అప్పులు తీర్చటం కోసం అల్లాడుతున్న మైనింగ్ కింగ్..! బీహారీ బిలియనీర్ ప్రస్థానం..

[ad_1]

News

oi-Mamidi Ayyappa

|

Anil Agarwal: మైనింగ్ వ్యాపారంలో ముకుటం లేని మహారాజుగా భారత వ్యాపారి అనిల్ అగర్వాల్ కు చాలా పేరుంది. తన వ్యాపార జీవితంలో ఈ బిలియనీర్ అనేక సమస్యలను ఎదుర్కొన్నాడు. దెబ్బమీద దెబ్బ కుంగదీసినప్పటికీ ముందడుగు వేయటం తప్ప మరో ఆలోయన మనసులోకి రానీయలేదు. అయితే ఇప్పుడు ఈ కుబేరుడు అప్పుల భారాన్ని తగ్గించుకోవటం కోసం పోరాడుతున్నాడు.

బీహార్‌కు చెందిన అనిల్ 1970లలో తండ్రి నుంచి అల్యూమినియం కండక్టర్ల తయారీ వ్యాపారాన్ని పొందారు. ఆ తర్వాత స్క్రాప్ మెటల్ డీలర్‌గా ప్రయాణాన్ని ప్రారంభించిన అనిల్ అగర్వాల్ ఆ తర్వాత మైనింగ్ రంగంలో కీలక సంస్థగా వేదాంతను నిర్మించారు. అయితే వ్యాపార విస్తరణ ప్రణాళికలపై నగదు కష్టాలు, ప్రభుత్వ ఘర్షణలు, వివాదాలను ఎదుర్కొన్నారు. 2024లో మెచూర్ అయ్యే బాండ్లకు చెల్లింపులు చేసేందుకు కంపెనీకి దాదాపు 2 బిలియన్ డాలర్ల నగదు ప్రస్తుతం అవసరం. ప్రపంచంలోని ప్రధాన సహజ వనరుల సరఫరాదారుగా గ్లెన్‌కోర్ Plc, BHP బిల్లిటన్‌లతో పోటీ పడాలనుకుంటున్న ఆయనకు నిధులు ప్రధాన సమస్యగా మారాయి.

అప్పులు తీర్చటం కోసం అల్లాడుతున్న మైనింగ్ కింగ్..! బీహారీ బి

అమెరికా రీసెర్చ్ సంస్థ అదానీ గ్రూప్ కలిగి ఉన్న రుణాలపై ఆందోళన వ్యక్తం చేసిన తరుణంలో వేదాంతపై కూడా ఆ ప్రభావం పడింది. వేదాంతకు రుణాలు చాలా తక్కువగా ఉన్నప్పటికీ.. దాని బాండ్లు అత్యల్ప స్థాయికి సమీపంలో రేట్ చేయబడ్డాయి. ఇదే క్రమంలో దాని అనుబంధ సంస్థల నుంచి నిధులను సేకరించే సామర్థ్యాలపై వేదాంత ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. పైగా కంపెనీ గత ఏడాది ఇన్వెస్టర్లకు అనేక మార్లు డివిడెండ్ ఆదాయం ఇవ్వటంతో నగదు నిల్వలు కొంత తగ్గాయి. దీనికి తోడు ప్రపంచ వ్యాప్తంగా రుణ రేట్లు పెరుగుదల పరిశ్రమ వర్గాలకు ఖర్చులను పెంచుతున్నాయి.

ఎంతపెద్ద సమస్య వచ్చినప్పటికీ అనిల్ అగర్వాల్ దాని నుంచి బయటపడ్డాడని 2014-2017 మధ్య వేదాంత రిసోర్సెస్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన టామ్ అల్బనీస్ వెల్లడించారు. వేదాంత అనుబంధ సంస్థ అయిన హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ పాక్షికంగా భారత ప్రభుత్వానికి చెందినది. దీనిలో వాటాలను విక్రయించాలని నిర్ణయించగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇటీవల అధికారులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. అనేక మార్లు మైనింగ్ వ్యాపారంలో ప్రభుత్వాలు, ప్రజల నుంచి వ్యతిరేకతలు వచ్చినప్పటికీ తన వ్యాపారాన్ని ఆయన ముందుకు సాగించటం గమనార్హం.

చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ ను తీర్చిదిద్దాలని ఆ ప్రాంత వ్యాపారాన్ని దక్కించుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నిస్తుండగా.. అందుకు తాను సహకరిస్తానంటూ అనిల్ అగర్వాల్ ముందుకొచ్చారు. ఈ క్రమంలో ఆయనకు చెందిన హోల్డింగ్ కంపెనీ వోల్కాన్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ ఇటీవల 19 బిలియన్ డాలర్ల సెమీకండక్టర్ ఫ్యాక్టరీని నిర్మించడానికి తైవాన్‌కు చెందిన హోన్ హై ప్రెసిషన్ ఇండస్ట్రీ కోతో జతకట్టింది. ఈ నెలలో రుణాల చెల్లింపుకు కంపెనీ ఇబ్బందిపడుతోందంటూ వచ్చిన వార్తలను ఖండిస్తూ.. తమకు సరిపడా నిధులు అందుబాటులో ఉన్నాయని మీడియా ముఖంగా నొక్కి చెప్పారు. ఆ తర్వాత వేదాంత వాటాలు అమ్మాలనుకుంటున్నట్లు వచ్చిన వార్తలను సైతం ఆయన కొట్టిపడేశారు. తాను ఎవరి డబ్బులు ఎగ్గొట్టలేదని.. మేనేజ్మెంట్లో సమస్యలు లేనంత కాలం ఎదగటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

English summary

Vedanta’s Anil Agarwal Fighting tough to clear debt burden on group companies, Know Details

Vedanta’s Anil Agarwal Fighting tough to clear debt burden on group companies, Know Details

Story first published: Sunday, March 26, 2023, 13:31 [IST]

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *