ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Zomato, Aster DM, PCBL, IREDA

[ad_1]

Stock Market Today, 29 November 2023: ప్రపంచ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందినప్పటికీ, ఇండియన్‌ ఈక్విటీలు నిన్న (మంగళవారం) పాజిటివ్‌గా క్లోజ్‌ అయ్యాయి. షార్ట్‌ టర్మ్‌లో, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ కోసం మార్కెట్‌ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

క్రిటికల్ & స్ట్రాటజిక్ మినరల్స్‌ తవ్వకాల కోసం, 20 బ్లాక్స్‌ మొదటి విడత వేలాన్ని భారత ప్రభుత్వం ఈ రోజు (బుధవారం) ప్రారంభిస్తుంది. ఈ నేపథ్యంలో మైనింగ్‌ స్టాక్స్‌ మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి. ఫెస్టివ్‌ సీజన్ కారణంగా, నవంబర్ నెలలో బలమైన అమ్మకాల వల్ల ఆటో స్టాక్స్‌ కూడా లైమ్‌లైట్‌లో ఉండే అవకాశం ఉంది. 

పెరిగిన US స్టాక్స్ 
ఫెడరల్ రిజర్వ్ అధికార్ల నుండి విరుద్ధమైన వ్యాఖ్యలను పెట్టుబడిదార్లు స్వీకరించడంతో U.S. స్టాక్స్ మంగళవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. కన్జ్యూమర్‌ డేటా కూడా కొంత లిఫ్ట్ అందించింది. డో జోన్స్‌ 0.24%, S&P 500 0.10%, నాస్‌డాక్ 0.29% లాభపడ్డాయి. 

ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు 
ఆసియా స్టాక్స్‌ మిశ్రమంగా స్పందిస్తున్నాయి. అక్టోబరు నెల ద్రవ్యోల్బణం తగ్గడంతో ఆస్ట్రేలియా బెంచ్‌మార్క్‌ పెరిగింది. జపాన్ టోపిక్స్ 0.4% పడిపోయింది, హాంగ్ సెంగ్ ఫ్యూచర్స్ 1% తగ్గింది, ఆస్ట్రేలియా S&P/ASX 200 0.5% పెరిగింది, యూరో స్టాక్స్‌ 50 ఫ్యూచర్స్ కొద్దిగా మారాయి.

ఉదయం 8.00 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 21 పాయింట్లు లేదా 0.01% గ్రీన్‌ కలర్‌లో 20,029 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు పాజిటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

జొమాటో: చైనీస్ పేమెంట్స్ గ్రూప్ అలిపే, ఈ రోజు బ్లాక్ డీల్స్ ద్వారా, ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటోలో తన 3.4% వాటాను దాదాపు $400 మిలియన్లకు అమ్మేయాలని యోచిస్తోంది.

టాటా పవర్: టాటా పవర్ రెన్యూవబుల్‌ ఎనర్జీ విభాగం, SJVN నుంచి 200 MW పునరుత్పాదక ఇంధన ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం లెటర్‌ ఆఫ్‌ అవార్డ్‌ పొందింది.

విప్రో: అమెజాన్ వెబ్ సర్వీసెస్‌తో కలిసి అమెజాన్ సెక్యూరిటీ లేక్‌పై అభివృద్ధి చేసిన కాంప్లయన్స్‌ సొల్యూషన్‌ను విప్రో లాంచ్‌ చేసింది.

PCBL: ఆక్వా ఫార్మ్ కెమికల్స్‌కు చెందిన 2,12,172 షేర్లను రూ. 3,800 కోట్లకు నేరుగా లేదా దాని అనుబంధ సంస్థల్లో ఒకదాని ద్వారా కొనుగోలు చేసేందుకు PCBL బోర్డు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.

ఆస్టర్ DM హెల్త్‌కేర్‌: Aster DM హెల్త్‌కేర్ బోర్డు, GCC సంస్థలను ఆల్ఫా GCC హోల్డింగ్స్‌కు 1.01 బిలియన్‌ డాలర్లకు అమ్మడానికి ఆమోదం తెలిపింది.

సైమెన్స్: నాలుగో త్రైమాసికంలో రూ. 5808 కోట్ల ఏకీకృత ఆదాయాన్ని ఈ కంపెనీ ఆర్జించింది. ఇది సంవత్సరానికి 25% వృద్ధి. నికర లాభం సంవత్సరానికి 12% తగ్గి రూ. 571 కోట్లకు పరిమితమైంది.

హావెల్స్: తన లాయిడ్ బ్రాండ్‌ను మిడిల్ ఈస్ట్ మార్కెట్‌లో హావెల్స్ లాంచ్‌ చేసింది.

IREDA: ప్రభుత్వ రంగ సంస్థ ఇరెడా షేర్లు ఈ రోజు ఎక్స్ఛేంజీల్లో లిస్ట్‌ అవుతాయి. ఇష్యూ ధర కంటే 30% ప్రీమియంతో స్టాక్ ఓపెన్‌ అవుతుందని భావిస్తున్నారు.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: దక్షిణాదిలో సంపన్న నటుడు ఎవరో తెలుసా? రూ.3 వేల కోట్ల ఆస్తి, సొంత విమానం మామూలుగా లేదు మరీ!

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *