[ad_1]
News
oi-Mamidi Ayyappa
Air India: టాటాల చేతికి వచ్చిన తర్వాత ఎయిర్ ఇండియా లీడింగ్ విమానయాన సంస్థగా ఎదిగేందుకు సాకేతికతను విరివిగా ఉపయోగిస్తోంది. అనేక విధాలుగా తనను తాను రూపాంతరం చేసుకుంటూ మార్కెట్ లీడర్ గా మారేందుకు ముందడుగులు వేస్తోంది.
ఇటీవలి వరకు విమాన ఛార్జీలను సెట్ చేసేటప్పుడు ఎయిర్ ఇండియా పాతకాలం నాటి మాన్యువల్ ధరల వ్యవస్థను అనుకరించింది. అయితే ప్రత్యర్థి సంస్థలు మరింత ఆదాయాన్ని పొందేందుకు వీలుగా సాంకేతిక అల్గారిథమ్ ఆధారిత సాఫ్ట్‌వేర్‌కు వినియోగించే వారు. ఇప్పుడు ఎయిర్ ఇండియా సైతం ఇదే పద్ధతిలోకి మారిపోయింది. దీని ద్వారా వీలైనంత ఎక్కువ ఆదాయం పొందేందుకు వీలుకలగ నుంది. పేపర్ ఆధారిత పద్ధతులకు బదులుగా Air India.. ప్రసిద్ధ OpenAI చాట్‌బాట్ అయిన ChatGPTని పరీక్షిస్తోంది.
దశాబ్దాల పాటు ప్రభుత్వ బ్యూరోక్రాటిక్ విధానాలను తొలగించి దేశీయ మార్కెట్లో ప్రత్యర్థి అయిన ఇండిగో నుంచి కస్టమర్లను తిరిగి చేజిక్కించుకునేందుకు టాటా ఎయిర్ ఇండియా తన 2.O ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇందుకోసం భారీగా ఆధునీకరణను ప్రారంభించింది. టాటాలకు ఉన్న అన్ని విమానయాన కంపెనీలను ఒకే గొడుగు కిందకు తీసుకురావటం ద్వారా తక్కువ ధరల శ్రేణిలో ప్రయాణికులకు సేవలను అందించాలని.. తద్వారా ఖర్చులను కూడా తగ్గించాలని టాటాలు యోచిస్తున్నారు.
మార్కెట్లో డిమాండ్ కు అనుగుణంగా మోడరన్ రెవెన్యూ మేనేజ్మెంట్ సాఫ్ట్ వేర్ ప్రయాణికుల బడ్జెట్, ఎక్కువగా ప్రయాణించాలనుకుంటున్న డెస్టినేషన్లను గుర్తించి ప్రయోజనాన్ని పొందేలా ఎయిర్ ఇండియాకు సహకరించనుంది. కంపెనీ నిర్వహణలో ఉన్న గజిడిజి గందరగోళం పెద్ద శాపంగా మారిన తరుణంలో టాటాలు భారీ మార్పులకు శ్రీకారం చుట్టారు. భారత విమానయాన రంగంలో ఎయిర్ ఇండియా విజయవంతంగా ముందుకు సాగటం ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వానకిి చాలా కీలకమైనది. దుబాయ్, సింగపూర్ మాదిరిగా భారత విమానయాన రంగం గ్లోబల్ ప్లేయర్ గా మారటానికి ఈ విజయం చాలా కీలకం. ఇందుకోసం టాటాలు తమ ఇతర సంస్థల సహాయాన్ని కూడా తీసుకుంటోంది.
English summary
Air India transforming under tata’s from ticketing to use of OpenAI ChatGPT
Air India transforming under tata’s from ticketing to use of OpenAI ChatGPT
Story first published: Friday, March 31, 2023, 14:01 [IST]
[ad_2]
Source link
Leave a Reply