[ad_1]
EPFO Fraud Alert: దేశంలో ఆన్‌లైన్ మోసాలు చాలా వేగంగా, కొత్త రూపాల్లోకి విస్తరిస్తున్నాయి. ఇటీవల, ఆన్‌లైన్ సెర్చ్‌లో ఉన్న ఒక ముంబై టీచర్ రూ. 1.99 లక్షలు కోల్పోయారు. 53 ఏళ్ల మహిళ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేయబోయి మోసగాళ్ల వలలో చిక్కుకుని రూ. 87,000 పోగొట్టుకున్నారు. OLX యాప్‌లో జ్యూసర్‌ను విక్రయించే క్రమంలో ఒక వ్యక్తిని రూ. 1.14 లక్షల మేర మోసగించారు. సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసం చేసేందుకు కొత్త ట్రిక్స్‌ని అవలంబిస్తున్నారని చెప్పే కొన్ని ఉదాహరణలు ఇవి.
ఇదే క్రమంలో, మరో కొత్త తరహా మోసం తెరపైకి వచ్చింది. ఇది EPFO సంబంధింత మోసం. మీరు కూడా PF ఖాతా ఉంటే, ఇలాంటి సంఘటన మీకు జరగకుండా ఉండాలంటే, మీరు తప్పనిసరిగా ఈ వార్త గురించి తెలుసుకోవాలి.
టార్గెట్ మహిళ టీచర్
32 ఏళ్ల ఉపాధ్యాయిని ఒకరు నవీ ముంబైలోని ఒక ప్రైవేట్ స్కూల్‌లో పని చేస్తున్నారు. TOI నివేదిక ప్రకారం.. ఆ మహిళ టీచర్ ఆన్‌లైన్‌లో PF ఆఫీసు కాంటాక్ట్ నంబర్ కోసం వెతికారు. ఒక నంబర్‌ను చూసి సంప్రదించారు. ఆమె ఫోన్ కాల్‌ను స్వీకరించిన అవతలి వ్యక్తి, తాను పీఎఫ్ కార్యాలయం ఉద్యోగిగా చెప్పుకున్నాడు. ఆ టీచర్, పీఎఫ్ సంబంధిత సమస్య గురించి చెబితే, ఆమె ఖాతా సంబంధింత వివరాలు తెలుసుకున్నాడు. ఆ తర్వాత, AirDroid యాప్‌ను డౌన్‌లోడ్ చేయమని ఆ వ్యక్తి సూచించాడు. తర్వాత, ఆ యాప్‌లో ఆమె బ్యాంక్ ఖాతా నంబర్, MPIN నమోదు చేయమని కోరాడు. అతను చెప్పిన పనులన్నీ ఆ టీచర్ చేశారు. ఆ వివరాలను తస్కరించిన అపరిచితుడు, ఆమె బ్యాంకు ఖాతాను తన నియంత్రణలోకి తీసుకున్నాడు. దాదాపు 16 లావాదేవీలు జరిపి రూ. 80,000 అతని ఖాతాలోకి బదిలీ చేసుకున్నాడు. ఈ సంఘటన గత వారం రోజుల క్రితం జరిగింది. తన బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు రాకపోగా, రివర్స్‌లో కట్ కావడం గమనించిన మహిళ, తాను మోసపోయినట్లు తెలుసుకున్నారు. ఈ నెల 6వ తేదీన ఆ బాధితురాలు సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఆన్‌లైన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి
EPFO ఒక్కటే కాదు, ఏదైనా సంస్థను సంప్రదించే నంబర్ మీకు కావాలంటే, గూగుల్ కనిపించిన నంబర్‌ను చూసి మోసపోవద్దు. ఆ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి, అక్కడి నుంచి మాత్రమే సంప్రదింపుల నంబర్‌ను పొందాలి. మూడో పక్షం వెబ్‌సైట్‌ల నుంచి నంబర్‌లను తీసుకోవడం ప్రమాదకరం, నవీ ముంబై టీచర్‌లా నష్టపోవాల్సి వస్తుంది.
PF ఖాతాదారులు కూడా, తమ PF ఖాతాకు సంబంధించిన ఏదైనా పని కోసం EPFO అధికారిక వెబ్‌సైట్ లేదా విభాగాన్ని సందర్శించవచ్చు. ఏదైనా యాప్‌ని డౌన్‌లోడ్ చేసే ముందు, దానిని వెరిఫై చేయడం చాలా ముఖ్యం. ఒకవేళ మీరు ఏదైనా సైట్‌లో మీ ఆధార్ కార్డ్ లేదా ఇతర ఏదైనా పత్రాన్ని ఉపయోగించాల్సి వస్తే, ఆ వెబ్‌సైట్ ప్రామాణికతను తనిఖీ చేయండి. అన్‌లైన్‌లో ఆహారం ఆర్డర్, ఉద్యోగం కోసం వెతకడం, వస్తువులు కొనడం, విక్రయించడం వంటి వాటికి సంబంధించి మిమ్మల్ని ఊరించే ఆఫర్ కనిపిస్తే, తొందరపడవద్దు. మీరు టెంప్ట్ అయ్యారంటే, మీకు మీరుగా వెళ్లి గేలానికి చిక్కుకున్నట్లే.
[ad_2]
Source link
Leave a Reply