[ad_1]
Stocks to watch today, 02 March 2023: ఇవాళ (గురువారం) ఉదయం 7.30 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX Nifty Futures) 66 పాయింట్లు లేదా 0.38 శాతం రెడ్ కలర్‌లో 17,453 వద్ద ట్రేడవుతోంది. మన స్టాక్ మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
హిందుస్థాన్ ఏరోనాటిక్స్: 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రెండో మధ్యంతర డివిడెండ్‌ను పరిశీలించి ఆమోదించడానికి హిందూస్థాన్ ఏరోనాటిక్స్ బోర్డ్ మార్చి 10న సమావేశమవుతుంది. భారత వైమానిక దళం కోసం HAL నుంచి 6,800 కోట్ల రూపాయల విలువైన 70 HIT-40 బేసిక్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల సేకరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
L&T: లార్సెన్ అండ్ టూబ్రో నుంచి రూ. 3,110 కోట్ల విలువైన మూడు శిక్షణ నౌకలను కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
రైల్ వికాస్ నిగమ్: వందే భారత్ రైళ్ల తయారీ, నిర్వహణ కోసం అతి తక్కువ బిడ్డర్‌గా రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (RVNL) నిలిచింది. రైలు తయారీ యూనిట్లు & రైలు సెట్ డిపోల అప్‌గ్రేడేషన్ కూడా ఈ ఒప్పందం కూడా ఈ కాంట్రాక్ట్‌లో ఉంది.
బజాజ్ ఫిన్‌సర్వ్: మ్యూచువల్ ఫండ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి మార్కెట్ రెగ్యులేటర్ సెబీ నుంచి బజాజ్ ఫిన్‌సర్వ్ లైసెన్స్ పొందింది. యాక్టివ్, పాసివ్ విభాగాలలో మ్యూచువల్ ఫండ్ ఉత్పత్తుల శ్రేణిని ఈ కంపెనీ త్వరలో అందించనుంది.
డెలివెరీ: జపనీస్ బహుళజాతి కంపెనీల గ్రూప్ సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, డెలివెరీలో 3.8% వాటాను బల్క్ డీల్స్ ద్వారా రూ. 954 కోట్లకు విక్రయించింది.
డిష్ టీవీ: కంపెనీలోని మైనారిటీ షేర్‌హోల్డర్లు కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనలను ఉల్లంఘించారన్న వార్తలపై డిష్ టీవీ వివరణ ఇచ్చింది. ఆరోపణలన్నీ తప్పు, దురుద్దేశపూరితమైనవి, నిరాధారమైనవని ప్రకటించింది.
KNR కన్‌స్ట్రక్షన్స్: ఆంధ్రప్రదేశ్‌లో ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్మాణానికి 665 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్‌లను KNR కన్‌స్ట్రక్షన్స్ పొందింది.
ఆటో స్టాక్స్: ఫిబ్రవరి నెల అమ్మకాల డేటాను వాహన కంపెనీలు నిన్న విడుదల చేశాయి, కాబట్టి ఇవాళ మార్కెట్ దృష్టి ఆటో స్టాక్స్ మీద ఉంటుంది.
వెల్‌స్పన్ కార్పొరేషన్: మధ్యప్రాచ్యానికి LSAW పైపులు, బెండ్‌ల ఎగుమతి కోసం ఒక కాంట్రాక్టును ఈ కంపెనీ దక్కించుకుంది. FY24లో భారతదేశంలోని అంజార్‌లో ఉన్న ఫెసిలిటీ నుంచి అవి తయారవుతాయి.
యాక్సిస్ బ్యాంక్: సిటీ బ్యాంక్ కన్జ్యూమర్ బిజినెస్ కొనుగోలును యాక్సిస్ బ్యాంక్ పూర్తి చేసింది. యాక్సిస్ బ్యాంక్ మొత్తం రూ.11,603 కోట్లను సిటీ బ్యాంక్ ఇండియాకు చెల్లించడం డీల్ క్లోజయింది.
భారత్ ఫోర్జ్: భారత్ ఫోర్జ్ పూర్తి స్థాయి అనుబంధ సంస్థ అయిన BF ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఫెర్రోవియాలో 51% వాటా కొనుగోలు ఒప్పందాన్ని పూర్తి చేసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply