కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ వీర బాదుడు – కస్టమర్ల వీపు విమానం మోత

[ad_1]

Debit Card Charges Hike: ప్రైవేట్ రంగ రుణదాత కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌( Kotak Mahindra Bank), తన కస్టమర్లను కష్టపెట్టే నిర్ణయం తీసుకుంది. డెబిట్ కార్డ్/ ATM కార్డ్‌ నిర్వహణ కోసం వసూలు చేసే వార్షిక ఛార్జీని ఈ బ్యాంక్‌ పెంచింది. ఈ పెంపుదల వచ్చే నెల 22వ తేదీ (22 మే 2023) నుంచి అమలులోకి వస్తుంది. 

199 + GST కాదు, 159 + GST 
వార్షిక డెబిట్ కార్డ్ యాన్యువల్‌ ఛార్జ్‌ను మరో రూ. 60 పెంచింది కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌. బ్యాంక్‌ ఇచ్చిన సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఏడాదికి “రూ. 199 + GST” వసూలు చేస్తోంది. రుసుము పెంపు తర్వాత ఈ మొత్తం “రూ. 159 + GST” గా మారుతుంది. పెరిగిన వార్షిక రుసుము అన్ని రకాల ఖాతాలకు వర్తిస్తుంది.         

కోటక్ మహీంద్ర బ్యాంక్ వివిధ రకాల పొదుపు ఖాతాలను ఆఫర్‌ చేస్తోంది. కస్టమర్‌ ఖాతా, విత్‌ డ్రా పరిమితి, ఇతర ఫీచర్‌లను బట్టి, ఆ ఖాతాదారుకు జారీ చేసిన లేదా జారీ చేసే డెబిట్ కార్డ్ రకం మారుతుంది.

సేవింగ్స్ & శాలరీ ఖాతాలకు సంబంధించి, 2022 జూన్ 1వ తేదీ నుంచి కోటక్ మహీంద్ర బ్యాంక్ అమలు చేస్తున్న ఛార్జీలు ఇవి:

మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే బాదుడు
కోటక్ మహీంద్ర బ్యాంక్‌ ఖాతాలో కనీస నగదు నిల్వ లేకపోతే, ఖాతా రకాన్ని బట్టి షార్ట్‌ఫాల్‌లో 6% (గరిష్టంగా రూ.500/600) వసూలు చేస్తుంది. పబ్లిక్ సర్వీసెస్, యూనిఫామ్ సర్వీసుల శాలరీ అకౌంట్లకు మినహాయింపు ఉంటుంది.          

చెక్‌ లావాదేవీ విఫలమైతే ఛార్జ్
ఖాతాలో డబ్బు ఉన్నా, ఆర్థికేరత కారణాల వల్ల చెక్‌ లావాదేవీ విఫలమైతే రూ. 50 రుసుమును కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ వసూలు చేస్తుంది. డ్రాయర్ సంతకం అసంపూర్తిగా లేదా అస్పష్టంగా లేదా భిన్నంగా ఉండడం. లేదా, డ్రాయర్‌ సంతకం లేకపోవడం, ఇతర వివరాలను అస్పష్టంగా లేదా సరిగా నింపకపోవడం వంటివి ఆర్థికేతర కారణాలు.      

స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ (SI) వైఫల్యాలకు ఫీజ్‌
స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ (ఎస్‌ఐ) ఫెయిల్యూర్ ఫీజుగా బ్యాంక్ రూ. 200 వసూలు చేస్తుంది.      

చెక్‌ తిరిగి వస్తే లావాదేవీపై జరిమానా
బ్రాంచ్‌లో డిపాజిట్ చేసిన చెక్‌ తిరిగి వస్తే, ఒక్కో చెక్‌బుక్‌ లీఫ్‌పై రూ. 200 జరిమానాగా బ్యాంక్‌ వసూలు చేస్తుంది

చెక్ బుక్ జారీకి పరిమితి
బ్యాంక్ 25 చెక్ లీఫ్స్‌ను మాత్రమే ఉచితంగా అందిస్తుంది.          

డెబిట్ కార్డ్ సంబంధిత ఇతర ఛార్జీలు
కోటక్‌ మహీంద్ర బ్యాంక్‌ డెబిట్‌ కార్డు చోరీకి గురైనా, పోయినా కొత్త డెబిట్ కార్డును జారీ చేయడానికి చార్జీ కింద రూ. 200 వసూలు చేస్తుంది. 
దేశీయ ATM మెషీన్‌లో తక్కువ బ్యాలెన్స్ కారణంగా విత్‌ డ్రా తిరస్కరణకు గురైతే, ఆ లావాదేవీ మీద రూ. 25 ఛార్జీ విధిస్తుంది. 
కార్డ్‌లెస్ నగదు లావాదేవీ విషయంలో, ఒక నెలలో ఒక విత్‌డ్రా ఉచితం. ఒక నెలలో రెండో కార్డ్‌లెస్‌ లావాదేవీ నుంచి రూ. 10 చొప్పున రుసుము చెల్లించాలి.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *