ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ TCS, Bajaj Fin, RateGain, Paytm

[ad_1]

Stock Market Today, 16 November 2023: గ్లోబల్ మార్కెట్ల సానుకూల సిగ్నల్స్‌ వల్ల ఇండియన్‌ ఈక్విటీలు బుధవారం లాభపడ్డాయి. అయితే, మార్కెట్లో దూకుడును పెంచే భవిష్యత్‌ సిగ్నల్స్‌ కోసం పెట్టుబడిదార్లు వెయిట్‌ చేస్తున్నారు. 
ఓవర్‌నైట్‌లో, అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్లు అతి స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. S&P 500 0.16 శాతం పెరగ్గా, నాస్‌డాక్ కాంపోజిట్ 0.07 శాతం, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 0.47 శాతం పెరిగింది.

బుధవారం భారీ లాభాల తర్వాత, బిడెన్-Xi సమావేశం నేపథ్యంలో ఆసియా మార్కెట్లలో లాభాల బుకింగ్‌ జరిగింది. దీంతో ఆసియా షేర్లు గురువారం లోయర్‌ సైడ్‌లో ఉన్నాయి. 

ఈ రోజు ఉదయం 8.25 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 13 పాయింట్లు లేదా 0.07 శాతం రెడ్‌ కలర్‌లో 19,751 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్: కంపెనీ ప్రకటించిన రూ.17,000 కోట్ల షేర్ బైబ్యాక్ స్కీమ్‌లో పాల్గొనడానికి ఈక్విటీ షేర్‌హోల్డర్‌ల అర్హతలను నిర్ణయించడానికి నవంబర్ 25ను రికార్డ్ డేట్‌గా TCS నిర్ణయించింది.

బజాజ్ ఫైనాన్స్: ‘eCOM’, ‘Insta EMI కార్డ్’ విభాగాల కింద రుణాల మంజూరు, పంపిణీని తక్షణమే ఆపేయాలని  బజాజ్ ఫైనాన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశించింది.

ONGC: ఇంధన పరివర్తనలో భాగంగా, ముడి చమురును నేరుగా అధిక-విలువైన రసాయన ఉత్పత్తులుగా మార్చడానికి రెండు పెట్రోకెమికల్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి సుమారు రూ.1 లక్ష కోట్ల పెట్టుబడి పెట్టాలని ONGC యోచిస్తోంది.

డాబర్: వ్యక్తిగత అధికార పరిధి లేకపోవడంతో.. యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ ఇల్లినాయిస్ నార్తర్న్‌ డిస్ట్రిక్ట్‌కు సంబంధించిన ఫెడరల్ కేసుల్లో ప్రతివాదులుగా డాబర్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, డెర్మోవివా స్కిన్ ఎస్సెన్షియల్స్‌ పేర్లను తొలగించారు. 

వేదాంత: ఈ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన మాల్కో ఎనర్జీ లిమిటెడ్, సౌదీ అరేబియాలో రాగి వ్యాపారం కోసం SAR 1,00,000 పెట్టుబడితో కొత్త యూనిట్‌ను ఏర్పాటు చేసింది.

తెరా సాఫ్ట్‌వేర్: తెలంగాణలో ఉన్న టెరా సాఫ్ట్‌వేర్‌తో పాటు దాని ప్రమోటర్ల ఆస్తులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటాచ్ చేసింది.

రేట్‌గెయిన్ ట్రావెల్: క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (QIP) ద్వారా ఫండ్ రైజ్ ప్లాన్‌ను ఈ కంపెనీ ప్రారంభించింది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు ఫ్లోర్ ప్రైస్‌గా రూ.676.66 చొప్పున నిర్ణయించింది. బుధవారం, BSEలో ఒక్కో షేరు రూ.711.75 వద్ద ముగిసింది.

Paytm: గ్లోబల్ ట్రావెల్ టెక్నాలజీ కంపెనీ అమేడియస్‌తో మూడు సంవత్సరాల కోసం పేటీఎం ఒప్పందం కుదుర్చుకుంది. సెర్చ్‌, బుకింగ్‌, పేమెంట్స్‌ వంటి విషయాల్లో ప్రయాణికుల అనుభవాన్ని ఈ ఒప్పందం మెరుగుపరుస్తుంది.

ఇన్‌స్పిరిసిస్ సొల్యూషన్: ఈ కంపెనీ, ఒక్కో ఈక్విటీ షేర్‌కు డీలిస్టింగ్ ధరను రూ.68.70గా నిర్ణయించింది. BSEలో బుధవారం ఈ షేర్‌ ముగింపు ధర రూ.88.55గా ఉంది.

IIFL ఫైనాన్స్: రైట్స్ ఇష్యూ ద్వారా, సమస్థ ఫైనాన్స్‌లో IIFL ఫైనాన్స్ రూ.200 కోట్ల వరకు పెట్టుబడి పెడుతుంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: ఎల్‌ఐసీ పాలసీల్లో పాపులర్‌ ఇది – ప్రీమియం, మెచ్యూరిటీ, ఎలిజిబిలిటీ వివరాలు మీ కోసం

Join Us on Telegram: https://t.me/abpdesamofficial           

 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *