ఇవి రోజూ ఖాళీ కడుపుతో తీసుకుంటే.. హైబీపీ కంట్రోల్‌లో ఉంటుంది..!

[ad_1]

Foods Control Hypertension: హైపర్‌టెన్షన్‌ ఎన్నో అనర్థాలకు మూల కారణం. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా మరణాలకు హై బీపీ కారణమవుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. హైపర్‌టెన్షన్‌ అధిక బరువు, నిద్రలేమి, ఉప్పు అధికంగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, గర్భ నిరోధక మాత్రలు, పైయిన్‌ కిల్లర్స్‌ ఎక్కువగా వాడడం.. వంటివి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. హైబీపీ కారణంగా గుండె పోటు, కిడ్నీ సమస్యలు, బ్రైయిన్‌ స్ట్రోక్‌ లాంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. కేవలం మందులు వాడితే.. బీపీ కంట్రోల్‌లో ఉంటుందని చాలా మంది అనుకుంటారు. ఇలాంటి భావన ఉంటే.. మీరు పొరబడినట్లే. మంచి ఎక్స్‌అర్‌సైజ్‌, ఆహార నియమాలు పాటించకపోతే.. హైబీపీ మీ ప్రాణానికే.. డేంజర్‌గా మారుతుంది. ప్రముఖ ఆయుర్వేద డాక్టర్‌ దీక్షా భావ్‌సర్ హైపర్‌టెన్షన్‌ను నియంత్రించే ఆహారాల గురించి.. తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో షేర్‌ చేశారు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

మిరియాలు..

మిరియాలలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని డాక్టర్‌ దీక్షా భావ్‌సర్‌ అన్నారు. మిరియాల్లో.. విటమిన్ ఎ, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్ ఎలిమెంట్స్, కాల్షియం, ఐరన్‌, ఇతర యాంటీ ఆక్సిడెంట్‌ ఎలిమెంట్స్‌ అధిక మొత్తంలో ఉంటాయి. మన రోజువారీ ఆహారంలో ఒకటి, అర టీస్పూన్‌ మిరియాల పొడి చేర్చుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అకస్మాత్తుగా బీపీ పెరిగితే అర గ్లాసు గోరువెచ్చని నీటిలో.. ఒక టీస్పూన్ మిరియాల పొడి కలిపి తీసుకుంటే.. హైపర్‌టెన్షన్‌ కంట్రోల్‌లో ఉంటుంది.

ఉసిరి..

ఉసిరి తినడానికి కాస్త వగరుగా ఉన్నా.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో విటమిన్‌ ‘సి’ అధికంగా ఉంటుంది. ఇదిని శరీరంలో జీర్ణశక్తిని పెంచడమే కాకుండా.. డయాబెటిస్‌, హైపర్‌టెన్షన్‌ను కంట్లోల్‌లో ఉంచుతుంది. ముఖ్యంగా ఉసిరిలో అమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి హైపర్‌టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి. మీరు హైపర్‌టెన్షన్‌తో బాధపడుతుంటే.. ఉదయం ఖాళీ కడుపుతో రెండు ఉసిరి కాయలు తీసుకోండి, లేకపోతే వాటి రసం తాగండి.

వెల్లుల్లి..

దీనిలో విటమిన్లు B1, B2, B3, B6, ఫోలేట్, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్పరస్, పొటాషియం, సోడియం, జింక్ వంటి వంటి పోషకాలెన్నో ఉంటాయి. వెల్లుల్లిని రోజూ తినడం వల్ల గుండెకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. శరీరం లోపల రక్తం గడ్డకట్టకుండా కాపాడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తిని, నీళ్లు తాగితే హైపర్‌టెన్షన్‌ లక్షణాలు తగ్గుతాయని నిపుణులు అంటున్నారు. శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయి పెరిగి, తద్వారా రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది.

నల్ల కిస్‌మిస్‌..

నల్ల కిస్‌మిస్‌లో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది క్రమం తప్పకుండా తీసుకుంటే.. మన శరీరంలో సోడియం కంటెంట్‌ నియంత్రణలోకి వస్తుంది. దీంతో హైపర్‌టెన్షన్‌ నార్మల్‌ అవుతుంది. హైబీపీ పేషెంట్స్‌.. రోజూ ఉదయం.. నానబెట్టిన 5-7 ఎండు నల్ల ద్రాక్షను బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటే మంచిదని దీక్షా భావ్‌సర్‌ అన్నారు. (Image source – pixabay )

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *