PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

YSR Law Nestham: నాలుగో ఏడాది ‘YSR లా నేస్తం’ విడుదల.. సీఎం YS Jagan మరో తీపి కబురు


News

oi-Mamidi Ayyappa

|

YSR Law Nestham: అన్న చెప్పాడంటే.. చేస్తాడంతే అనటానికి ఈరోజు విడుదల చేసిన ‘YSR లా నేస్తం’ నిధులే ఉత్తమ ఉదాహరణ. వరుసగా నాలుగో ఏడాది సైతం సీఎం జగన్ అర్హులైన జూనియర్‌ న్యాయవాదుల ఖాతాల్లోకి నిధులను విడుదల చేశారు.

YSR Law Nestham: నాలుగో ఏడాది 'YSR లా నేస్తం' విడుదల.. సీఎం

ఈరోజు సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి రాష్ట్ర వ్యాప్తంగా 2,011 మంది జూనియర్ లాయర్ల ఖాతాల్లో రూ.1,00,55,000ను YSR లా నేస్తం కింద జమ చేశారు. న్యాయవాదులకు తోడుగా నిలిచేందుకు చేస్తున్న ప్రయత్నంలో భాగంగా నెలకు రూ.5 వేలు ఆర్థిక సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. వృత్తికి ఊతం ఇచ్చేందుకు.. లాయర్లు రాజ్యాంగాన్ని, చట్టాన్ని చదువుకుని న్యాయవాదులుగా స్ధిరపడడానికి ప్రభుత్వం అందించే సాయం ఎంతగానో దోహదపడనుంది.

YSR Law Nestham: నాలుగో ఏడాది 'YSR లా నేస్తం' విడుదల.. సీఎం

ప్రభుత్వం తోడుగా నిలబడ్డటం వల్ల డబ్బులేని పేదవాడికి సహాయం చేసేందుకు యువ న్యాయవాదులు కృషి చేస్తారని సీఎం జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు. పేదవాడికి సాయం చేయాలన్న తలంపు మనసులో రావాలన్నది తన ఆకాంక్ష అని వెల్లడించారు. ప్రభుత్వం ఈ పథకం కింద మూడున్నరేళ్లలో దాదాపు 4,248 మంది లాయర్ల కోసం ప్రభుత్వం రూ.35.40 కోట్లను సహాయంగా అందించింది.

YSR Law Nestham: నాలుగో ఏడాది 'YSR లా నేస్తం' విడుదల.. సీఎం

న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో లాయర్ల కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేసినట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. కోవిడ్‌ సమయంలో కూడా కార్పస్‌ ఫండ్‌ అందుబాటులో ఉన్న నేపధ్యంలో దాదాపుగా రూ.25 కోట్ల వరుకు సహాయం అందించటం జరిగింది. దీనికోసం లా సెక్రటరీకి నేరుగా దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఆన్‌లైన్‌లో లా సెక్రటరీ మెయిల్‌ ఐడీకి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. sec_law@ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లా నేస్తం పథకానికి కూడా ఎవరైతే దరఖాస్తు చేసుకునేందుకు ysrlawnestham.ap.gov.in వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసుకోవచ్చు.

YSR Law Nestham: నాలుగో ఏడాది 'YSR లా నేస్తం' విడుదల.. సీఎం

English summary

YSR Law Nestham funds released by CM jagana in 4th year with 5000 per month

YSR Law Nestham funds released by CM jagana in 4th year with 5000 per month

Story first published: Wednesday, February 22, 2023, 14:44 [IST]



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *