ఇప్పటివరకు 6 కోట్లకు పైగా ఐటీ రిటర్న్స్‌ – ₹5 వేల ఫైన్‌ తప్పించుకోవడానికి ఇదే లాస్ట్‌ ఛాన్స్‌

[ad_1]

Income Tax Returns @ 6 Crores: ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయడానికి ఈ రోజే ‍‌(జులై 31, 2023) చివరి అవకాశం. మీరు ఇంకా రిటర్న్‌ను ఫైల్ చేయకపోతే, మిగిలిన పనులన్నీ పక్కన పెట్టి వెంటనే ఆ పని పూర్తి చేయండి. లేట్‌ ఫైన్‌ పడకుండా IT రిటర్న్‌ ఫైల్‌ చేయడానికి ఇవాళే ఆఖరి రోజు, గడువు ముగియడానికి కొన్ని గంటలే టైమ్‌ ఉంది. ఇవాళ అర్ధరాత్రి తర్వాత (ఆగస్టు 01, 2023) నుంచి లేట్‌ ఫైన్‌ వర్తిస్తుంది. సకాలంలో టాక్స్‌ రిటర్న్‌ దాఖలు చేయనందుకు, ఐటీ డిపార్ట్‌మెంట్‌, పన్ను వర్తించే మీ ఆదాయాన్ని బట్టి రూ. 1000 నుంచి రూ. 5000 వరకు జరిమానా వసూలు చేస్తుంది. 

ఆరు కోట్లకు పైగా ఐటీ రిటర్న్‌లు
ఆదాయ పన్ను టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌ డేటా ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, ఆదివారం (జులై 30, 2023) సాయంత్రం 6.30 గంటల వరకు 6 కోట్ల మందికి పైగా ఐటీఆర్‌లు ఫైల్‌ చేశారు. గత ఏడాది జులై 31కు దాఖలైన ఐటీఆర్‌లతో పోలిస్తే ఈసారి చాలా ఎక్కువ మంది రిటర్న్స్‌ ఫైల్‌ చేశారు. ఆదివారం ఒక్క రోజే దాదాపు 27 లక్షల ఐటీఆర్‌లు సబ్మిట్‌ చేశారని ఐటీ డిపార్ట్‌మెంట్‌ తెలిపింది. ఆదివారం సాయంత్రం 6.30 గంటల వరకు ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో 1.30 కోట్ల మంది సక్సెస్‌ఫుల్‌గా లాగిన్‌ అయినట్లు ఆదాయ పన్ను విభాగం వెల్లడించింది. దీనికి ముందు రోజు (శనివారం) ఈ సంఖ్య 1.78 కోట్లుగా ఉంది.

2022-23 ఆర్థిక సంవత్సరానికి (2023-24 అసెస్‌మెంట్‌ ఇయర్‌), ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట వరకు 5.83 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయని డిపార్ట్‌మెంట్ డేటాను బట్టి తెలుస్తోంది. అదే సమయం నాటికి, ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో 46 లక్షలకు పైగా విజయవంతమైన లాగిన్‌లు జరిగాయి. 

టాక్స్‌ ఫైలింగ్‌లో ఏదైనా సమస్యా?, ఇక్కడ సంప్రదించండి 
ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ఫైలింగ్, టాక్స్‌ పేమెంట్‌, రిఫండ్‌ సహా రిటర్న్‌ ఫైలింగ్‌కు సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఎదురైతే పరిష్కరించడానికి ఐటీ డిపార్ట్‌మెంట్‌ వివిధ రూపాల్లో సాయం చేస్తోంది. టాక్స్‌ పేయర్ల కోసం ఐటీ డిపార్ట్‌మెంట్‌ హెల్ప్‌డెస్క్ 24×7 ప్రాతిపదికన పనిచేస్తోంది. ఫోన్‌ కాల్స్‌, లైవ్ చాట్, వెబ్‌ఎక్స్ సెషన్లు, సోషల్ మీడియా ద్వారా సాయం వంటి రూట్లలో తాము అందుబాటులో ఉన్నామని ఆదాయ పన్ను శాఖ విభాగం ప్రకటించింది. టాక్స్‌ ఫైలింగ్‌కు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా సంప్రదించవచ్చని సూచించింది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఇవాళ్టి రేట్లివి     

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

 



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *