టాప్‌ టెన్ న్యూస్ చూడండి పది నిమిషాల్లో అప్‌డేట్‌ అయిపోతారు

[ad_1]

మధ్యాహ్నం 12 గంటలకు పది ఫలితాలు విడుదల

ఈ మధ్యాహ్నం 12 గంటలకు టెన్త్ ఫలితాలు విడుదల చేయనున్నారు. పదో తరగతి ఫలితాలను కూడా మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చేతుల మీదుగానే విడుదల చేయబోతున్నారు. గోదావరి ఆడిటోరియంలో గ్రౌండ్ ఫ్లోర్ లో మంత్రి సబిత టెన్త్ రెగ్యూలర్, వొకేషనల్ విద్యార్థుల ఫలితాలను విడుదల చేస్తారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఫలితాలు ఇక్కడ చెక్ చేసుకోండి.

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. కర్ణాటకలో మొత్తం 224 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఇందులో పలువురు సీనియర్ల భవితవ్యం ఈవీఎంలో నిక్షిప్తం కానుంది. మొత్తం 224 స్థానాలకు ఒకే దఫాలో కర్ణాటక అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహిస్తోంది ఈసీ. మొత్తం 5 కోట్ల 31 లక్షల 33 వేల 54 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 58, 545 పోలింగ్ బూత్ లు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 2,615 మంది అభ్యర్థులు తమ లక్ పరీక్షించుకోనున్నారు. లైవ్ అప్ట్‌డేట్స్ కోసం ఇక్కడ చూడండి.

షోకాజ్‌ వీర్రాజ్‌

ఆంధ్రప్రదేశ్  బీజేపీలో కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారంటూ సీనియర్ నేతలకు సోము వీర్రాజు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు. అదే సమయంలో పార్టీలో ఉంటూ టీడీపీతో పొత్తు కు అనుకూలంగా మాట్లాడుతున్న వారిపైనా ఫైర్ అవుతున్నారు. దీంతో ఎన్నికలకు ముందు ఏపీ బీజేపీలో గందరగోళ పరిస్థితులు ఎదురవుతున్నాయి. మరిన్ని అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి

 తెలంగాణపై ఫోకస్‌  

కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ వంటి సినిమా భారతీయ జనతా పార్టీ ఎజెండాలో భాగంగా మారాయి. ఆ సినిమాల వెనుక బీజేపీ నేతలు ఉన్నారో లేదో ఎవరికీ తెలియదు కానీ వాటికి  బీజేపీ చేస్తున్న ప్రమోషన్ అంతా ఇంతా కాదు. స్వయంగా ప్రధాని మోదీ వాటి గురించి ఎన్నికల సభల్లో ప్రస్తావిస్తున్నారు. వాటిని బీజేపీ ఓన్ చేసుకుంటే.. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న  చోట నిషేధిస్తున్నారు. బీజేపీ రాజకీయాల్లో సినిమాలకు ప్రత్యేక స్థానం ఉందని చెప్పాల్సిన పని లేదు. ప్రజల అభిప్రాయాలను మార్చగల శక్తివంతమైన సాధనం సినిమా అని ఆపార్టీ అగ్రనేతలు నమ్ముతారు. ఫ్లాష్ బ్యాక్ కశ్మీర్ స్టైల్లో ఉన్నప్పుడు అసలు వదిలి పెట్టరు. అందుకే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ కూడా అలాంటి సినిమా ఒకటి ప్లాన్ చేస్తుందన్న అభిప్రాయం బలంగానే వినిపిస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం 

రికార్డులకే కిక్‌ ఎక్కే స్థాయిలో తాగారు

భారతదేశ ప్రజలు గత కొన్ని నెలలుగా ద్రవ్యోల్బణం తాకిడిని ఎదుర్కొంటున్నారు. ఆహార పదార్థాల నుంచి నిత్యావసరాల వరకు అనేక వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో, ప్రజలు నిత్యావసరాల కొనుగోళ్లను కూడా తగ్గించుకున్నారు. అయితే, మద్యం విషయంలో మాత్రం ద్రవ్యోల్బణం గురించి అసలు పట్టించుకోలేదు. గత ఆర్థిక సంవత్సరంలో (2022-23), అనేక ఆహార పదార్థాల ధరలతో పాటు ఆల్కహాల్‌ రేట్లు కూడా పెరిగినా, మద్యం ప్రియులను అది ప్రభావితం చేయలేదు. మందుబాబులు ఎక్కువ డబ్బు చెల్లించి మరీ బాటిళ్లు కొన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ చూడొచ్చు

ఇదెక్కడి సమస్యరా బాబూ

వివాహ సమయంలో వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్లు చాలా బిజీగా ఉంటారు. ఫ్రీ వెడ్డింగ్ షూట్‌లు, పోస్ట్ వెడ్డింగ్ షూట్లతో అందమైన సంఘటనలను అపురూప చిత్రాలుగా మారుస్తారు. అలా ఓ జంటకు ఫోటోలు తీశాడు ఓ వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్. వారి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. మంచి పేమెంట్ కూడా రావడంతో హ్యాపీగా పెళ్లి ఫోటోలను ఆల్బమ్ గా మార్చి ఇచ్చేశాడు. ఇది జరిగి నాలుగేళ్లు అయింది. ఆ తరువాత అతనికి అసల్ షాక్ తగిలింది. ఇలా ఏ ఫోటో గ్రాఫర్‌కు అనుభవం అయి ఉండదు. మన దేశంలోనే కాదు ప్రపంచంలోనే మొదటి ఘటన అని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఏం జరిగిందంటే…

బోల్డెస్ట్ కపుల్ గురించి మరింత తెలుసుకోండి

నవరస రాయ నరేష్ విజయకృష్ణ (Naresh), ప్రముఖ నటి పవిత్రా లోకేష్ (Pavitra Lokesh)ను బోల్డ్ కపుల్ అంటోంది ‘మళ్ళీ పెళ్లి’ చిత్ర బృందం. బోల్డ్ కపుల్ గురించి మీరు మరింత తెలుసుకోవాలని అనుకుంటే… మే 11 వరకు వెయిట్ చేయాలి.

పరేషాన్ కాల్

మీకు రిసేంట్ గా +251, +62, +84 వంటి విదేశీ కోడ్‌ల నుంచి వాట్సాప్ కాల్స్ వస్తున్నాయా..? అది చూసి ఫారెన్ లో  ఉన్న మన ఫ్రెండ్ ఎవరైనా చేసి ఉండి ఉండవచ్చు అనుకుంటున్నారా..! ఐతే.. ఒక్క సెకన్. ఫోన్ చేసేది దోస్తులు కాదు.. దొంగలు. డేటా దొంగలు జర జాగ్రత్త. మనకే కాదు..మన చుట్టుపక్కల ఉన్న చాలా మందికి ఈ మధ్య కాలంలోనే ఫారెన్ నెంబర్స్ నుంచి వాట్సాప్ కాల్స్, మేసేజ్ లు వస్తున్నాయి. దీని వెనుక ఎంత పెద్ద స్కామ్ జరగుతుందో చెబుతా జర మనసున పెట్టండి..! 

 ఉగ్ర అనుమానితుల్లో సంచలనాలు వెలుగులోకి

హైదరాబాద్‌ నగరంలో వెలుగులోకి వచ్చిన ఉగ్రవాదుల కదలికల్లో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పట్టుబడ్డ వారు ది కేరళ స్టోరీ సినిమా తరహాలో మతమార్పిడి చేయించుకున్నట్లుగా గుర్తించారు. హైదరాబాద్ లో వేర్వేరు చోట్ల నివసిస్తున్న వారిని మొత్తం ఐదుగురిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మధ్యప్రదేశ్‌ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, తెలంగాణ కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌లు కలిసి ఆపరేషన్‌ నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టార్గెట్ 200 ఉఫ్

టార్గెట్ రెండు వందలా..? ఇది మాకు చాలా చిన్న విషయం అంటోంది ముంబై ఇండియన్స్. వాంఖెడే వేదికగా  మంగళవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముగిసిన  54వ లీగ్ మ్యాచ్‌లో  ఆర్సీబీ నిర్దేశించిన  200  పరుగుల లక్ష్యాన్ని ముంబై..  16,3 ఓవర్లలోనే  ఛే‘దంచేసింది’. ఈ సీజన్ లో  200, అంతకుమించి టార్గెట్‌ను ఛేదించడం ముంబైకి ఇది మూడోసారి కావడం గమనార్హం.  భారీ లక్ష్య  ఛేదనలో  ముంబై ఇండియన్స్  ఆటగాడు, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (35 బంతుల్లో  83,  7 ఫోర్లు, 6 సిక్సర్లు)  కు తోడుగా నెహల్ వధేర  (34 బంతుల్లో 52 నాటౌట్,  4 ఫోర్లు, 3 సిక్సర్లు)  వీరవిహారం చేయడంతో  ఆర్సీబీ లక్ష్యం చిన్నబోయింది.  బెంగళూరుపై ముంబై ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ముంబై పాయింట్ల పట్టికలో  మూడో స్థానానికి చేరుకుని ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మరిన్ని అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *