[ad_1]
RBI Rate Cut:
బ్యాంకుల్లో నెలసరి వాయిదాలు చెల్లిస్తున్న వారి కష్టాలు ఇంకా కొనసాగనున్నాయి. టమాట సహా ఇతర కూరగాయాల ధరలు పెరగడం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకు తలనొప్పిగా మారింది. వడ్డీరేట్లు తగ్గించాలన్న కోరికను వాయిదా వేసుకోవాల్సి వస్తోంది. ద్రవ్యోల్బణం తగ్గేంత వరకు రేట్ల తగ్గింపు ఉండదని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రెండేళ్లుగా విపరీతమైన ధరల పెరుగుదలతో ఆర్బీఐ (RBI) కఠిన చర్యలు తీసుకుంది. ద్రవ్యోల్బణం తగ్గించేందుకు వరుసగా రెపోరేట్లను పెంచుతూ పోయింది. అయితే నాలుగు నెలలుగా పెంపును నిలిపివేసింది. 2024 ద్వితీయార్ధంలో విధాన రేటును తగ్గిస్తుందని చాలామంది అంచనా వేశారు. అయితే హఠాత్తుగా పెరిగిన టమాట, కూరగాయాలు, పప్పు ధాన్యాల ధరలతో ఆర్బీఐ నిర్ణయం మార్చుకొనే అవాకశం ఉందని అంటున్నారు.
దేశవ్యాప్తంగా ఆహార పదార్థాల (Food Prices) ధరలు కొండెక్కాయి. వారం రోజుల క్రిత రూ.15 ఉన్న కిలో టమాట (Tomato Price) ఇప్పుడు ఏకంగా రూ.150కి చేరుకుంది. మిగిలిన కూరగాయాలూ రెట్టింపు అయ్యాయి. వేడిగాలులు, వర్షాలు ఆలస్యమవ్వడంతో పంట దిగుబడి తగ్గిపోయింది. టమాట, అల్లం, ఆనపకాయ, పచ్చిమిర్చి ధర చక్కలను అంటింది. అయితే ధరల పెరుగుదల తాత్కాలికమే కావడంతో మానిటరీ పాలసీలో ఆర్బీఐ ఇప్పటికిప్పుడే మార్పులేం చేయకపోవచ్చు.
‘సాధారణంగా ఎండాకాలంలో కూరగాయల ధరల్లో ఒడిదొడుకులు ఉంటాయి. ఇప్పటికైతే ఆర్బీఐపై ఇది ప్రభావమేమీ చూపదు. ఒకవేళ ఆహార పదార్థాల ధరలు మరీ పెరిగితే 2023 రెండో అర్ధభాగంలో ద్రవ్యోల్బణం ఎగిసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు వడ్డీరేట్ల కోతను (RBI Rate Cut) ఆర్బీఐ వెనక్కి జరుపుతుంది’ అని కేర్ఎడ్జ్ చీఫ్ ఎకానమిస్ట్ రజనీ సిన్హా అంటున్నారు. మొత్తం ద్రవ్యోల్బణంలో (Inflation) ఆహార ధరల వాటానే 40 శాతం ఉండటం, ఎల్ నినో పరిస్థితులు అంచనాల నేపథ్యంలో ఆర్బీఐ అప్రమత్తమైందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం కిలో టమాట రూ.150, పచ్చి మిర్చి రూ.200కు అమ్ముతున్నారు. ఏప్రిల్లో కిలో జీలకర్ర రూ.400గా ఉండగా ఇప్పుడు రూ.750కి చేరుకుంది. అలాగే పుచ్చ గింజలు రూ.300 నుంచి రూ.750కి పెరిగింది. నిత్యావసరాలపైన పాలు, కొన్ని ఆహార పదార్థాలు అంతకు ముందే పెరిగాయి. వర్షాకాలంలో పంటలు పండితే పరిస్థితుల్లో మార్పు ఉండొచ్చని క్రిసిల్ చీఫ్ ఎకానమిస్ట్ ధర్మకీర్తి జోషి అన్నారు.
మరో ఆసక్తికర కథనం: మణికొండలో రియల్ బూమ్! 39% పెరిగిన ఇళ్ల ధరలు – హైదరాబాద్ రికార్డు!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
[ad_2]
Source link
Leave a Reply