కొత్త సంవత్సరం ఈ రిజల్యూషన్స్‌ తీసుకుంటే.. హెల్తీగా, ఫిట్‌గా ఉంటారు..!

[ad_1]

Tips for New Year 2023: కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం (New Year 2022). ప్రతి ఒక్కరూ నూతన సంవత్సరానికి రిజల్యూషన్స్ తీసుకుంటూ ఉంటారు. స్మోకింగ్‌ మానేయాలని, బరువు తగ్గాలని, హెల్తీ ఫుడ్‌ తీసుకోవాలని.. వారి రిజల్యూషన్‌ లిస్ట్‌లో ఉంటాయి. కొంతమంది.. వీటిని కొన్ని నెలల వరకు పాటిస్తారు. కొంతమంది వారంలోనే ఈ రిజల్యూషన్స్‌ను పక్కన పెట్టేస్తారు. మనం తీసుకునే రిజల్యూషన్స్‌ సులభంగా, పాటించే విధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. న్యూ ఇయర్‌ రిజల్యూషన్స్‌లో.. మన ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని అంటున్నారు. కొత్త సంవత్సరంలో మనం తీసుకునే.. తీర్మానాల గురించి ఆయుర్వేద నిపుణురాలు.. డాక్టర్‌ వరలక్ష్మి కొన్ని టిప్స్‌ చెప్పారు. కొత్త సంవత్సరంలో ఈ పనులు చేయడం సులభంగా, ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

ఆరోగ్యం

సమయానికి నిద్ర లేవండి..

ఈ రోజుల్లో చాలా మంది.. ఆలస్యంగా నిద్రపోయి.. లేట్‌గా నిద్ర లేస్తారు. కొత్త సంవత్సరంలో ఉదయం త్వరగా లేచేలా రిజల్యూషన్‌ తీసుకుంటే మంచిదని డాక్టర్‌ వరలక్ష్మీ అన్నారు. ఉదయం లేచిన తర్వాత సూర్యరశ్మిలో కొంతసేపు గడపాలని సూచించారు.మన శరీరం జీవక్రియ సక్రమంగా జరగడానికి, పోషకాలు సక్రమంగా వినియోగించుకోవడానికి సూర్యరశ్మి చాలా అవసరం. కాబట్టి తెల్లవారుజామున లేచే అలవాటు చేసుకోండి. ఈ చిన్న అలవాటు మీ ఆరోగ్యాన్ని, జీవితాన్ని మార్చగలదు.

మీ ఆహారం మీరే వండుకోండి..

వంట చేయడం బోరింగ్ పని కాదు. నిజానికి, కుక్కింగ్‌ ఒత్తిడిని దూరం చేస్తుంది. మీ ఆహారాన్ని మీరే వండుకుంటే.. శరీరానికి పోషకాలు లభిస్తాయి. బయట ఆహారం తినకుండా ఉంటారు. దీంతో, బరువు కంట్రోల్‌లో ఉంటుంది. అనేక అనారోగ్యాలు నుంచి రక్షణ లభిస్తుంది. మీ డైట్‌లో పోషకాహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి.

మీ ఇంద్రియాలను జాగ్రత్తగా చూసుకోండి..

మన ఇంద్రియాలు శరీరానికి కిటికీలుగా పనిచేస్తాయి. ఇవి మనం ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని ఫీల్‌ అవ్వడానికి సహాయపడతాయి. అందుకే కళ్లు, ముక్కు, చెవులు, నాలుక, చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. చెవులను హెల్తీగా ఉంచడానికి.. చెవిలో నూనె వేయండి. డిజిటల్‌ స్క్రీన్‌ టైమ్‌ తగ్గిస్తే.. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వండి.

మీ శరీరం ఏమి చెబుతుందో వినండి..

మన శరీరం చాలా తెలివైనదని ఆయుర్వేద వైద్యులు వరలక్ష్మి అంటున్నారు. మనం ఏమి చేయాలి, ఏప్పుడు ఏ పని చేయాలని సమయానికి సంకేతాలు ఇస్తుంది. అందుకే సమయానికి తినడం, నిద్రపోవడం, కడుపు శుభ్రం చేసుకోవాడం లాంటివి చేయాలి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *