[ad_1]
SEBIs Bubble Warning Effect: గత కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్‌లో మంచి ఫలితాలు రావడం లేదు. ఈ వారం, ముఖ్యంగా స్మాల్ క్యాప్ & మిడ్ క్యాప్ విభాగానికి గడ్డు కాలంగా మారింది. ఈ రెండు సెగ్మెంట్లలో భారీ అమ్మకాలు సునామీలా విరుచుకుపడ్డాయి. అంతులేని అమ్మకాల కారణంగా స్టాక్ మార్కెట్ పెట్టుబడిదార్లు బిలియన్ డాలర్ల కొద్దీ సంపద కోల్పోయారు.
బబుల్ అలెర్ట్ జారీ చేసిన సెబీ చీఫ్
ఈ పతనానికి ముందు, స్మాల్ క్యాప్ & మిడ్ క్యాప్ స్టాక్స్ అద్భుతమైన ర్యాలీని చూపించాయి. గత 12 నెలల కాలంలో, రిటర్న్స్ ఇవ్వడంలో ఈ రెండు సెగ్మెంట్లు ప్రధాన సూచీల కంటే చాలా ముందున్నాయి. గత ఏడాది కాలంగా కొనసాగిన విపరీతమైన ర్యాలీలో స్మాల్ క్యాప్ 100 ఇండెక్స్ దాదాపు రెండింతలు పెరిగింది. అదే సమయంలో, మిడ్ క్యాప్ ఇండెక్స్ దాదాపు 60 శాతం పురోగమించింది. ఈ ర్యాలీకి ఈ వారంలో అడ్డుకట్ట పడడానికి ముందు కూడా, మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ సూచీలు కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ఈ నిరాటంక ర్యాలీ పట్ల కొందరు మార్కెట్ ఎక్స్‌పర్ట్‌లు ఇన్వెస్టర్లను అప్రమత్తం చేశారు.
ఈ నేపథ్యంలో. సెబీ (SEBI) చీఫ్ చేసిన ప్రకటన మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ స్టాక్స్ మీద పిడుగులా పడింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ చీఫ్ మాధబి పురి బుచ్ (Madhabi Puri Buch), మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ షేర్ల వాల్యుయేషన్లపై ఆందోళన వ్యక్తం చేశారు. సామర్థ్యానికి మించి గాలి ఊదిన బుడగలా (బబుల్) అవి మారాయని, ఆ బుడగ ఏ క్షణమైనా పేలి ఇన్వెస్టర్లు నష్టపోతారని హెచ్చరించారు.
గత 15 నెలల్లోనే అత్యంత చెత్త వారం
సెబీ చీఫ్ ప్రకటనతో ఇన్వెస్టర్లు భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత మార్కెట్‌లో భారీ విక్రయాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ విభాగాల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది. బబుల్ హెచ్చరిక వచ్చిన మరుసటి రోజే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 5 శాతం క్షీణించగా, మిడ్ క్యాప్ ఇండెక్స్ 4 శాతం పడిపోయింది. మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో ఈ వారం అత్యంత చెత్త వారంగా నిలిచింది, గత గత 15 నెలల్లో ఎన్నడూ ఇలాంటి పతనం జరగలేదు.
మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ షేర్లలో భారీ పతనానికి మహదేవ్ యాప్ స్కామ్ కూడా ఒక కారణమని అనుమానిస్తున్నారు. ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న నిందితుడి డీమ్యాట్ ఖాతాలో ఉన్న రూ.1000 కోట్లకు పైగా విలువైన షేర్లను ED సీజ్ చేసింది. మహదేవ్ యాప్ స్కామ్ సొమ్మును మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ షేర్ల ద్వారా స్టాక్ మార్కెట్‌లోకి పంప్ చేసినట్లు చెప్పుకుంటున్నారు.
ఈ వారం భారీ పతనం కారణంగా ఇన్వెస్టర్లు చాలా నష్టపోయారు. ఈ 5 ట్రేడింగ్ రోజుల్లోనే మిడ్ క్యాప్ & స్మాల్ క్యాప్ కంపెనీల మార్కెట్ క్యాప్ ఏకంగా 47 బిలియన్ డాలర్లు క్షీణించింది. చివరిలో వచ్చిన రికవరీ లేకుంటే ఈ నష్టం 70 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉండేది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: బ్యాంకుల్లో 5 రోజుల పని విధానంపై కేంద్ర ఆర్థిక మంత్రి కీలక ప్రకటన
మరిన్ని చూడండి
[ad_2]
Source link
Leave a Reply