ఏం తింటే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి.. ఎలా తగ్గించుకోవాలి..

[ad_1]

కడుపు ఉబ్బరం.. ఇది చాలా మందిని వేధించే సమస్య. ఆహారం తిన్న తర్వాత ఈ సమస్య వస్తుంటుంది. ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎంతలా అంటే ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టంగా ఉంటుంది. ఛాతీపై బరువుగా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని ఫుడ్స్ తీసుకున్న తర్వాత కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుంది. అవేంటో తెలుసుకోవాలి. ఈ సమస్యని పోగొట్టేందుకు మెడిసిన్ అవసరం.

​న్యూట్రిషనిస్టుల ప్రకారం..

​న్యూట్రిషనిస్టుల ప్రకారం..

న్యూట్రిషనిస్ట్ లవనీత్ బాత్రా ప్రకారం, ఉల్లిపాయ, వెల్లుల్లి, క్యాబేజీ తింటే వెంటనే గ్యాస్ వస్తుంది. జీర్ణశక్తి బలహీనంగా ఉన్నవారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ సమస్య నుండి బయటపడేందుకు ఓ రెసిపీ ఉంది. కానీ, ఏయే ఫుడ్స్ గ్యాస్‌ని ఉత్పత్తి చేస్తాయని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

న్యూట్రిషనిస్టుల చెబుతున్నదేంటంటే..

​ఉల్లిపాయ వెల్లుల్లి

​ఉల్లిపాయ వెల్లుల్లి

ఉల్లిపాయ, వెల్లుల్లిలో ఎక్కువ మొత్తంలో ఫ్రక్టాన్లు ఉంటాయి. ఈ మూలకాల్లో కరిగే ఫైబర్స్ ఉంటాయి. ఇవి కడుపులో తీవ్రమైన వాయువుని సృష్టిస్తాయి.
Also Read : Vetiver in Summer : ఈ సమ్మర్ డ్రింక్‌తో చాలా సమస్యలు దూరం..

​బ్రకోలీ..

​బ్రకోలీ..

క్యాబేజి, బ్రోకలీ, కాలే వంటి కూరగాయల్లో రాఫినోస్ ఉంటుంది. దీనిని బాడీ తేలిగ్గా జీర్ణించుకోలేదు. ఈ కారణంగా ఉబ్బరం ఏర్పడుతుంది. కాబట్టి, వీటిని తినేటప్పుడు కొన్ని చిట్కాలు పాటించాలి.

​బీన్స్..

​బీన్స్..

పప్పుధాన్యాలు ఆరోగ్యానికి మంచిది. అయితే, బీన్స్‌లో హై ఫైబర్, ఒలిగోశాకరైడ్స్ ఉంటాయి. కాబట్టి, వీటిని తిన్నప్పుడు ఉబ్బరంగా ఉంటుంది. ఇందులో బాడీలో విచ్ఛిన్నం కానీ చక్కెర పదార్థాలు ఉంటాయి.
Also Read : Milk Combinations : పాలతో ఈ బిస్కెట్లు కలిపి తింటే అస్సలు మంచిది కాదట..

​పచ్చికూరగాయలు..​

​పచ్చికూరగాయలు..​

చాలా మంది పచ్చి కూరగాయలతో సలాడ్ చేసుకుని తింటారు. వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు ఎదురవుతాయి. అందుకే వీటిని తిన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏం తినాలి. ఏవి తినకూడదో తెలుసుకోవాలి.

​కూల్ డ్రింక్స్​

​కూల్ డ్రింక్స్​

నిజానికీ చాలా మంది కడుపు ఉబ్బరంగా ఉన్నప్పుడు కూల్ డ్రింక్స్ తాగుతారు. దీని వల్ల గ్యాస్ తగ్గిపోతుందని అనుకుంటారు. కానీ, ఇందులో కార్బన్ డై ఆక్సైడ్ ఉంటుంది. ఇది కడుపులోకి ప్రవేశించినప్పుడు గ్యాస్ట్రిక్ నొప్పికి కారణమవుతుంది. రెగ్యులర్‌గా తీసుకుంటే ఉబ్బరం, త్రేన్పుల సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

ఆయుర్వేద ట్రీట్‌మెంట్..

ఆయుర్వేద ట్రీట్‌మెంట్..

ఆహారం తీసుకున్నాక 30 నిమిషాల తర్వాత సెలెరీ, సోంపు, జీలకర్ర కషాయాలు తీసుకుండి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ధనియాల కషాయం తీసుకోవడం మంచిది.
ఉప్పుని తగ్గించండి.
నెమ్మదిగా, బాగా నమిలి తినండి
పుష్కలంగా నీరు తాగాలి.

​​గమనిక:ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
​​​​​​​​​​Read More :Home-remedies NewsandTelugu New



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *