ఆస్తమా పేషెంట్స్‌ యాలకులు ఇలా తీసుకుంటే.. లక్షణాలు తగ్గుతాయ్‌..!

[ad_1]

Cardamom Benefits: అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాలలో యూలకులు ఒకటి. భారతీయ వంట గదిలో యాలకులు కచ్చితంగా ఉండాల్సిందే. దీన్ని స్వీట్స్‌ రుచి, సువాసన పెంచడానికి ఎక్కువగా వాడుతుంటారు. మసాలా వంటకాల టేస్ట్‌ను ఇది పెంచుతుంది. యాలకులు సువాసనా, రుచీ కోసం మాత్రమే కాదు… వాటితో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలూ పొందవచ్చు. వీటిలో విటమిన్‌ సి, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. యాలకులు మన ఆహారంలో చేర్చుకుంటే.. కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఆయుర్వేద వైద్య నిపుణురాలు జీకె తారా జయశ్రీ MD (Ayu) మనకు వివరించారు.

ఈ పోషకాలు ఉంటాయి..

ఈ పోషకాలు ఉంటాయి..

యాలకులలో విటమిన్లు, ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్లు, కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఒక టేబుల్ స్పూన్ యాలకులలో

  • కొవ్వు -0.4 గ్రా
  • కార్బోహైడ్రేట్లు – 4.0 గ్రా
  • ఫైబర్ – 1.6 గ్రా
  • ప్రోటీన్ -0. 6 గ్రా
  • పొటాషియం -64.9 మి.గ్రా
  • కాల్షియం -22.2 మి.గ్రా
  • ఐరన్ -0.81 మి.గ్రా
  • మెగ్నీషియం -13.3 మి.గ్రా
  • ఫాస్పరస్‌ -10. 3 మీ

గుండె లయకు మంచిది..

గుండె లయకు మంచిది..

యాలకులలో పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం మినరల్స్‌ మెండుగా ఉంటాయి. ఇవి గుండెకు మేలు చేసే ఎలక్ట్రోలైట్స్‌. రక్తంలోని ప్రధాన భాగాలలో పొటాషియం ఒకటి. శరీర ద్రవాలు, కణాల, హృదయ స్పందనను నియంత్రించడంలో యాలకులు సహాయపడతాయి. యాలకులలోని పోషకాలు శరీరంలోని రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఒక టీస్పూన్ తేనెలో యాలకుల పొడిని కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే మంచిది.

Also Read: ​ఈ జాగ్రత్తలు పాటిస్తే .. మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది..!

జీర్ణక్రియకు మేలు చేస్తుంది..

జీర్ణక్రియకు మేలు చేస్తుంది..

యాలకులు ఆకలిని పెంచుతాయి. జీర్ణరసాల స్రావాలను ప్రేరేపించడం ద్వారా అవి మంచి జీర్ణక్రియకు తోడ్పడతాయి. యాలకులు జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక రుగ్మతలను.. యాసిడ్‌ రిఫ్లెక్స్‌, ఛాతీలో మంట, డయేరియా వంటి వాటిని అరికడతాయి. ఎసిడిటీకి ఇది ఒక అద్భుతమైన ఔషధం. మీరు జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే.. యాలకుల గింజలను నోట్లో వేసుకుని నమలండి. లేదంటే.. మీ ఆహారంలో యాలకులు చేర్చుకోండి. యాలకుల టీ తాగినా మంచిదే..

Also read: ఈ టిప్స్‌ ఫాలో అయితే.. గ్యాస్ట్రిక్‌ సమస్య చిటికెలో మాయం అవుతుంది..!

ఆస్తమా తగ్గిస్తుంది..

ఆస్తమా తగ్గిస్తుంది..

యాలకులను ఆస్తమాకు ఔషధంగా ఉపయోగిస్తారు. ఆస్తమాలో కనిపించే పిల్లికూతలు, దగ్గు, ఛాతీ పట్టేసినట్లు ఉండటం వంటి ఎన్నో లక్షణాలను దూరం చేస్తుంది. ఇది దగ్గు, బ్రోన్కైటిస్‌లో కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఊపిరితిత్తులకు ఆక్సిజన్‌ సరఫరాను మెరుగుపరిచి, శ్వాస సంబంధిత సమస్యల బారిన పడకుండా కాపాడే శక్తి యాలకులకు ఉంది. ఊపిరితిత్తుల్లోని ఇన్‌ఫ్లమేషన్‌ను నివారిస్తాయి. యాలకుల ఎసెన్షియల్‌ ఆయిల్‌ మీ చేతి రుమాలులో వేసుకుని పీలిస్తే.. రిలీఫ్‌ ఇస్తుంది. మీ డైట్‌లో యాలకులు తరచుగా తీసుకున్నా మంచిదే.

Also Read: ​ కివీ పండు తింటే.. హైపర్‌టెన్షన్‌ తగ్గడంతో పాటు.. ఈ ప్రయోజనాలు ఉంటాయ్‌..!

డీటాక్స్‌ చేస్తుంది..

డీటాక్స్‌ చేస్తుంది..

యాలకులలో సమృద్ధిగా ఉండే మినరల్స్‌ రక్తంలోని టాక్సిన్స్‌, వ్యర్థాలను తొలగిస్తాయి. ఇవి ముఖ్యంగా, మూత్రపిండాల నుంచి యూరియా, కాల్షియంను నిర్మూలిస్తాయి. యాలకుల్లో పుష్కలంగా ఉండే యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కారక కణాలు పెరగకుండా నిరోధిస్తాయి. వీటిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా కాపాడతాయి. మీ మార్నింగ్‌ టీలో యాలకుల గింజలు వేసుకుని తాగితే.. మీ బాడీ డీటాక్స్‌ అవుతుంది.

జలుబు తగ్గిస్తుంది..

జలుబు తగ్గిస్తుంది..

యాలకులు జలుబు, ఫ్లూని తగ్గించడంలో సహాయపడతాయి. మీరు జలుబుతో బాధపడుతుంటే.. మీ ఆహారంలో ఏలకులను చేర్చుకోవడం మంచిది. మీకు జలుబు లక్షణాలు ఉంటే రోజుకు రెండుసార్లు యాలకుల టీ తీసుకోమని నిపుణులు సూచిస్తున్నారు. (image credit- istock)

నోటి దుర్వసన మాయం..

నోటి దుర్వసన మాయం..

యాలకుల్లో ఉండే ఔషధగుణాలు చెడు బ్యాక్టీరియాతో పోరాడతాయి. ఇవి నోటి దుర్వాసన తగ్గించి చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతాయి. నోటి పూతకు ఔషధంలా పనిచేస్తాయి. నోటి దుర్వాసన ఉన్నవారు భోజనం చేసిన తర్వాత ఏలకులను నమిలితే.. సమస్య పరిష్కారం అవుతుంది.

రక్తహీనతకు చెక్‌..

రక్తహీనతకు చెక్‌..

యాలకులలో శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తహీనతతో బాధపడేవారికి… కోల్పోయిన విటమిన్లను తిరిగి నింపడంలో సహాయపడుతాయి. దీనిలో కాపర్, మాంగనీస్, రిబోఫ్లేవిన్ వంటి అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇందులో నియాసిన్ కూడా ఉంటుంది, ఇది అలసట, బలహీనత వంటి రక్తహీనత లక్షణాలతో పోరాడుతుంది. వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి. ఆరోగ్యకరమైన కణాల అభివృద్ధికి తోడ్పడతాయి. రోజూ పాలు తాగేటప్పుడు చిటికెడు యాలకుల పొడి, పావు టీస్పూన్ పసుపు కలపి తీసుకోండి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *