వైఎస్సార్ సన్నిహితులు..
వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఏర్పాటుకు సిద్ధమైన షర్మిల.. జిల్లాల వారీగా నేతలతో మంతనాలు పూర్తయిన వెంటనే అధికారికంగా పార్టీ పేరును, అజెండాను, విధివిధానాలను ప్రకటించనున్నారు. ఏప్రిల్ 10లోగా ప్రక్రియ పూర్తవుతుందని ఆమె అనుచరులు చెబుతున్నారు. కాగా, ‘కథన రంగంలో యువనేతలు.. వ్యూహ రచనలో సీనియర్లు’ అనే విధానంతో మంత్రాంగం నడుపుతోన్న షర్మిల.. తన తండ్రి వైఎస్సార్ కు అత్యంత సన్నిహితులుగా మెలిగిన సీనియర్ నేతలను ఒక్కొక్కరిని రంగంలోకి దింపబోతున్నట్లు తెలుస్తోంది. ఆ జాబితాలో వరంగల్ జిల్లాకు చెందిన ముఖ్యనాయకులూ ఉన్నట్లు సమాచారం..

ఇద్దరు మాజీ మంత్రులు..
వైఎస్సార్ జమానాలో ఓ వెలుగు వెలిగి, ప్రస్తుతం కళగ్గి, సరైన మలుపు కోసం ఎదురుచూస్తోన్న ఇద్దరు మాజీ మంత్రులు షర్మిల పార్టీలో శెరీయ్యేందుకు సిద్ధమయ్యారట. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో అతి కీలక, ముఖ్యమైన శాఖలను నిర్వహించిన ఆ ఇద్దరు మాజీ మంత్రుల్లో ఒకరు ఫైర్ బ్రాండ్ నేతగా పేరు పొందగా, మరొకరు కాంగ్రెస్లో కీలక పదవి నిర్వహించిన వ్యక్తి అని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ..

షర్మిలతో మాట ముచ్చట
బలమైన అనుచరగణం ఉన్నప్పటికీ, ఇప్పటికే రెండు పార్టీలు మారి, ఇమేజ్ కాస్త అటు ఇటయి, ఇప్పుడొక మలుపు కోసం ఎదురుచూస్తోన్న ఓ ఫైర్ బ్రాండ్ నేత అలాగే, వైఎస్ హయాంలో కీలక శాఖ, ఆనక కాంగ్రెస్ లో కీలక పదిని సైతం నిర్వహించ మరో మాజీ మంత్రి సీనియరే అయినప్పటికీ, పెద్దగా మాస్ ఫాలోయింగ్ లేని నేత.. ఈ ఇద్దరూ షర్మిలతో కలిసి పనిచేసేందుకు ఒకే చెప్పేశారని, మాట ముచ్చట కూడా దాదాపు అయిపోయిందని,షర్మిల అనుకూల మీడియాలో వార్తలొచ్చాయి. అయితే, ఆ మాజీలు ఎవరు? వాళ్ల పేర్లు ఏమిటన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ గా సాగుతోంది.