ఆడవాళ్లు ఈ సప్లిమెంట్స్‌ తీసుకుంటే.. హెల్తీగా ఉంటారు.. !

[ad_1]

Women Health: చాలామంది ఆడవాళ్ల ఉదయం లేచిన తర్వాత నుంచి రాత్రి నిద్రపోయే వరకు… నిమిషం కూడా ఖాళీ లేకుండా గడియారంలో ముళ్లులా పనిచేస్తూనే ఉంటారు. పిల్లల్లకు టిఫిన్ , మధ్యాహ్నం భోజనం, ఇళ్లు క్లీనింగ్, ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే వారి ఆలనాపాలనా, బట్టలు ఉతకడం, ఐరన్‌ చేయడం.. ఈ పని భారం అంతా ఆడవాళ్ల మీదే ఉంటుంది. ఇక, వర్కింగ్‌ ఉమెన్‌ అయితే.. హడావిడిగా ఆఫీస్‌కు వెళ్లి అక్కడా గడియారంలా పనిచేస్తూనే ఉంటారు. నీరసంగా ఉన్నా, జ్వరం వేధిస్తున్నా.. ఈ పనుల నుంచి వాళ్లుకు విశ్రాంతి దొరకనే దొరకదు. కుటుంబసభ్యులందరినీ కంటికి రెప్పలా చూసుకునే ఆడవాళ్లు, వారి ఆరోగ్యంపై అంత శ్రద్ధ చూపరు. ఆ పూటకి ఏదో ఒకటి తిన్నామా.. కడుపు నిండిందా అనే భావనలోనే ఉంటారు. యుక్తవయస్సులో.. ఈ నిర్లక్ష్య ప్రభావం అంతగా పడకపోయినా.. వయస్సు మీద పడేకొద్దీ దీర్ఘకాలిక సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. మహిళలు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి సమతుల ఆహారం తీసుకోవాలని పునీత్ సూద్, బ్లాక్‌మోర్స్ కంట్రీ మేనేజర్ అన్నారు. వీటితో పాటు.. పోషకాల లోపానికి తగినట్లుగా మల్టీవిటమిన్‌లు, సప్లిమెంట్‌లు తీసుకోవాలని సూచించారు. మహిళలు ప్రత్యేకంగా దృష్టి పెట్టవలసిన పోషకాల గురించి పునీత్‌ సూద్‌ మనకు వివరించారు. (Puneet Sood, Country Manager, Blackmores).

ఐరన్‌..

ఐరన్‌..

మహిళలు ఎక్కువగా ఐరన్‌ లోపంతో బాధపడుతూ ఉంటారు. మహిళలు నెలసరి మయంలో 30 %, ప్రెగ్నెన్సీ టైమ్‌లో 42 % ఐరన్‌ లోపంతో బాధపడుతున్నారని నిపుణులు అంటున్నారు. ఐరన్‌ మన శరీరంలో అనేక విధులు నిర్వహిస్తుంది. ఐరన్‌ లోపం కారణంగా.. ఎర్రరక్తకణాల ఉత్పత్తి తగ్గుతుంది, ఇది రక్తలేమి సమస్యకు దారి తీస్తుంది. ఐరన్‌లో లోపం కారణంగా.. నెలసరి సమయంలో ఎక్కువ రక్తస్రావం అవ్వడం, శ్వాస ఆడకపోవడం, గోళ్లు పెళుసుగా మారడం, నీరసం, అలసం తల తిరగడం, విపరీతమైన అలసట వంటి సమస్యలు వస్తాయి. మహిళలు ఐరన్‌ సమృద్ధిగా పొందాలంటే.. వారి డైట్‌లో ఆకు కూరలు, మాంసం, చేపలు, నట్స్‌, పప్పుధాన్యాలు, సోయా, టొమాటో, బంగాళాదుంపలు, పుట్టగొడుగులు, బఠాణీలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మీకు అమినియా ఉన్నా, ప్రెగ్నెన్సీ సమయంలో.. ఐరన్‌ పొందడానికి సప్లిమెంట్స్‌ అవసరం కావచ్చు.

కాల్షియం..

కాల్షియం..

కాల్షియం ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాల్షియం లోపం కారణంగా ఆడవాళ్లలో ఆస్టియోపోరోసిస్, ఆస్టియోపెనియా వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయని నిపుణులు అంటున్నారు. కాల్షియం లోపం కారణంగా ఎముకలు బలహీనపడటం, దంత సమస్యలు, విపరీతమైన అలసట, బలహీనత, తరచుగా కండరాల తిమ్మిరి, చర్మ సమస్యలు, సక్రమంగా గుండె కొట్టుకోకపోవడం వంటి ఆరోగ్య సమస్యలు వస్తాయి. యుక్తవయస్సులో ఉన్న అమ్మాయిలు.. రోజు కనీసం రెండు గ్లాసుల పాలు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. మీ డైట్‌లో డైరీ ఉత్పత్తులు, చీజ్, సోయాబీన్స్, ఆకుకూరలు, చేపలు, తృణధాన్యాలు వంటి ఆహరం ఎక్కువగా తీసుకోవాలి. విటమిన్‌ డీ లోపం కారణంగా.. కాల్షియం శోషణ కష్టమవుతుంది. మీరు విటమిన్ D3 సప్లిమెంట్స్‌ తీసుకోవచ్చు. కాల్షియం సప్లిమెంట్‌ .. ఒక టాబ్లెట్‌లో దాదాపు 500 mg ఎలిమెంటల్ కాల్షియం ఉంటుంది.

Q10 (CoQ10)

q10-coq10

Q10 (CoQ10) అనేది యాంటీఆక్సిడెంట్ ఎంజైమ్, ఇది సహజంగా జీవక్రియ క్రియాశీల అవయవాలలో, ముఖ్యంగా గుండెలో ఉంటుంది. ఇది హృదయనాళ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండేలా రక్షి్తుంది. ఆరోగ్యకరమైన బ్లడ్‌ ఫ్యాట్స్‌, రక్తనాళాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. CoQ10 శక్తి స్థాయిలకు మద్దతు ఇస్తుంది. ఫ్రీ రాడికల్స్‌ నుంచి శరీర కణాలను రక్షిస్తుంది. CoQ10 స్థాయిలు సహజంగా వయస్సుతో తగ్గుతాయి. దీని లోపాన్ని సప్లిమెంటేషన్‌ ద్వారా భర్తీ చేయవచ్చు.

విటమిన్‌ డి 3..

-3-

విటమిన్ D3 రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది, ఎమకలును, దంతాలను దృఢంగా ఉంచుతుంది. విటమిన్‌ D3 కాల్షియం శోషణకూ సహాయపడుతుంది. ఈ రోజుల్లో కార్యాలయాల్లో పనులు ఎక్కువై.. చాలామంది సూర్యరశ్మికి దూరంగా ఉంటున్నారు, దీనికారణంగా విటమిన్‌ D3 లోపంతో బాధపడుతున్నారు. మీర విటమిన్‌ D3 లోపాన్ని.. సప్లిమెంట్స్‌ ద్వారా దూరం చేయవచ్చు.

లుటిన్, జియాక్సంతిన్..

లుటిన్, జియాక్సంతిన్..

లుటిన్, జియాక్సంతిన్ యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఇవి కంటి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. రెటీనా, మాక్యులా ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు యూవీ కిరణాలు నుంచి మన శరీరాన్ని రక్షిస్తాయి. మన శరీరంలో ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడానికి ఇవి సహాయపడతాయి. ఈ యాంటీఆక్సిడెంట్లను మన ఆహారం ద్వారా అంతగా పొందలేం. వీటిని సప్లిమెంట్స్‌ ద్వారానే తీసుకోవాలి.

ఫోలెట్‌..

ఫోలెట్‌..

ఫోలెట్‌ మన శరీరానికి చాలా అవసరం. ఫోలెట్‌ ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి, వాటి పని తీరుకు సహాయపడుతుంది. ఇది పిండంలో న్యూరల్ ట్యూబ్ అసాధారణతలను నివారించడంలో కూడా సహాయపడుతుంది. గర్భిణుల్లో ఫోలెట్‌ లోపం కారణంగా.. పుట్టబోయే పిల్లల నాడీ వ్యవస్థలో లోపాలు తలెత్తే ప్రమాదం ఉంది. ఫోలేట్ లోపం వల్ల తలనొప్పి, తలతిరగడం, చర్మం పాలిపోవడం, గుండె దడ , విపరీతమైన అలసట, నీరసం, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మహిళలు ప్రతిరోజూ 400 మైక్రోగ్రాముల ఫోలేట్‌ తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆకు కూరలు, కూరగాయలు, సీఫుడ్, లివర్‌, నట్స్‌ విత్తనాలు, బ్రకలీ, శెనగలు, బీన్స్, పండ్లు, తృణధాన్యాలు, పప్పుధాన్యాల్లో ఫోలేట్ మెండుగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ సమయంలో వైద్యులు ఫోలిక్‌ యాసిడ్‌ సప్లిమెంట్‌ను సిఫార్సు చేస్తూ ఉంటారు.

ఫిష్‌ ఆయిల్‌..

ఫిష్‌ ఆయిల్‌..

ఫిష్‌ ఆయిల్‌ ట్యాబ్లెట్స్‌ ద్వారా ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా పొందవచ్చు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ హృదయనాళ, మెదడు, కన్ను, నాడీ వ్యవస్థ, చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మన శరీరం ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌ను సొంతంగా తయారు చేసుకోలేదు. దాన్ని మన డైట్‌ ద్వారా , సప్లిమెంట్స్‌ ద్వారా మాత్రమే తీసుకోగలం. ప్రతిరోజు శరీరానికి 1.59 గ్రాముల ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *