోసం YouTubeని ఉపయోగిస్తున్నారు.
English summary
Youtube contributed 10000 crores to indian GDP with content creators jobs
Youtube contributed 10000 crores to indian GDP with content creators jobs
Story first published: Friday, December 23, 2022, 10:10 [IST]