ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ IRCTC, Paytm, HEG, Dilip Buildcon

[ad_1]

Stock Market Today, 13 February 2024: డిసెంబర్‌ త్రైమాసికం ఆదాయాల సీజన్‌ క్లైమాక్స్‌కు చేరుకోవడం, నిన్న (సోమవారం) వెలువడిన రిటైల్ ద్రవ్యోల్బణం డేటాను పెట్టుబడిదార్లు ట్రాక్‌ చేస్తారు. అందువల్ల, మన మార్కెట్లలో ఈ రోజు (మంగళవారం) కూడా ఒడిదొడుకులు కొనసాగవచ్చు.
 
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2024 జనవరిలో, మన దేశంలో చిల్లర ద్రవ్యోల్బణం (CPI inflation) 5.1 శాతంగా నమోదైంది, అంచనా వేసిన 5.09 శాతానికి అనుగుణంగా ఉంది. 2023 డిసెంబర్‌లోని 5.69 శాతం నుంచి బాగా తగ్గింది.
 
పారిశ్రామికోత్పత్తి సూచీ (IIP) వృద్ధి, 2023 నవంబర్‌లో నమోదైన 2.4 శాతంతో పోలిస్తే 2023 డిసెంబర్‌లో 3.8 శాతంగా ఉంది.

ఉదయం 8.20 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 03 పాయింట్లు లేదా 0.01 శాతం రెడ్‌ కలర్‌లో 21,747 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు ఫ్లాట్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది. 

గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా మార్కెట్లలో… సుదీర్ఘ వారాంతం తర్వాత తిరిగి ట్రేడ్‌ ప్రారంభించిన జపాన్‌ నికాయ్‌ 2 శాతం పెరిగింది, 37,000 మార్కును అధిగమించింది. దక్షిణ కొరియా కోస్పి కూడా 1.2 శాతం ర్యాలీతో కొత్త వారాన్ని ఘనంగా ప్రారంభించింది. ఆస్ట్రేలియా ASX 200 0.11 శాతం తగ్గింది. లూనార్ న్యూ ఇయర్ సెలవుల కారణంగా చైనా మార్కెట్లు ఈ వారంలో పని చేయవు.
 
పెట్టుబడిదార్లు అమెరికన్‌ తాజా ద్రవ్యోల్బణం & ఆదాయాల డేటా కోసం ఎదురుచూస్తుండడంతో.. సోమవారం, డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. 0.33 శాతం పెరిగి 38,797.38 వద్ద స్థిరపడింది. దీనికి విరుద్ధంగా, S&P 500 0.09 శాతం తగ్గింది, నాస్‌డాక్ కాంపోజిట్ 0.3 శాతం పడిపోయింది.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

ఈ రోజు Q3 ఫలితాలు ప్రకటించే కంపెనీలు: భెల్‌, డ్రెడ్జింగ్ కార్పొరేషన్, ఐషర్ మోటార్స్, గుజరాత్ గ్యాస్, హిందాల్కో, హిందుస్థాన్ కాపర్, హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్, ఇండియాబుల్స్ రియల్‌స్టేట్, IRCTC, KIOCL, MTNL, నేషనల్ అల్యూమినియం, NBCC, ఆయిల్ ఇండియా, ప్రెస్టీజ్ ఎస్టేట్స్, RCF, సీమెన్స్, సూలా వైన్‌యార్డ్స్, టేక్ సోల్యూషన్స్, టైడ్ వాటర్, జీ ఎంటర్‌టైన్‌మెంట్.

పేటీఎం: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ మీద విధించిన ఆంక్షలపై పునరాలోచించే అవకాశం లేదని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ స్పష్టం చేశారు. ఆ కంపెనీ కార్యకలాపాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

PSUలు: MSCI తాజా రీబ్యాలెన్సింగ్‌ ద్వారా.. MSCI గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్‌లో ఆరు PSU స్టాక్స్‌ను జోడించే అవకాశం ఉంది. ఆ లిస్ట్‌లో.. NHPC, NMDC, పంజాబ్ నేషనల్ బ్యాంక్, BHEL ఉన్నాయి.

HEG: డిసెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ నికర లాభం 64 శాతం క్షీణించి రూ. 37.08 కోట్లకు పరిమితమైంది, ఏడాది క్రితం ఇది రూ. 102.83 కోట్లుగా ఉంది. అయితే, మొత్తం ఆదాయం 3.3 శాతం పెరిగి రూ. 585.62 కోట్లకు చేరుకుంది.

దిలీప్ బిల్డ్‌కాన్: Q3లో నికర లాభం 19.8 శాతం పెరిగి రూ.95.29 కోట్లకు చేరుకుంది, క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.79.52 కోట్లుగా నమోదైంది. ఆదాయం 7.9 శాతం పెరిగి రూ. 2,596.78 కోట్లకు చేరుకుంది.

ఆల్‌కార్గో లాజిస్టిక్స్: ఏడాది క్రితంతో పోలిస్తే, Q3FY24లో నికర లాభం ఏకంగా 91.9 శాతం క్షీణించి కేవలం రూ.3.18 కోట్లుగా లెక్క తేలింది. ఆదాయం కూడా 22.9 శాతం తగ్గి రూ. 410.05 కోట్లకు దిగివచ్చింది.

కృష్ణ డయాగ్నోస్టిక్స్: Q3FY23లోని లాభం రూ.16.87 కోట్లతో పోలిస్తే Q3FY24లో 19.4 శాతం తగ్గి రూ.13.59 కోట్లకు పడిపోయింది. ఆదాయంలో మాత్రం వృద్ధి ఉంది, 29.4 శాతం పెరిగి రూ.155.63 కోట్లకు చేరుకుంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *