[ad_1]
Feature
oi-M N Charya
డా. ఎం. ఎన్. ఆచార్య – ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు – శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ – ఫోన్: 9440611151
ఆచార్య చాణక్య గొప్ప తన నీతి శాస్త్రంలో జీవితంలో ఎదురయ్యే అనేక సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలియజేశారు. చాణక్య తెలిపిన జీవన విధానాలను అవలంబించడం ద్వారా ఎవరైనాసరే తమ జీవితాన్ని సరళంగా తేలికగా మార్చుకోగలుగుతారు. అందుకే చాణక్య అందించిన నీతి సూత్రాలు నేటికీ అనుసరణీయంగా ఉన్నాయి. చాణక్య తెలిపిన విధానాలు కొంతవరకూ కఠినంగా అనిపించినప్పటికీ వీటిని జీవితంలో అమలుచేస్తే సంతోషకరమైన జీవితాన్ని అందుకోవచ్చు. జీవితంలో విజయం సాధించాలంటే ఎటువంటి లక్షణాలు కలిగివుండాలో ఆచార్య చాణక్య తెలియజేశారు.
ఈ లక్షణాలు కలిగిన వ్యక్తులు ప్రతికూల పరిస్థితులలోనూ విజయం సాధిస్తారని తెలిపారు. అలాంటి వ్యక్తులు ఎంతో అంకితభావంతో పనిచేస్తూ తాము అనుకున్న లక్ష్యాలను సాధిస్తారని వివరించారు. ఆచార్య చాణక్య తెలిపిన జీవన విధానాల ప్రకారం మనిషి ఏమిచేస్తే విజయం సాధిస్తాడో తెలిపారు. పొరపాటున కూడా ఎవరిపై కోపం తెచ్చుకోవద్దు. చాణక్య నీతి ప్రకారం ఒక వ్యక్తి ప్రవర్తన అతని వ్యక్తిత్వానికి గుర్తింపు నిస్తుంది. మనిషి ప్రవర్తన ఆధారంగా మంచి చెడులను అనుభవించాల్సి ఉంటుంది. మీరు కూడా మీ జీవితాన్ని ఆనందంగా మార్చుకోవాలనుకుంటే ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని ముఖ్యమైన నియమాలను ఖచ్చితంగా పాటించండి.
1 ) కోపం మనిషిలోని ఒక స్వభావం. స్త్రీ, పురుషులు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ కోపం వస్తుంది. అయితే చాలా సార్లు కోపం సమయం సందర్భంలో పని లేకుండా అనుకోకుండా వస్తుంది. అలా అదుపు లేకుండా వచ్చే కోపం వలన అనర్ధం కలుగుతుందని చాణుక్యుడు చెబుతున్నారు. అంతేకాదు కోపంలో అవతలి వ్యక్తి ఎవరనేది పట్టించుకోకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడానికి కూడా మనిషి వెనుకాడడు. కొంచెం సేపటి తర్వాత కోపం అదుపులోకి వచ్చాక. అయ్యో నేను అలా అనకుండా ఉండాల్సింది. లేకపోతే అలా చేయకుండా ఉండాల్సింది అంటూ చింతిస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆచార్య చాణక్యుడి విధానాలను ఆచరించడం ఉత్తమ మార్గమని పెద్దలు చెప్పారు. చాణక్య విధానం ప్రకారం ఎంత కోపం వచ్చినా కొంతమందితో ఎప్పుడూ గొడవ పడకండి. లేకపోతే భవిష్యత్తులో మీరు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.
2 ) పరాజయం పాలయినవారి సలహా విజయం సాధించాలనుకుంటున్న వ్యక్తి జీవితంలో పరాజయం పాలయిన వ్యక్తి నుంచి కూడా సలహా తీసుకోవాలని ఆచార్య చాణక్య తెలిపారు. అపజయాలను ఎదుర్కొన్నవారు తమ తప్పులను, వాటి నుంచి నేర్చుకున్న పాఠాలను ఇతరులకు చెబుతారు. వీటిని స్వీకరించి, సరైనమార్గం ఏర్పరుచుకోవడం ద్వారా ఎవరైనా విజయాన్ని అందుకోవచ్చని చాణక్య చెబుతారు.
3 ) కుటుంబ సభ్యులతో గొడవ పడకండి. చాణక్య విధానం ప్రకారం మన కుటుంబ సభ్యులపై ప్రతి చిన్న విషయానికి కోపాన్ని చూపించకూడదు. మీ మంచి చెడులను అర్థం చేసుకునేది అవసరానికి అండగా ఉండేది కుటుంబమే. అటువంటి పరిస్థితిలో కుటుంబ సభ్యులతో గొడవ పడటం మీ శ్రేయోభిలాషులను కోల్పోవడంతో సమానం. ఒకొక్కసారి మీరు పశ్చాత్తాపడే పరిస్థితులు రావచ్చు లేదా భవిష్యత్తులో మీకు సరైన మార్గాన్ని చూపే కుటుంబ సభ్యులు కూడా దూరం కావచ్చు.
4 ) మూర్ఖులతో వాదించవద్దు. ఆచార్య చాణక్యుడు ప్రకారం మూర్ఖులతో ఎప్పుడూ వాదించకూడదు. వారితో వాదించడం వల్ల సమయం వృధా అవుతుంది. వారితో పోట్లాడమంటే దున్నపోతు మీద వర్షం కురిసినట్లే అలాంటి వాళ్ళు ఎప్పుడూ తమ అభిప్రాయాన్ని సమర్ధించుకునేందుకు తల, కాళ్లు లేకుండా వాదనలు చేయడం ప్రారంభిస్తారు. అటువంటి కోపం తెచ్చుకోవడం మానసికంగా చికాకుని కలిగిస్తుంది. మూర్ఖులతో వాదించవద్దు.
5 ) స్నేహితుల మీద కోపం తెచ్చుకోకండి. స్నేహంబంధం జీవితంలో చాలా ప్రత్యేకమైనది. సరదాగా, సంతోషంగా ఉండడమే కాదు మీ రహస్యాలను పంచుకోవడం వరకు మీ స్నేహితులు మీకు అడుగడుగునా మద్దతు ఇస్తారు. స్నేహితులపై కోపం తెచ్చుకోవడం వల్ల మీరు వారిని శాశ్వతంగా కోల్పోవచ్చు. దీనితో విశ్వాసం కలిగిన మంచి వ్యక్తి విశ్వసనీయ సంబంధం ముగుస్తుంది.
6) గురువుతో గొడవలు వద్దు. ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయుడి పాత్ర కీలకం. ఒక మంచి ఉపాధ్యాయుడు వ్యక్తి జీవితంలో మార్గదర్శి అవుతారు. అయితే కొందరు మాత్రం కోపంతో గురుదేవుడుని కించ పరిచేలా మాట్లాడుతూ వారి గురించి చెడుగా మాట్లాడానికి కూడా వెనుకాడరు. ఇలా చేయడం ద్వారా మీరు గురువును మాత్రమే కాదు జ్ఞానానికి కూడా దూరం అవుతారు.
7 ) విజయం సాధించినవారి సలహా విజయం సాధించడానికి ఓడిపోయిన వ్యక్తి నుండి సలహాలు తీసుకోవడంతో పాటు, విజయవంతమైన వ్యక్తి నుంచి కూడా సలహాలను కూడా తీసుకోవాలని ఆచార్య చాణక్య తెలిపారు. విజయం సాధించిన వ్యక్తి తన అనుభవంతో ఇతరులకు ప్రేరణ కల్పిస్తాడని, అన్నింటా విజయం సాధించడానికి ప్రోత్సాహాన్ని అందిస్తాడని ఆచార్య చాణక్య చెబుతారు.
8 ) స్వీయ అవగాహన లక్ష్యాన్ని సాధించాలనుకున్నవారికి స్వీయ అవగాహన అత్యవసరమని చాణక్య చెబుతారు. మనస్సులో పరిపరివిధాల ఆలోచించిన తర్వాత సరైన నిర్ణయం తీసుకోవడం ద్వారా విజయం సాధిస్తారని ఆచార్య చెబుతారు. స్వీయ అవగాహన కలిగిన వ్యక్తి ఇతరులు ఇచ్చే సలహాలు సరైనవా? కాదా అనేది సులభంగా గ్రహించగలడని చాణక్య వెల్లడించారు.
English summary
Chanakya had told many facts over morality.
Story first published: Saturday, December 31, 2022, 10:19 [IST]
[ad_2]
Source link
Leave a Reply