Tuesday, September 21, 2021

YS Viveka Murder: రంగయ్య ఇంటి వద్ద భారీ భద్రత-తెర పైకి 3 పేర్లు-హైకోర్టుకు సునీల్ యాదవ్?

తెర పైకి ముగ్గురి పేర్లు…

జమ్మలమడుగు మెజిస్ట్రేట్‌లో రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపుతోంది. 9 మందికి ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్లుగా రంగయ్య చెప్పారన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఎర్ర గంగిరెడ్డి,సునీల్ యాదవ్,దస్తగిరి అనే ముగ్గురికి ఇందులో ప్రమేయం ఉందని రంగయ్య వెల్లడించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సునీల్ యాదవ్‌ను సీబీఐ అధికారులు పలుమార్లు ప్రశ్నించారు. తాజాగా హైకోర్టును ఆశ్రయించిన సునీల్ యాదవ్ తనను అరెస్ట్ చేయకుండా పోలీసులకు ఆదేశాలివ్వాలని కోర్టును కోరడం గమనార్హం.

కోర్టులో సునీల్ యాదవ్ పిటిషన్...

కోర్టులో సునీల్ యాదవ్ పిటిషన్…

వైఎస్ వివేకా హత్య కేసులో ప్రస్తుతం ముగ్గురి పేర్లు తెర పైకి రాగా… అందులో ఒకరైన సునీల్ యాదవ్ హైకోర్టులో పిటిషన్ వేయడం చర్చనీయాంశంగా మారింది. జమ్మలమడుగు కోర్టులో రంగయ్య వాంగ్మూలం ఇస్తుండగానే సునీల్ యాదవ్ హైకోర్టును ఆశ్రయించడం వెనుక ఆంతర్యమేంటా అన్న చర్చ జరుగుతోంది.సునీల్ యాదవ్ యాదవ్‌ వెనుక ఏ శక్తులు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సునీల్ యాదవ్‌ గతంలో వైఎస్ వివేకా వద్దే చాలా కాలం పనిచేసినట్లు తెలుస్తోంది. అయితే ఇద్దరి మధ్య వివాదాలు చోటు చేసుకోవడంతో వివేకా ఆయన్ను దూరం పెట్టినట్లుగా చెబుతున్నారు. తాజాగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తన అనుమతి లేకుండానే నార్కో అనాలిసిస్,లై డిటెక్టర్ టెస్టులు చేస్తున్నారని సునీల్ యాదవ్ పేర్కొన్నారు. అంతేకాదు,తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు.

నూతన విచారణ అధికారి...

నూతన విచారణ అధికారి…

జమ్మలమడుగు మెజిస్ట్రేట్‌లో వాంగ్మూలం అనంతరం ఇంటికి చేరుకొన్న రంగయ్య… ఎర్ర గంగిరెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. హత్య కేసుకు సంబంధించిన విషయాలను బయటకు వెల్లడిస్తే.. ‘నిన్ను నరుకుతా… చంపుతా…’ అని ఎర్ర గంగిరెడ్డి బెదిరించినట్లు రంగయ్య ఆరోపించారు. మరోవైపు గంగిరెడ్డి మాత్రం రంగయ్య ఆరోపణలను తోసిపుచ్చారు. రంగయ్య మద్యం మత్తులో ఆ వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు. అసలు ఆయనతో తనకు పరిచయమే లేదని… ఆయన్ను తాను ఎందుకు చంపుతానని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ హత్య కేసును డీఐజీ సుధా సింగ్ పర్యవేక్షిస్తున్నారు.నూతన విచారణ అధికారిగా ఎస్పీ రాం కుమార్‌ను నియమించారు.


Source link

MORE Articles

Alzheimer’s Disease: इस लाइलाज बीमारी की शुरुआत में मिलने लगते हैं ये संकेत, तुरंत उठाएं ये कदम

Alzheimer's Day: 21 सितंबर को पूरे विश्व में वर्ल्ड अल्जाइमर डे (World Alzheimer's Day 2021) के रूप में मनाया जाता है. यह एक...

పొలిటికల్ గేమ్ చేంజ్: డ్రగ్స్ కేసు హైలెట్ చేస్తున్న కాంగ్రెస్.. డిఫెన్స్ లో కేటీఆర్; రేవంత్ వార్ వ్యూహాత్మకం

టీఆర్ఎస్ మంత్రులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు .. డిఫెండ్ చేస్తున్న మంత్రులు తెలంగాణ పిసిసి చీఫ్ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి రేవంత్ రెడ్డి తెలంగాణ...

Salesforce invests in Indian fintech unicorn Razorpay

The funding may have pushed Razorpay's valuation to over US$3 billion, Livemint reported. Source link

కేంద్రం కోర్టులోకి జోగి రమేష్ ఘటన-హోంశాఖకు టీడీపీ ఫిర్యాదు-చంద్రబాబుకు మరింత భద్రత !

వైసీపీ వర్సెస్ టీడీపీ పోరు ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య పోరాటం పదేళ్లుగా సాగుతూనే ఉంది. అయితే 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత అప్పటికే ఘోర...

Beauty Tips: मक्खन-सी त्वचा चाहिए, तो फेस पर ऐसे लगाना शुरू करें ताजा मक्खन, चेहरा चमक जाएगा

सितंबर का महीना चालू है और इस समय मौसम में बदलाव होता है. बरसात का मौसम जा रहा होता है और सर्दियां आने...

Illegal affair: ప్రియుడు, అక్కతో కలిసి భర్తను ముక్కలుగా నరికేసింది, ఫ్లాట్ లో కెమికల్స్ వేసి !

లిక్కర్ వ్యాపారి బీహార్ లోని ముజఫర్ పూర్ లోని సికందర్ పూర్ నగర్ లో రాకేష్ (30), రాధా దంపతులు నివాసం ఉంటున్నారు. రాకేష్ అంతకు ముందు లిక్కర్...

భారత విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్: 5 నెలల తరువాత నిషేధం ఎత్తేసిన ఆ దేశం

టోరంటో: ప్రాణాంతక కరోనా వైరస్ సెకెండ్ వేవ్, ప్రమాదకరమైన డెల్టా ప్లస్ వేరియంట్ వ్యాప్తి చెందుతోన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భారత్‌తో అనేక దేశాలు విమాన సంబంధాలను తెంచుకున్నాయి. కరోనా వల్ల సంభవించిన...

Mahant Narendra Giri death case: యోగి సర్కార్‌పై అనూహ్య ఒత్తిడి: ఏకమౌతోన్న అఖాడా పరిషత్

కీలకంగా మారిన లేఖ అఖాడా పరిషత్ ప్రధాన కేంద్రంలో మహంత్ నరేంద్ర గిరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. సంఘటనా స్థలం నుంచి పోలీసులు ఎనిమిది పేజీల...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe