ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ Infy, HCL Tech, HDFC Life

[ad_1]

Stock Market Today, 13 October 2023: US ఫెడ్ మీటింగ్ మినిట్స్‌ను విడుదల తర్వాత ఇండియన్‌ మార్కెట్లు గురువారం జాగ్రత్తగా అడుగులు వేశాయి. భవిష్యత్తులో రేట్ల పెంపుపై హాకిష్ టోన్‌ ఈ మినిట్స్‌లో వినిపించింది.

పడిపోయిన US స్టాక్స్
U.S. ట్రెజరీ ఆక్షన్‌ బాండ్ ఈల్డ్స్‌ను పెంచడంతో వాల్ స్ట్రీట్ ప్రధాన సూచికలు గురువారం లోయర్‌ సైడ్‌లో ముగిశాయి. సెప్టెంబర్‌లో ఊహించిన దాని కంటే ఎక్కువగా కన్జ్యూమర్‌ ప్రైస్‌లు పెరిగిన డేటాను పెట్టుబడిదార్లు ఇప్పటికే జీర్ణించుకుంటున్నారు.

ఆసియా స్టాక్స్ పతనం
US తాజా ద్రవ్యోల్బణం డేటా.. ఫెడరల్ రిజర్వ్ రేట్ పెంపు అంచనాలను బలపరిచింది, ట్రెజరీ ఈల్స్‌ను పెంచింది. దీంతో ఆసియా షేర్లు క్షీణించాయి. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలోని బాండ్లు శుక్రవారం ప్రారంభ ట్రేడింగ్‌లో అమ్మకాలకు చేరాయి.

ఈ రోజు ఉదయం 8.00 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 16 పాయింట్లు లేదా 0.08 శాతం గ్రీన్‌ కలర్‌లో 19,690 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 

ఇన్ఫోసిస్: 2023 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో, ఐటీ మేజర్‌ ఇన్ఫోసిస్‌ కన్సాలిడేటెడ్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన (YoY) 3% వృద్ధిని నమోదు చేసి రూ. 6,212 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో ఆదాయం 6.7% పెరిగి రూ. 38,994 కోట్లకు చేరుకుంది. QoQ ప్రాతిపదికన కంపెనీ ఆదాయం 2.8%, లాభం 4.5% పెరిగాయి. రూ.5 ఫేస్‌ వాల్యూతో ఒక్కో షేరుకు రూ. 18 డివిడెండ్‌ చెల్లించేందుకు డైరెక్టర్ల బోర్డు ఓకే చేసింది. ఇందుకు రికార్డు తేదీగా ఈ నెల 25ను నిర్ణయించింది. పేమెంట్‌ డేట్‌ నవంబరు 6.

HCL టెక్: ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 10% YoY వృద్ధితో రూ. 3,832 కోట్లకు చేరుకుంది. ఆదాయం 8% YoY వృద్ధితో రూ.26,672 కోట్లకు చేరింది. రూ.2 ఫేస్‌ వాల్యూతో ఉన్న ఒక్కో షేరుకు రూ. 12 డివిడెండ్‌ చెల్లించేందుకు డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఇందుకు రికార్డు తేదీగా ఈ నెల 20ని నిర్ణయించింది.

HDFC లైఫ్, సాయి సిల్క్స్ (కళామందిర్): ఈ కంపెనీలు ఈ రోజు రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తాయి. కాబట్టి, HDFC లైఫ్, సాయి సిల్క్స్ (కళామందిర్) షేర్లు మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.

IRB ఇన్‌ఫ్రా: సమాఖియాలి సంతల్‌పూర్ BOT ప్రాజెక్ట్‌ను ప్రారంభించడానికి, GIC ప్రైవేట్ అనుబంధ సంస్థలతో ఈ కంపెనీ ఖచ్చితమైన ఒప్పందాలపై సంతకాలు చేసింది.

డాక్టర్ రెడ్డీస్: హైదరాబాద్‌లోని బాచుపల్లిలోని కంపెనీ బయోలాజిక్స్ తయారీ కేంద్రాన్ని పరిశీలించిన US FDA, తొమ్మిది పరిశీలనలను జారీ చేసింది.

పేటీఎం: KYC నిబంధనలను పాటించనందుకు Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై రిజర్వ్ బ్యాంక్ రూ. 5.39 కోట్ల పెనాల్టీ విధించింది.

మారుతి సుజుకి: సుజుకి మోటార్‌కు ప్రిఫరెన్షియల్ బేసిస్‌లో ఈక్విటీ షేర్ల జారీని పరిశీలించడానికి, ఆమోదించడానికి ఈ నెల 17న డైరెక్టర్ల బోర్డు సమావేశం అవుతుందని మారుతి సుజుకి తెలిపింది.

ఏంజెల్ వన్: సెప్టెంబర్ త్రైమాసికంలో ఏంజెల్ వన్ నికర లాభం 43% పెరిగి రూ.3,045 కోట్లకు చేరుకుంది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 41% పెరిగి రూ. 10,497 కోట్లకు చేరుకుంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: ₹5 లక్షల ‘ఫ్రీ’ ఇన్సూరెన్స్‌ మీ జేబులోనే ఉంది, మీకే ఆ విషయం తెలీట్లా!

Join Us on Telegram: https://t.me/abpdesamofficial  

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *