[ad_1]
కొలెస్ట్రాల్ ఎలా కరుగుతుంది
మీ ఆహారంలో ఈ మార్పులు చేసుకోండి..
మీ డైట్లో సంతృప్త కొవ్వు, ట్రాన్స్ ఫ్యాట్ ఫుడ్‌కు బదులుగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కరిగే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఇవి రక్తంలో ట్రైగ్లిజరైడ్లనే కొవ్వు, మొత్తం కొలెస్ట్రాల్ తగ్గటానికి తోడ్పడతాయి. రక్తనాళాల్లో పూడికలు ఏర్పడటాన్ని నివారిస్తాయి. మీ ఆహారంలో దేశీ ఆవునెయ్యి, కొవ్వుతో కూడిన సాల్మన్, టూనా, సార్డైన్ వంటి చేపలను, వాల్నట్స్, అవిసె గింజలను తీసుకుంటే మంచిది. ఈ ఆహారాలు రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని కంట్రోల్లో ఉంచుతాయి.
బరువు అదుపులో ఉంచుకోండి..
శరీర బరువు పెరుగుతున్న కొద్దీ రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయులూ పెరిగే ప్రమాదం ఉంది. హైపర్‌టెన్షన్, డయాబెటిస్ ముప్పు ఎక్కువ అవుతాయి. ఇవి రక్తనాళాల గోడలను దెబ్బతీసి పూడికలు ఏర్పడేలా చేస్తాయి. కాబట్టి బరువు అదుపులో ఉంచుకోవాలి. ముఖ్యంగా బెల్లీ ప్యాట్ కరిగించుకోవాలి. దీంతో చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గటంతో పాటు మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. 5 % నుంచి 10 % బరువు తగ్గడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు చాలా వరకు అదుపులో ఉంటాయి.
స్మోకింగ్‌కు దూరంగా ఉండండి..
మీరు అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతుంటే, మీ స్మోకింగ్ అలవాటు వల్ల కావచ్చు. మీరు ధూమపానం మానేయడం వల్ల.. మీ ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుముఖం పడతాయి. హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా పెరుగుతాయి. మంచి కొలెస్ట్రాల్ మీ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఆల్కహాల్ మానేయండి..
మద్యపానానికి దూరంగా ఉండటం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. మీకు ఆల్కహాల్ తాగే అలవాటు ఉంటే.. మితంగా తీసుకోవాలి. ఆల్కహాల్ ఎక్కువగా తాగితే.. అధిక కొలెస్ట్రాల్, హైపర్‌టెన్షన్ ముప్పు పెరుగుతుంది.
వ్యాయామం చేయండి..
శారీరక శ్రమ లేకపోవడం వల్ల రక్తంలోని సిరల్లో కొవ్వు పేరుకుపోయే అవకాశాలు పెరుగుతాయి. రోజుకు అరగంట వ్యాయామం చేసినా కొలెస్ట్రాల్ తగ్గటానికి తోడ్పడుతుంది. శరీర సామర్థ్యాన్ని బట్టి ఇంకాస్త ఎక్కువసేపు చేసినా మేలే. కాస్త వేగంగా నడవటం వంటి గుండెకు పని చెప్పే వ్యాయామాలు గుండె జబ్బు, పక్షవాతం ముప్పు తగ్గేలా చేస్తాయి. బరువూ తగ్గుతుంది. (Image source – pixabay)
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply