ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Titan, IndiGo, Zomato, Tata Moto

[ad_1]

Stock Market Today, 03 November 2023: వడ్డీ రేటును యథాతథంగా ఉంచాలన్న US ఫెడ్ నిర్ణయాన్ని ఇండియన్‌ ఈక్విటీస్‌ హర్షించాయి, గురువారం అధిక స్థాయిలో ముగిశాయి. వడ్డీ రేట్ల పెంపు నుంచి ఫెడ్ వరుసగా రెండోసారి విరామం ఇవ్వడంతో, యూఎస్‌ సెంట్రల్ బ్యాంక్ తన రేట్ల పెంపు పనిని పూర్తి చేసిందన్న అంచనాలు పెరిగాయి.

US స్టాక్స్ అప్
U.S. ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపు కార్యక్రమం ముగింపు దశకు చేరుకుందన్న ఊహలతో పాటు, ఉల్లాసమైన త్రైమాసిక ఫలితాలు కూడా బుల్లిష్ మూడ్‌ను పెంచడంతో వాల్ స్ట్రీట్ మూడు ప్రధాన స్టాక్ ఇండెక్స్‌లు గురువారం దాదాపు 2% ర్యాలీ చేశాయి.

పెరిగిన ఆసియా వాటాలు
US స్టాక్స్‌, దీర్ఘకాలిక ట్రెజరీల్లో అప్‌డేషన్స్‌ను అనుసరించి, ఆసియాలోని స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. ఫెడరల్ రిజర్వ్, పాలసీ రేటు పెంపును పూర్తి చేసిందన్న అంచనాలతో తమ పొజిషన్లను పెట్టుబడిదార్లు సర్దుబాటు చేసుకున్నారు. 

ఈ రోజు ఉదయం 8.00 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 01 పాయింట్లు లేదా 0.01 శాతం రెడ్‌ కలర్‌లో 19,359 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఈ రోజు Q2 FY24 ఫలితాలు ప్రకటించనున్న కంపెనీలు: టైటన్, ఇండిగో, జొమాటో, MRF. ఈ కంపెనీ షేర్లు ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

సుజ్లాన్ ఎనర్జీ: ప్రముఖ విండ్ ప్లేయర్ సుజ్లాన్ ఎనర్జీ, మెరుగైన పనితీరు కారణంగా, 2023 సెప్టెంబర్‌ త్రైమాసికంలో నికర లాభంలో 79% (YoY) వృద్ధిని నమోదు చేసి రూ. 102 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంలో ఇది రూ.57 కోట్లుగా ఉంది. రెండో త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం రూ.1,430 కోట్ల నుంచి రూ.1,417 కోట్లకు స్వల్పంగా తగ్గింది.

టాటా మోటార్స్: Q2 FY24లో టాటా మోటార్స్ కన్సాలిడేటెడ్‌ నెట్‌ ప్రాఫిట్‌ రూ.3,764 కోట్లుగా లెక్క తేలింది. గత ఏడాది క్రితం రూ. 945 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.

కాంకర్‌: 2023 జులై-సెప్టెంబర్ కాలానికి రూ.368 కోట్ల నికర లాభాన్ని కాంకర్‌ ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా రూ.2,195 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

కిర్లోస్కర్ ఆయిల్: సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో కిర్లోస్కర్ ఆయిల్ రూ.78 కోట్ల నికర లాభాన్ని మిగుల్చుకుంది. కార్యకలాపాల ద్వారా రూ.1,305 కోట్ల ఆదాయం సంపాదించింది.

దిలీప్ బిల్డ్‌కాన్: నిధుల సేకరణ మార్గాలను పరిశీలించడానికి దిలీప్ బిల్డ్‌కాన్ డైరెక్టర్ల బోర్డు ఈ నెల 7న సమావేశమవుతుంది.

IEX: రెండో త్రైమాసికంలో IEX రూ. 86.5 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా రూ.109 కోట్ల ఆదాయం వచ్చింది.

IRFC: సెప్టెంబర్ త్రైమాసికంలో ఐఆర్‌ఎఫ్‌సీ రూ.1550 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా రూ.6,766 కోట్ల ఆదాయం సాధించింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: పండుగ సీజన్‌లో మంచి బడ్జెట్ కారు కొనాలనుకుంటున్నారా? – రూ.10 లక్షల్లోపు టాప్-3 ఎస్‌యూవీలు ఇవే!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *