zuno: వాహన బీమా కోసం చూస్తున్నారా?.. ఈ ఫీచర్లు చూస్తే మరోటి తీసుకోరేమో..!!

[ad_1]

హార్డ్ వేర్ నిపుణులు ఒక్కరే సరిపోరు:

హార్డ్ వేర్ నిపుణులు ఒక్కరే సరిపోరు:

సాధారణ, ఎలక్ట్రిక్ వాహనాలు చూడటానికి ఒకే విధంగా కనిపించినా.. లోపలి భాగాలు, పనితీరు పూర్తి విరుద్ధంగా ఉంటాయని బీమా సంస్థ జునో(గతంలో Edelweiss జనరల్ ఇన్యూరెన్స్) అభిప్రాయపడింది. దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే.. తిరిగి బాగుచేయడానికి కేవలం హార్డ్ వేర్ నిపుణులు మాత్రమే సరిపోరని పేర్కొంది. దానితో పాటు సాఫ్ట్ వేర్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ పరిజ్ఞానం అవసరమని గర్తుచేసింది.

EVల కోసమే ప్రత్యేక పాలసీ:

EVల కోసమే ప్రత్యేక పాలసీ:

EVలను కవర్ చేసే బీమా పాలసీలు ఇప్పటికే మార్కెట్‌ లో ఉన్నా, ఎలక్ట్రిక్ వాహనాల ప్రత్యేక స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడలేదని జునో MD & CEO షనాయ్ ఘోష్ తెలిపారు. అందుకే తమ భవిష్యత్ ప్రణాళికల్లో భాగంగా.. భారతదేశంలో మొట్టమొదటిగా EVల కోసం ఓ వినూత్న పాలసీని తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. FY2024 Q2 నుంచి దీనిని పూర్తిగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు.

బెస్ట్ పాలసీలు:

బెస్ట్ పాలసీలు:

జునో తాజాగా ప్రవేశపెట్టిన బీమా పాలసీలు ‘డ్రైవ్ లెస్-పే లెస్, డ్రైవ్ బెటర్-పే లెస్’ బాగా ప్రాచుర్యం పొందాయి. కేవలం బీమాతో పాటు సాంకేతికత సహాయంతో డ్రైవింగ్ ను మెరుగుపరచుకునేందుకు సైతం సహయం చేసే విధంగా ఈ పాలసీలు రూపొందించబడ్డాయి. డ్రైవింగ్ పాటర్న్స్ ఆధారంగా యాప్‌లో రివార్డ్‌ లనూ సంపాదించుకోవచ్చు. ప్రీమియం చెల్లించే సమయంలో వాటిని రీడీమ్ చేసుకునే అవకాశం ఉంది.

సాంకేతికతే దన్నుగా..

సాంకేతికతే దన్నుగా..

పై పాలసీల్లో.. వినియోగదారులు కొత్తగా బీమా తీసుకున్న తర్వాత మొబైల్ యాప్‌ ని డౌన్‌ లోడ్ చేసుకుని నమోదు కావాల్సి ఉంటుంది. స్మార్ట్ ఫోన్‌ లోని గైరోస్కోప్, ఇతర సెన్సార్‌ ల ద్వారా.. కస్టమర్ డ్రైవింగ్ విధానాన్ని ఆ యాప్ ట్రాక్ చేసి స్కోరు అందిస్తుంది. ఈ డేటాను విశ్లేషించి డ్రైవింగ్ విధానం మెరుగుపరచుకోవడానికి, సురక్షితమైన డ్రైవింగ్ నమూనాలను అనుసరించడానికి జనో సహాయపడుతుంది.

సురక్షితమైన డ్రైవింగ్ ద్వారా డ్రైవింగ్ వృద్ధి

సురక్షితమైన డ్రైవింగ్ ద్వారా డ్రైవింగ్ వృద్ధి

ప్రస్తుతం దాదాపు అన్ని బీమా కంపెనీలు వాహనం తయారీదారు, మోడల్, వేరియంట్, వయసు, కవర్, యాడాన్లు, నో క్లెయిమ్ బోనస్ ఆధారంగా ప్రీమియంను తగ్గిస్తున్నాయి. కానీ అందుకు విభిన్నంగా వాహనాలను సురక్షితంగా ఉపయోగించే వ్యక్తులకు రివార్డులు అందించనున్నట్లు జునో చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ రాకేష్ కౌల్ తెలిపారు. ఇలా అధునాతన డేటాను అందించడం ద్వారా స్థిరమైన వృద్ధితో మరింత ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు.

డిజిటల్ అడాప్షన్:

డిజిటల్ అడాప్షన్:

దేశంలో డిజిటల్ అడాప్షన్ ద్వారా అనేక ఫీచర్లను కొత్తగా పరిచయం చేసిన మొదటి కంపెనీగా జునోకు మంచి పేరు ఉంది. వాహనం వినియోగంలో లేనప్పుడు బీమా స్విచ్ ఆఫ్ చేయడం, ఆటోమేటెడ్ క్లెయిమ్ రిజిస్ట్రేషన్ కోసం AI వాయిస్ బాట్, ఆన్ డిమాండ్ మొబైల్ టెలిమాటిక్స్ ఆధారిత బీమా పాలసీ, పే యాజ్ యు డ్రైవ్, అవుట్ ఆఫ్ నెట్వర్క్ క్యాష్ అడ్వాన్స్ వంటివి వాటిలో ప్రాముఖ్యమైనవి.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *