[ad_1]
Multibagger PSU Stocks in 2023: భారత ప్రభుత్వం, 2023 బడ్జెట్లో మౌలిక సదుపాయల కల్పన కోసం అతి భారీగా మూలధన కేటాయింపులు (capex) చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన బూస్టర్ డోస్‌తో ప్రభుత్వ రంగ కంపెనీల (PSUs) బలం పెరిగింది. ఈ సంవత్సరం PSU షేర్ల పనితీరును పరిశీలిస్తే ఈ విషయం మనకు క్లియర్‌గా కనిపిస్తుంది.
సాధారణంగా, ప్రైవేట్ సెక్టార్ కంపెనీలతో పోలిస్తే పబ్లిక్ సెక్టార్ కంపెనీల షేర్లు (public sector companies’ stocks) వెనుకబడి ఉంటాయి. 2023లో సీన్ రివర్స్ అయింది. ఈ ఏడాది PSU స్టాక్స్ మారథాన్ చేశాయి, ప్రైవేట్ కంపెనీలను దాటి పరుగులు పెట్టాయి.
2023లో, BSE PSU ఇండెక్స్ 50% పైగా ర్యాలీ చేసింది, ఈ వారం ప్రారంభంలో 15,531 స్థాయిలో జీవితకాల గరిష్ఠాన్ని చేరుకుంది. ఇదే కాలంలో, బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 16% కంటే కొంచెం ఎక్కువ రాబడిని ఇచ్చింది.
ప్రభుత్వం ఇచ్చిన బూస్ట్‌తో, ఈ ఏడాదిలో ఇప్పటి వరకు (YTD), 13 PSU స్టాక్స్ మల్టీబ్యాగర్స్‌గా మారాయి, 267% వరకు రాబడిని (multibagger returns) అందించాయి. అంతేకాదు, 27 ప్రభుత్వ రంగ కంపెనీల షేర్లు ఈ సంవత్సరం కొత్త శిఖరాలు అధిరోహించాయి, కొత్త జీవితకాల గరిష్టాలను (lifetime high) తాకాయి. ఇంకో విశేషం ఏంటంటే… తాజా లైఫ్‌టైమ్ హైకి చేరిన 27 PSUల్లో 19 స్టాక్స్ ఈ నెలలోనే ఆ ఘనతను సాధించాయి.
2023లో మల్టీబ్యాగర్ PSU స్టాక్స్, YTD రిటర్న్స్:
REC —— 253%
పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ —— 245%
ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ —— 204%
ITI —— 180%
IRCON ఇంటర్నేషనల్ —— 180%
మజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ —— 167%
SJVN —— 163%
రైల్ వికాస్ నిగమ్ —— 160%
NLC ఇండియా —— 144%
కొచ్చిన్ షిప్‌యార్డ్ —— 143%
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ —— 128%
మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ —— 122%
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ —— 114%
హడ్కో —— 103%
NBCC (ఇండియా) —— 102%
2023లో రెండంకెల రాబడి ఇచ్చిన PSU స్టాక్స్:
హిందుస్థాన్ రాగి —— 99%
ఇంజనీర్స్ ఇండియా —— 98%
NTPC —— 81%
ఆయిల్ ఇండియా —— 81%
జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ —— 73%
న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ —— 72%
భారత్ ఎలక్ట్రానిక్స్ —— 71%
భారత్ డైనమిక్స్ —— 64%
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ —— 62%
NHPC —— 60%
కోల్ ఇండియా —— 58%
NMDC —— 57%
గెయిల్ (ఇండియా) —— 46%
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ —— 45%
RITES —— 43%
ఈ ఏడాది అత్యుత్తమ పనితీరు కనబరిచిన PSU స్టాక్స్‌లో ఎక్కువ భాగం మౌలిక సదుపాయాలు, విద్యుత్ రంగాలకు చెందినవి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: వేలిముద్ర వేస్తేనే కొత్త సిమ్, పాత నంబర్లకు కూడా బయోమెట్రిక్ గుర్తింపు
[ad_2]
Source link
Leave a Reply