[ad_1]
Add Family Member Profiles to mAadhaar App: భారతదేశంలో ఉన్న వ్యక్తిగత గుర్తింపు పత్రాల్లో ఆధార్ ఒకటి. మన దేశంలో, ఒక వ్యక్తి పుట్టుక నుంచి చావు వరకు జరిగే చాలా పనులు ఆధార్‌తో ముడిపడి ఉన్నాయి. కాబట్టి, ఇది అత్యంత కీలక డాక్యుమెంట్. ఆధార్‌ను జారీ చేసే అధికార సంస్థ UIDAI (Unique Identification Authority of India), ఆధార్ మొబైల్ యాప్‌ను కూడా చాలా ఏళ్ల క్రితమే తీసుకొచ్చింది. ఆ యాప్ పేరు ఎంఆధార్ (mAadhaar).
ఒక్కోసారి, మన ఆధార్‌తో పాటు, కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలు కూడా అవసరం అవుతాయి. అప్పుడు, ఆధార్ కార్డ్‌ల కోసం వెతుక్కోవాల్సి వస్తుంది. మీ మొబైల్‌లో mAadhaar యాప్ ఉంటే, అందరి వివరాలు మీ అరచేతిలోనే ఉంటాయి. ఎంఆధార్‌లో కుటుంబ సభ్యుల ప్రొఫైల్స్‌ను యాడ్ చేసి, సులభంగా యాక్సెస్ చేయవచ్చు.
mAadhaar యాప్‌లో గరిష్టంగా ఐదుగురు కుటుంబ సభ్యుల ప్రొఫైల్స్ యాడ్ చేయవచ్చు. మీ మొబైల్ నంబర్‌తో లింక్ అయిన కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను మాత్రమే యాప్‌లో జోడించడానికి వీలవుతుంది. మీరు, mAadhaar యాప్‌నకు ఒక పిన్ సెట్ చేసుకుని, అందరి వివరాలకు భద్రత కూడా కల్పించొచ్చు.
ఎంఆధార్ యాప్‌లో కుటుంబ సభ్యులను చేర్చేందుకు, ముందుగా మీ ఆధార్ కార్డ్ – మొబైల్ నంబర్‌తో లింక్ అయి ఉండాలి. దాని ద్వారా ఎంఆధార్‌లోకి లాగిన్ అవ్వాలి. మీ కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లతో లింక్ అయిన మొబైల్ ఫోన్‌ను దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే, ఆ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ (OTP) ఇక్కడ అవసరం అవుతుంది.
ఎంఆధార్ యాప్‌లో కుటుంబ సభ్యుల ప్రొఫైల్స్ యాడ్ చేసే ప్రాసెస్ (Add Family Member Profiles to mAadhaar App)
1. ఎంఆధార్ యాప్‌ను తెరవండి.
2. “యాడ్ ప్రొఫైల్” ఆప్షన్ మీద క్లిక్ చేయండి.
3. ఇప్పుడు, మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డ్ నంబర్‌ను నమోదు చేయండి.
4. వివరాలను Verify చేయండి, Terms and Conditionsను ఓకే చేయండి.
5. మీ కుటుంబ సభ్యుడి ఆధార్‌తో లింక్ అయిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది.
6. యాప్‌లోని సంబంధిత గడిలో OTPని ఎంటర్ చేయండి.
7. అంతే, మీ కుటుంబ సభ్యుడి ప్రొఫైల్ మీ యాప్‌లో యాడ్ అవుతుంది.
8. మిగిలిన కుటుంబ సభ్యుల ప్రొఫైల్స్ యాడ్ చేయడానికి ఇదే ప్రాసెస్ రిపీట్ చేయండి
ఫ్యామిలీ మెంబర్ ప్రొఫైల్‌ను ఎంఆధార్‌లో యాడ్ చేసిన తర్వాత… మీ కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను మీరు యాక్సెస్ చేయవచ్చు, e-KYC డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, ఆధార్‌ను లాక్ లేదా అన్‌లాక్ (lock/unlock Aadhaar) చేయవచ్చు, ఇతర అన్ని ఫీచర్స్‌ను ఉపయోగించవచ్చు.
ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసే గడువు పెంపు (Last date for free update of Aadhaar Details)
మీ ఆధార్ వివరాల్లో తప్పులుంటే, ఇప్పుడు వాటిని పూర్తి ఉచితంగా సరి చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పద్ధతిలో ఆధార్ వివరాలను ఉచితంగా మార్చుకునే గడువును ఉడాయ్ మరో 3 నెలలు పొడిగించింది. ఇప్పుడు, 2024 మార్చి 14 వరకు, మీ ఆధార్ కార్డ్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా ఆధార్‌ను అప్‌డేట్ చేయడం తెలీకపోతే, మీకు దగ్గరలోని ఆధార్ కేంద్రానికి వెళ్లి వివరాలు మార్చుకోవచ్చు. దీనికి కొంత ఫీజు చెల్లించాలి.
[ad_2]
Source link
Leave a Reply