[ad_1]
ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే.. ఆహారాల గురించి పోషకాహార నిపుణురాలు లవ్‌నీత్ బాత్రా మనతో పంచుకున్నారు. లంగ్స్‌ను ఆరోగ్యాంగా ఉంచుకోవడానికి స్మోకింగ్‌కు దూరంగా ఉండాలని, కలుషిత ప్రాంతాలకు వెళ్లకూడదని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడానికి.. సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం అని లవ్‌నీత్ బాత్రా అన్నారు.
ఆహారం
పసుపు..
పసుపులో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీనిలోని కర్క్యుమిన్ అనే ప్రత్యేక మూలకం ఉండటంతోపాటు… యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండటం వల్ల ఊపిరితిత్తులకు మేలు జరిగి వాటి సామర్థ్యం పెరుగుతుంది.
క్యాప్సికమ్..
క్యాప్సికమ్‌లో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది మీ శరీరంలో యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఉపిరితిత్తుల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.
అల్లం..
అల్లం తరచుగా మన డైట్లో చేర్చుకుంటే.. హైపర్క్సియా, వాపు వల్ల ఉపిరితిత్తులకు కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. అల్లం.. ఊపిరితిత్తులలో పేరుకున్న మందపాటి శ్లేష్మాన్ని విఛ్చిన్నం చేసి, శరీరం నుంచి బయటకు వెళ్లడానికి సహాయపడుతుంది.
బార్లీ..
బార్లీలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అధిక ఫైబర్ ఊపిరితిత్తుల పనితీరుపై ప్రొటెక్టివ్ ఎఫెక్ట్‌ను చూపుతాయి. ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధుల కారణంగా మరణించే ప్రమాదాన్ని తగ్గించడంలో ఇటువంటి ఆహారాలు సహాయపడతాయి.
ఆకుకూరలు..
పాలకూర, కాలే, క్యాబేజీ వంటి ఆకు కూరల్లో కెరోటినాయిడ్లు, ఐరన్, పొటాషియం, కాల్షియం, విటమిన్లు మెండుగా ఉంటాయి. ఈ పోషకాల్లో శోథ నిరోధక, యాంటీఆక్సిడెంట్ ప్రభావాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల వాపును తగ్గించడంలో, వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
వాల్నట్స్..
వాల్‌నట్స్‌లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. ఇవి లంగ్ ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు శ్వాస సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.
వెల్లుల్లి..
వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది, ఇది శక్తివంతమైన యాంటీబయాటిక్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను తొలగించడంలో సహాయపడుతుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి, ఇది ఊపిరితిత్తులలో వాపును తగ్గిస్తుంది. ఆస్తమా రోగులుకు ఇది మేలు చేస్తుంది. వెల్లుల్లిలోని ఔషధ గుణాలు ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply