[ad_1]
Stocks to watch today, 23 January 2023: ఇవాళ (సోమవారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 94 పాయింట్లు లేదా 0.52 శాతం గ్రీన్ కలర్లో 18,139 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
మార్కెట్ల దిశను నిర్ణయించే ఇండెక్స్ హెవీవెయిట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ మహీంద్ర బ్యాంక్ ఫలితాల విడుదల నేపథ్యంలో.., రంగాల వారీగా కాకుండా, వ్యక్తిగత స్టాక్స్ వారీగా ఇవాళ మార్కెట్లో యాక్షన్స్ ఉండవచ్చు.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
రిలయన్స్ ఇండస్ట్రీస్: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నికర లాభం 2022 డిసెంబర్ త్రైమాసికంలో 15% తగ్గి రూ. 15,792 కోట్లకు చేరుకోగా, కార్యకలాపాల ఆదాయం 15% పెరిగి రూ. 2.20 లక్షల కోట్లకు చేరుకుంది. నికర లాభం అంచనాల కంటే తక్కువగా ఉంది. వినియోగదారు వ్యాపారాల్లో వృద్ధి కారణంగా, ఆయిల్-టు-కెమికల్స్ (O2C) సెగ్మెంట్లో బలహీనమైన పని తీరు భర్తీ అయింది.
కోటక్ మహీంద్రా బ్యాంక్: 2022 డిసెంబర్ త్రైమాసికంలో ప్రైవేట్ రంగ రుణదాత కోటక్ మహీంద్ర బ్యాంక్ స్టాండ్‌లోన్ నికర లాభం 31% పెరిగి రూ. 2,792 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (NII) ఏడాది ప్రాతిపదికన 30% పెరిగి రూ. 5,653 కోట్లకు చేరుకుంది. మూడో త్రైమాసికంలో దాని నికర వడ్డీ మార్జిన్ (NIM) 5.47%కి మెరుగుపడింది.
ICICI బ్యాంక్: డిసెంబర్ త్రైమాసికంలో ICICI బ్యాంక్ PATలో సంవత్సరానికి (YoY) 34% వృద్ధిని నమోదు చేసి రూ. 8,312 కోట్లకు చేరుకుంది. బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (NII) ఏడాది ప్రాతిపదికన 35% పెరిగి Q3లో రూ. 16,465 కోట్లకు చేరుకుంది.
యెస్ బ్యాంక్: డిసెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో యెస్ బ్యాంక్ నికర లాభం రూ. 51 కోట్లకు పడిపోయింది. అధిక కేటాయింపులు (Provisions) దెబ్బ కొట్టాయి. ఈ త్రైమాసికంలో కేటాయింపులు QoQలో 45% పెరిగి రూ. 845 కోట్లకు చేరుకున్నాయి. మూడవ త్రైమాసికంలో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం (NII) 12% పెరిగి రూ. 1,971 కోట్లకు చేరుకుంది.
అల్ట్రాటెక్ సిమెంట్: ఆదిత్య బిర్లా గ్రూప్ కంపెనీ అల్ట్రాటెక్ సిమెంట్ ఏకీకృత PAT Q3లో 38% పడిపోయి రూ. 1,058 కోట్లకు చేరుకుంది. అయితే కార్యకలాపాల ఆదాయం ఏడాది ప్రాతిపదికన (YoY) 19% పెరిగి రూ. 15,521 కోట్లకు చేరుకుంది. కంపెనీ నిర్వహణ మార్జిన్ ఏడాది ప్రాతిపదికన 15%కి పడిపోయింది.
SBI లైఫ్: ఇన్సూరెన్స్ కంపెనీ SBI లైఫ్ లిమిటెడ్ డిసెంబర్ 2022తో ముగిసిన మూడు నెలలకు రూ. 304 కోట్ల నికర లాభాన్ని నివేదించింది. గత ఏడాది ఇదే కాలంలో నివేదించిన రూ. 364తో పోలిస్తే ఇది దాదాపు 16% తగ్గింది.
JSW స్టీల్: స్టీల్ మేజర్ JSW స్టీల్ నికర లాభం డిసెంబర్ 2022తో ముగిసిన మూడు నెలల్లో 89% YoY తగ్గి రూ. 490 కోట్లకు పరిమితమైంది, దలాల్ స్ట్రీట్ అంచనాలను అందుకోలేదు. ఇదే సమయంలో, కార్యకలాపాల ఆదాయం రూ. 38,017 కోట్ల నుంచి 2% YoY వృద్ధి చెంది రూ. 39,134 కోట్లకు చేరుకుంది.
యాక్సిస్ బ్యాంక్: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్, 2022 మూడో త్రైమాసికంలో నికర లాభంలో బలమైన వృద్ధిని నివేదిస్తుందని మార్కెట్ అంచనా వేస్తోంది. ప్రధానంగా.. నికర వడ్డీ ఆదాయ వృద్ధి, లోన్ బుక్ పెరుగుదల ద్వారా లాభ వృద్ధిని మార్కెట్ లెక్కగడుతోంది. డిసెంబర్ త్రైమాసికంలో నికర లాభం సంవత్సరానికి 55% వరకు పెరగవచ్చన్నది దలాల్ స్ట్రీట్ అంచనా.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply