[ad_1]
Postal Life Insurance Scheme: దేశంలోని అన్ని వర్గాల అవసరాలకు అనుగుణంగా ఇండియన్ పోస్ట్ ఆఫీస్ ఎప్పటికప్పుడు కొత్త పథకాలను (Post Office Scheme) తీసుకువస్తూనే ఉంటుంది. వాటి ద్వారా ప్రజలు అనేక ప్రయోజనాలు పొందవచ్చు. పైగా, ఆ పథకాలను కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంటాయి కాబట్టి, వాటి వల్ల నష్ట భయం ఉండదు.
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకం
పోస్టాఫీసు అందిస్తున్న ఉత్తమ పథకాల్లో ఒక దాని గురించి ఇప్పుడు సమాచారం తెలుసుకుంది. ఈ పథకం పేరు “పోస్ట్ ఆఫీస్ జీవిత బీమా పథకం” (Postal Life Insurance – PLI). ఈ పథకంలో పెట్టుబడి పెట్టే వ్యక్తి రూ. 50 లక్షల వరకు బీమా కవరేజీ సహా అనేక ఇతర ప్రయోజనాలను కూడా పొందుతాడు. ఆశ్చర్యకరంగా, ప్రభుత్వ బీమా పథకాల్లోనే అతి ప్రాచీన పథకం ఇది. బ్రిటిష్ పాలన కాలంలో, 1884 ఫిబ్రవరి 1న ఈ పథకం ప్రారంభమైంది.
పోస్ట్ ఆఫీస్ జీవిత బీమా పథకంలో డబ్బును పెట్టుబడి పెట్టేందుకు 2 కేటగిరీలలో ఆప్షన్లు ఉంటాయి. అవి.. PLI & RPLI. PLI పథకం కింద 6 పాలసీలు అమలు అవుతున్నాయి. వాటిలో ఒకటి హోల్ లైఫ్ అస్యూరెన్స్ పాలసీ (whole life insurance policy). సంపూర్ణ జీవిత బీమా పాలసీ కింద, కనీస హామీ మొత్తం రూ. 20,000 – గరిష్ట హామీ మొత్తం రూ. 50 లక్షలు. ఈ పథకం తీసుకున్న వ్యక్తి 80 సంవత్సరాలకు సమ్ అష్యూర్డ్ మొత్తాన్ని పొందుతాడు. దీని కంటే ముందే బీమాదారు మరణిస్తే, నామినీకి ఆ డబ్బు చెల్లిస్తారు.
రుణ సౌకర్యం
బీమా తీసుకున్న 4 సంవత్సరాలు పూర్తయిన తర్వాత, మీరు ఈ పాలసీపై రుణం కూడా పొందవచ్చు. మీరు ఎక్కువ కాలం పాలసీని కట్టలేకపోతే, 3 సంవత్సరాల తర్వాత దానిని సరెండర్ చేయవచ్చు. 5 ఏళ్ల లోపు సరెండర్ చేస్తే బోనస్ లభించదనే షరతు ఉంది. 5 సంవత్సరాల తర్వాత సరెండర్ చేసినప్పుడు, హామీ మొత్తంపై దామాషా ప్రకారం బోనస్ చెల్లిస్తారు.
కనిష్ట – గరిష్ట వయో పరిమితి
PLI హోల్ లైఫ్ అస్యూరెన్స్ పాలసీ తీసుకోవడానికి ఒక వ్యక్తికి కనీసం 19 ఏళ్లు, గరిష్టంగా 55 ఏళ్లు ఉండాలి. పోస్ట్ ఆఫీస్ అధికారిక వెబ్‌సైట్ https://pli.indiapost.gov.in ని సందర్శించడం ద్వారా ఈ పాలసీని తీసుకోవచ్చు, మరిన్ని వివరాలు కూడా తెలుసుకోవచ్చు. నేరుగా పోస్టాఫీసుకు వెళ్లిగానీ, ఆన్‌లైన్ ద్వారా గానీ ఈ పాలసీని కొనుగోలు చేయవచ్చు. ప్రీమియం చెల్లింపు, రసీదు, ఆదాయపు పన్ను సర్టిఫికేట్ మొదలైనవన్నీ డిజిటల్ ఫార్మాట్‌లో అందుబాటులో ఉంటాయి.
పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రయోజనాలు:
పోస్టల్ జీవిత బీమా పాలసీని కనీసం 4 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. ఆ తర్వాత డబ్బు వెనక్కు తీసుకోవచ్చు.
ఈ పాలసీతో సబ్ అజ్యూర్డ్ సౌకర్యం పొందుతారు.
బీమా చేసిన వ్యక్తికి, అతను లేకపోతే నామినీకి డబ్బు ఇస్తారు.
3 సంవత్సరాల తర్వాత పాలసీని రద్దు చేసుకోవాలని భావిస్తే, పాలసీని సరెండర్ చేసే సౌలభ్యాన్ని ఉంటుంది.
ప్రభుత్వ & ప్రభుత్వ రంగ ఉద్యోగుల కోసం మాత్రమే తొలుత ఈ పాలసీని తీసుకువచ్చు.
ఆ తర్వాత మార్పులు చేసి ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకువచ్చారు.
[ad_2]
Source link
Leave a Reply