PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Zomato మీకు తెలియకుండా దాస్తున్న విషయం.. కొత్త కష్టాల్లో Blinkit..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Blinkit Vs Blinkhit: జొమాటో యాజమాన్యంలోని కిరాణా డెలివరీ సర్వీస్ ప్రొవైడర్ బ్రింకిట్ కొత్త కష్టాలను ఎదుర్కొంటోంది. బెంగళూరు కేంద్రంగా వ్యాపారాన్ని నిర్వహిస్తున్న Blinkhit అనే సంస్థ న్యాయపోరాటానికి దిగింది. దీంతో ఈ విషయం సివిల్ వివాదంగా మారి కోర్టుకు చేరుకుంది.

జొమాటో కొనుగోలు చేసిన బ్లింకిట్ అనేది గురుగ్రామ్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక స్టార్టప్ కంపెనీ. దీనికి గతంలో Grofers అని పేరుతో కిరాణా సరుకులను డెలివరీ చేసే వ్యాపారాన్ని నిర్వహించేది. అయితే 2022లో ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో దీనిని కొనుగోలు చేసింది. ఆ తర్వాత గ్రోఫర్స్ పేరును బ్లింకిట్ గా మార్చారు.

Zomato మీకు తెలియకుండా దాస్తున్న విషయం.. కొత్త కష్టాల్లో

అయితే Blinkhit అనేది బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఒక చిన్న సాఫ్ట్ వేర్ సంస్థ. దీనిని ప్రారంభించి దాదాపు 7 ఏళ్లు అయింది. అయితే ఈ క్రమంలో Blinkit పేరుతో ట్రేడ్ మార్క్ కోరుతూ 2021లో దరఖాస్తు చేసింది. అయితే 2022లో పేరు మార్చబడిన గ్రోఫర్స్ ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు పాల్పడిందంటూ సాఫ్ట్ వేర్ కంపెనీ దావా వేసింది. దీనిపై స్పందించిన జొమాటో బ్రింకిట్ రెండు వ్యాపారాలకు ఎక్కడా సంబంధం లేదని.. పైగా కంపెనీ తక్కువ ఆదాయాలు కలిగి ఉందని వాధించింది.

ఈ వివాదంలో కోర్టు ప్రాథమిక విచారణ తర్వాత సాఫ్ట్ వేర్ కంపెనీ అయిన బ్లింక్‌కిట్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ క్రమంలో ట్రేడ్‌మార్క్‌ని ఉపయోగించకుండా బ్లింకిట్‌ని నిలువరిస్తూ ఒక నిషేధాజ్ఞను జారీ చేసింది. పూర్తి విచారణ జరిగే వరకు బ్లింకిట్ దాని ట్రేడ్‌మార్క్‌ను ఉపయోగించకుండా సమర్థవంతంగా నిలువరించింది. దీనిపై జొమాటో బ్లింకిట్ వెంటనే కర్ణాటక హైకోర్టును ఆశ్రయించగా.. సివిల్ కోర్టు ఉత్తర్వులపై స్టే రావటంతో ఉపశమనం లభించింది.

Zomato మీకు తెలియకుండా దాస్తున్న విషయం.. కొత్త కష్టాల్లో

దీనికి ఒక పరిష్కార మార్గం ఉంది. బ్లింకిట్ ట్రేడ్ మార్కును జొమాటో సాఫ్ట్ వేర్ సంస్థ నుంచి కొనుగోలు చేయటం ఉత్తమమైన, సరళమైన పరిష్కారమని కొందరు సూచిస్తున్నారు. బ్లింకిట్ గతంలో రెడ్‌స్టోన్ కన్సల్టెన్సీకి వ్యతిరేకంగా న్యాయ పోరాటంలో చిక్కుకుంది. మునుపటి పేరు గ్రోఫర్స్.. రెడ్‌స్టోన్ యాజమాన్యంలోని రియల్ ఎస్టేట్ సేవల సంస్థ Groffr.com లాగానే ఉంది.

English summary

Zomato’s Blinkit in trademark dispute with bangalore based software company Blinkhit know details

Zomato’s Blinkit in trademark dispute with bangalore based software company Blinkhit know details

Story first published: Friday, March 17, 2023, 12:34 [IST]

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *