[ad_1]
కారణాలు..
ఎక్కువగా ఒత్తిడి
తక్కువ నిద్ర
ప్రాసెస్డ్ ఫుడ్ తీసుకోవడం
ఎక్కువగా షుగర్ ఫుడ్స్ తీసుకోవడం
యాంటీ బయాటిక్స్ అధికంగా వాడడం
వీటన్నింటి వల్లే సమస్య వస్తుంది. కాబట్టి, ముందు నుంచి వీటి విషయంలో జాగ్రత్త అవసరమని చెబుతున్నారు నిపుణులు.
లక్షణాలు..
జీర్ణ సమస్యల సాధారణ లక్షణాలు కడుపు ఉబ్బరం, మలబద్ధకం, విరోచనాలు, కడుపు నొప్పి. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ లక్షణాలు జీర్ణ సమస్యలకి సూచన. అయితే, గట్ హెల్త్ బాగుందో లేదో తెలుసుకోవడానికి కూడా కొన్ని మార్గాలు ఉన్నాయి. కొన్ని లక్షణాల ద్వారా సమస్యని గుర్తించొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Also Read : Eye Problems : కళ్ళు మసకగా కనిపిస్తున్నాయా.. డాక్టర్స్ చెప్పే జాగ్రత్తలివే..
బరువు పెరగడం..
ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరైన లైఫ్ స్టైల్ ఉన్నా కూడా బరువు పెరగడం అనేది మీ గట్ మైక్రోబయోమ్ వల్ల రావొచ్చు 2020లో జర్నల్ ఫ్రాంటియర్స్ ఇన్ ఇమ్యునాలజీలో పబ్లిష్ అయిన పరిశోధన ప్రకారం కొన్ని గట్ బ్యాక్టీరియా ఇన్సులిన్ రెసిస్టెన్స్కి కారణమవుతుంది. దీని వల్ల బరువు పెరిగే ఛాన్స్ ఉంది.
స్వీట్స్ తినాలని..
మీ గట్ హెల్త్ బాగుండకపోతే మీకు ఎక్కువగా స్వీట్స్ తినాలనిపిస్తుంది. ఇవి స్వీట్స్, బ్రెడ్, పండ్లు, డెయిరీ ప్రోడక్ట్స్ వల్ల ఉంటాయి. ఎక్కువగా షుగర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల గట్‌లో చెడు బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని వల్ల సమస్య పెరుగుతుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
మూడ్ స్వింగ్స్..
మన గట్, బ్రెయిన్ మధ్య ఓ లింక్ ఉంటుంది. నిజానికీ, గట్ తరచుగా రెండో మొదడు అంటారు.
2018 మేలో ఫ్రాంటియర్స్ ఇన్ సైకియాట్రీలో పబ్లిష్ అయిన సమీక్ష ప్రకారం, గట్ సూక్ష్మ జీవులు నాడీ వ్యవస్థ, ఎండోక్రైన్ వ్యవస్థ, ఇమ్యూనిటీతో కమ్యూనికేట్ చేస్తాయి. దీంతో మీ మానసిక స్థితి, మీరు ఎలా ప్రవర్తిస్తారో అనేదాన్ని ప్రభావితం చేస్తాయి.
2020 జులైలో అడ్వాన్సెస్ ఇన్ న్యూట్రిషన్లో పబ్లిష్ అయిన సమీక్ష.. ఈ రకమైన ఆహార విధానం గట్ మైక్రోబియల్ వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తుందని, గట్ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుందని, మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతోంది.
ఫుడ్ తినాలనిపించకపోవడం..
ఇది ఎందుకంటే కడుపులో ఆహారం జీర్ణం చేయడంలో ఇబ్బందిగా ఉంటే వస్తుంది. మీ గట్ మైక్రోబయోమ్‌లో మార్పుల వల్ల ఫుడ్ తినాలనిపించదు. అంతేకాకుండా.. అతిసారం, పొత్తికడుపు తిమ్మిరి, ఉబ్బిరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. ఇది కొన్ని ఫుడ్స్ తినడం వల్ల వస్తాయి. అది ఏ ఫుడ్ వల్ల వస్తున్నాయో కనుక్కోండి. కొన్ని రోజుల పాటు దానిని తినకండి. సమస్య తగ్గాక.. చిన్న పరిమాణంలో తినండి. అయినా సమస్య మళ్ళీ వస్తే ఆ ఫుడ్‌ని తినకపోవడమే మంచిది.
సమస్య పరిష్కారానికి..
అయితే, ఈ సమస్యల పరిష్కారానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఒత్తిడిని తగ్గించుకోవడం..
ఒత్తిడిని తగ్గించుకునేందుకు ప్రయత్నం చేయాలి. ఇందుకోసం మెడిటేషన్, నడవడం, సన్నిహితులతో కాలం గడపడం, ఆల్కహాల్, పొగత్రాగడానికి దూరంగా ఉండడం, నవ్వడం, యోగా, పెంపుడు జంతువులతో కాలం గడపడం వంటివి చేయొచ్చు.
సరిపడా నిద్ర..
మంచి నిద్ర కూడా జీర్ణ సమస్యల్ని దూరం చేస్తుంది. ఇది గట్ హెల్త్‌ని కాపాడుతుంది. కాబట్టి, రోజూ కంటి నిండా నిద్రపోండని చెబుతున్నారు నిపుణులు.
Also Read : Breakfast For Diabetes : షుగర్ ఉన్నవారు ఈ బ్రేక్‌ఫాస్ట్ తింటే చాలా మంచిది
మెల్లిగా తినడం..
తినే ఆహారాన్ని కూడా నిదానంగా నమిలి తినాలని గుర్తు పెట్టుకోండి. దీని వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. సరిగ్గా నమిలి తినడం వల్ల గట్ హెల్త్ బావుంటుంది.
హైడ్రేటెడ్‌గా ఉండడం..
నీరు తాగడం కూడా చాలా మంచిది. ఇది మీ జీర్ణ సమస్యల్ని దూరం చేసి గట్ హెల్త్‌ని కాపాడుతుంది. ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల గాస్ట్రో ఇంటెస్టినల్ ఇన్ఫెక్షన్ సమస్యలు దూరమవుతాయి.
ఫుడ్స్..
సరైన ఆహారం తీసుకునేలా జాగ్రత్తపడండి. ఫైబర్ ఫుడ్స్, ప్రోబయోటిక్స్ వంటివి తీసుకోవాలి. సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలని చెబుతున్నారు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
Read More : Relationship News and Telugu New
[ad_2]
Source link
Leave a Reply