మహిళ చేతిలో చిత్తుగా ఓడిన అంబానీ, అదానీ – సంపన్నులంతా సైడయ్యారు

[ad_1]

Savitri Jindal Net Worth Grows: మన దేశంలో అత్యంత సంపన్నులు అనగానే అంబానీ, అదానీ, టాటా, బిర్లా పేర్లు గుర్తుకు వస్తాయి. సంపద విషయంలో వీళ్లంతా కుబేరుడి ప్రతిరూపాలు. కానీ, ఒక మహిళ వీళ్లను చిత్తుగా ఓడించింది. ఆమె పేరు సావిత్రి జిందాల్‌.

ఈ ఏడాదిలో (2023) ఎక్కువ డబ్బు సంపాదించిన వారిలో సావిత్రమ్మ టాప్‌ ప్లేస్‌లో నిలిచారు. ఈ ఒక్క సంవత్సరంలోనే ఆమె ఆస్తి 9.6 బిలియన్‌ పెరిగింది, మొత్తం సంపద విలువ 25.3 బిలియన్‌ డాలర్లకు చేరిందని ‘బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌’ ‍‌(Bloomberg Billionaires Index) డేటాను బట్టి తెలుస్తోంది. 2023లో షేర్‌ మార్కెట్‌ రైజింగ్‌ కారణంగా సావిత్రి జిందాల్‌ ఆస్తిపాస్తులు అమాంతం పెరిగాయి.

మన దేశంతో పాటు, ఆసియాలోని అత్యంత సంపన్న మహిళల్లోనూ సావిత్రి జిందాల్‌దే అగ్రస్థానం. చాలా కాలంగా ఆమె టాప్‌ ప్లేస్‌లోనే కొనసాగుతున్నారు. మొత్తం ఆసియా ఖండంలో మరే మహిళ ఆమె దరిదాపుల్లో కూడా లేరు.

2023లో ఎక్కువ డబ్బు సంపాదించిన వారి లిస్ట్‌: 

HCL టెక్‌ అధినేత శివ్‌నాడార్‌ది సెకండ్‌ ప్లేస్‌, ఈ ఏడాది ఆయన డబ్బు 8 బిలియన్‌ డాలర్లు పెరిగింది. 
DLF లిమిటెడ్‌ ఛైర్మన్‌ KP సింగ్‌ ఆస్తుల విలువ 7.15 బిలియన్‌ డాలర్లు పెరిగింది, ఆయనది థర్డ్‌ ర్యాంక్‌. 
ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార్ మంగళం బిర్లా & షాపూర్జీ పల్లోంజీ గ్రూప్‌నకు చెందిన షాపూర్ మిస్త్రీ సంపద 6.5 బిలియన్ డాలర్ల చొప్పున పెరిగింది

ముకేశ్‌ అంబానీ సంపద ఈ ఏడాది 5.2 బిలియన్‌ డాలర్లే పెరిగింది. 98.2 బిలియన్ డాలర్ల ఆస్తులతో (Mukesh Ambani Net Worth) దేశంలోనే అత్యంత సంపన్నుడిగా అంబానీ కొనసాగుతున్నారు. ప్రపంచ రిచ్‌ పీపుల్‌ లిస్ట్‌లో ఆయనది 13వ నంబర్‌.

2023లో ఆస్తిపాస్తుల సంపాదనలో, అంబానీ తర్వాతి స్థానాల్లో సన్‌ఫార్మా MD దిలీప్‌ సంఘ్వి, రవి జైపురియా, ఎంపీ లోథా, సునీల్‌ మిత్తల్‌ ఉన్నారు.

హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ రిపోర్ట్‌తో దెబ్బతిన్న గౌతమ్‌ అదానీ ఆస్తుల విలువ 2023లో 35.4 బిలియన్‌ డాలర్లు తగ్గింది. అయినా.. మొత్తం 85.1 బిలియన్‌ డాలర్ల సంపదతో (Gautam Adani Net Worth) భారతదేశ సంపన్నుల్లో రెండో స్థానంలో ఉన్నారు. 

దేశంలో టాప్‌-5 ప్లేస్‌
బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, ఈ సంవత్సరం దేశంలోని టాప్-5 ధనవంతుల్లో (పురుషులు, మహిళలు కలిపి) ఒకరిగా సావిత్రి జిందాల్‌ నిలిచారు. విప్రోకు చెందిన అజీమ్ ప్రేమ్‌జీని వెనక్కి నెట్టి 5వ స్థానాన్ని ఆమె  దక్కించుకున్నారు. అజీమ్ ప్రేమ్ జీ సంపద 24 బిలియన్ డాలర్లు. 

సావిత్రి జిందాల్ ఎవరు?
ఓం ప్రకాశ్‌ జిందాల్‌ (OP Jindal) భార్య సావిత్రి జిందాల్. జిందాల్ గ్రూప్ చైర్‌పర్సన్ ఆమె. భర్త మరణం తర్వాత జిందాల్‌ గ్రూప్‌ నిర్వహణ బాధ్యతలను చేతుల్లోకి తీసుకున్నారు. ఈ గ్రూప్‌లో… JSW స్టీల్‌, JSW ఎనర్జీ, జిందాల్ పవర్, జిందాల్ హోల్డింగ్స్, JSW సా, జిందాల్ స్టెయిన్‌లెస్ వంటి కంపెనీలు ఉన్నాయి.

మరో ఆసక్తికర కథనం: షాక్‌ మీద షాక్‌ ఇస్తున్న గోల్డ్‌ – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవి

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *