[ad_1]
డయాబెటిస్‌కు చెక్..
జాజికాయ తీసుకుంటే.. డయాబెటిక్ పేషెంట్స్‌కు మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. NCBI నివేదిక ప్రకారం.. జాజికాయ ప్యాంక్రియాటిక్ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహయాపడుతుందని తేలింది. కానీ, ఇది తీసుకునే ముందు డాక్టర్‌నను సంప్రదించడం మేలు.
కొలెస్ట్రాల్ కరుగుతుంది..
జాజికాయకు అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించే సామర్థ్యం ఉందని NCBI అధ్యయనం స్పష్టం చేసింది. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ రెండూ శరీరానికి అవసరమైన జిగట పదార్థాలు. కానీ, ఇవి శరీరంలో అధికంగా ఉంటే.. సిరల్లో పేరుకుపోతాయి . గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది.
మగవారికి మేలు చేస్తుంది..
బలహీనమైన లైంగిక సామర్థ్యం, ఇన్‌ఫెర్టిలిటీ సమస్యలతో బాధపడే మగవారికి జాజికాయ మేలు చేస్తుంది. ఇది లైంగిక ప్రేరేపణను మేరుగుపరుస్తుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి. సెక్స్ సామర్ధ్యాన్ని పెంచడమే కాకుండా వీర్యకణాలను వృద్ధి చేయడంలో సాయపడుతుంది. పురుషుల్లో ఏర్పడే నపుంసకత్వం, శీఘ్ర స్కలనం వంటి లైంగిక సమస్యలను దూరం చేస్తుంది.
కీళ్ల నొప్పులు దూరం అవుతాయ్..
దీర్ఘకాలిక వాపు వల్ల అర్థరైటిస్, కీళ్ల నొప్పులు, గుండె జబ్బులు, డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉంది. జాజికాయలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇది శరీరంలోని వాపులను తొలగిస్తుంది. ఈ సమస్యలు వచ్చే ముప్పు తగ్గుతుంది.
ఇన్ఫెక్షన్లకు చెక్..
E. coli వంటి బ్యాక్టీరియా ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. జాజికాయ మన డైట్‌లో చేర్చుకుంటే.. ఇన్ఫక్షన్ల నయం అవుతాయి. జాజికాయలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి, ఇవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు దివ్యౌషధంలా పనిచేస్తాయి.
మీ మూడ్ రీఫ్రెష్ చేస్తుంది..
శీతాకాలంలో బద్ధకంగా, విచారంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది సీజనల్ డిజార్డర్. జాజికాయ మానసిక స్థితిని రిఫ్రెష్ చేస్తుంది. ఇది యాంటిడిప్రెసెంట్ డ్రగ్స్ లాగా పనిచేసి డిప్రెషన్, స్ట్రెస్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
మెదడు యాక్టివ్ అవుతుంది..
ఈ కాయలో లభించే ‘మిరిస్టిసిన్’ అనే పదార్థం మెదడు చురుగ్గా పనిచేసేందుకు సహకరిస్తుంది. అంతేకాక అల్జీమర్స్ తాలూకు లక్షణాలను ఆలస్యం చేయడానికి జాజికాయ సహాయపడుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.s
[ad_2]
Source link
Leave a Reply