ఈ రోజు మార్కెట్‌ ఫోకస్‌లో ఉండే ‘కీ స్టాక్స్‌’ ZEEL, Anupam, DroneAcharya, Olectra

[ad_1]

Stock Market Today, 03 April 2024: అమెరికన్‌ మార్కెట్లు పతనం కావడంతో ఈ రోజు (బుధవారం) భారతీయ ఈక్విటీ మార్కెట్లు కూడా అదే ట్రెండ్‌ను ఫాలో అయ్యే అవకాశం ఉంది.

ఉదయం 8.05 గంటల సమయానికి గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 50 పాయింట్లు లేదా 0.22 శాతం రెడ్‌ కలర్‌లో 22,450 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఈ రోజు నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.

గ్లోబల్‌ మార్కెట్లు
ఆసియా-పసిఫిక్‌ ప్రాంతంలో.. ఈ ఉదయం కోస్పి 1.4 శాతం పతనమైంది. నికాయ్‌, ASX200 1 శాతం చొప్పున పడిపోయాయి. హాంగ్ సెంగ్ 0.3 శాతం క్షీణించింది.

నిన్న, అమెరికాలో, డౌ జోన్స్‌ దాదాపు 400 పాయింట్లు లేదా 1 శాతం కోల్పోయింది. S&P 500 0.72 శాతం తగ్గింది, నాస్‌డాక్ కాంపోజిట్ 0.95 శాతం నష్టపోయింది.

అమెరికాలో బెంచ్‌మార్క్‌ 10-సంవత్సరాల బాండ్ ఈల్డ్ పుంజుకుంది, 4.349 శాతం వద్ద ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు $89 టచ్‌ చేశాయి.

ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి (Stocks in news Today): 

జీ ఎంటర్‌టైన్‌మెంట్: మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పునీత్ గోయెంకా, కంపెనీ వృద్ధి ప్రణాళికల కోసం తన వ్యక్తిగత వేతనంలో 20 శాతం కోత విధించుకున్నారు.

అల్ట్రాటెక్ సిమెంట్: దేశంలో అతి పెద్ద సిమెంట్ తయారీ సంస్థ అల్ట్రాటెక్ సిమెంట్, విస్తరణ ప్రణాళికల్లో భాగంగా వచ్చే మూడేళ్లలో రూ.32,400 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తయారీ సామర్థ్యాన్ని 200 మిలియన్ టన్నుల (mtpa) మార్కుకు చేర్చేందుకు సిద్ధమవుతోంది.

JSW ఎనర్జీ: QIP మార్గంలో రూ. 5,000 కోట్ల వరకు సమీకరించడానికి డైరెక్టర్ల బోర్డు ఆమోదించింది. ఒక్కో షేర్‌ ఫ్లోర్ ప్రైస్‌ను రూ. 510.09 గా నిర్ణయించింది. నిన్నటి చివరి ముగింపు ధర కంటే ఇది 6 శాతం తగ్గింపు.

పీసీ జ్యువెలర్, కరూర్ వైశ్యా బ్యాంక్: పీసీ జ్యువెలర్ సమర్పించిన ‘వన్ టైమ్ సెటిల్‌మెంట్’ ప్రతిపాదనను కరూర్ వైశ్యా బ్యాంక్ ఆమోదించింది.

HCL టెక్: ఈ కంపెనీ విభాగం, USకు చెందిన స్టేట్ స్ట్రీట్‌తో కలిసి ఏర్పాటు చేసిన JVలో 49 శాతం వాటాను $172.5 మిలియన్లకు అమ్మేసింది.

డ్రోణ్‌ ఆచార్య ఏరియల్‌: డ్రోన్, జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (GIS) డేటా ప్రాసెసింగ్ కోసం యూకే నుంచి రూ. 4.67 కోట్ల విలువైన వర్క్ ఆర్డర్‌ను పొందింది.

అనుపమ్ రసాయన్: ఫ్లోరినేషన్ కెమిస్ట్రీని ఉపయోగించి రెండు అడ్వాన్స్ ఇంటర్మీడియట్‌లను సరఫరా చేయడానికి జపనీస్ కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఏడు సంవత్సరాల ఈ ఒప్పందం విలువ $90 మిలియన్లు లేదా రూ.743 కోట్లు.

మొయిల్: కంపెనీ చరిత్రలోనే, FY24లో అత్యుత్తమ ఉత్పత్తిని సాధించింది, 17.56 లక్షల టన్నులు నమోదు చేసింది. FY23తో పోలిస్తే ఇది 35 శాతం వృద్ధి. FY08లో సాధించిన 13.64 లక్షల టన్నులు ఇప్పటి వరకు రికార్డ్‌గా ఉంది.

PNC ఇన్‌ఫ్రాటెక్: కాంట్రాక్టు వివాదాలను పరిష్కరించుకునేందుకు, వన్-టైమ్ సెటిల్‌మెంట్ కోసం, NHAIతో రూ.117 కోట్ల పరిష్కార ఒప్పందాలపై సంతకం చేసింది.

ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌: ఎలక్ట్రిక్ బస్సుల ఉత్పత్తి, నిర్వహణ కోసం BYD ఆటో ఇండస్ట్రీతో సహకార ఒప్పందాన్ని 2030 వరకు పొడిగించింది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఈ రోజు రేట్లు ఇవి

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *