[ad_1]
Stock Market News Today in Telugu: ఆసియా మార్కెట్ల నుంచి వీచిన ప్రతికూల పవనాలతో, భారతీయ స్టాక్ మార్కెట్లు కూడా ఈ రోజు (మంగళవారం, 27 ఫిబ్రవరి 2024) నెగెటివ్ నోట్‌తో ప్రారంభమయ్యాయి. కీలక స్థాయుల దగ్గర ప్రతిఘటన ఎదుర్కొంటున్న బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు, గట్టి సపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నాయి. ఐటీ స్టాక్స్ మద్దతుగా నిలిచినా, ప్రైవేట్ బ్యాంక్‌లు & ఫైనాన్షియల్ స్టాక్స్ పెనుభారంగా మారాయి.
ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది…
గత సెషన్‌లో (సోమవారం) 72,790 దగ్గర క్లోజ్ అయిన BSE సెన్సెక్స్, ఈ రోజు 63 పాయింట్లు తగ్గి 72,723.53 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్ అయింది. సోమవారం 22,122 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 31.85 పాయింట్లు లేదా 0.14 శాతం స్వల్ప క్షీణతతో 22,090.20 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది.
విస్తృత మార్కెట్లలో, BSE మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం & స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం చొప్పున పెరిగాయి.
సెన్సెక్స్ 30 ప్యాక్‌లో.. మార్కెట్ ప్రారంభ సమయంలో 17 స్టాక్స్ పెరుగుదలను, 13 క్షీణతను చూపుతున్నాయి. సుమారు ఒకటిన్నర శాతం పెరిగిన TCS, సెన్సెక్స్ టాప్ గెయినర్‌గా నిలిచింది. టైటన్ 0.70 శాతం, విప్రో 0.67 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 0.66 శాతం, హెచ్‌సీఎల్ టెక్ 0.53 శాతం లాభపడ్డాయి. టాప్ 5 గెయినింగ్ స్టాక్స్‌లో మూడు IT రంగానికి చెందినవి. ఈ రోజు IT స్టాక్స్ ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మరోవైపు.. యాక్సిస్ బ్యాంక్, పవర్ గ్రిడ్, భారతి ఎయిర్‌టెల్ బలహీనంగా కనిపించాయి.
పేటీఎం స్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ, పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (PPBL) పార్ట్ టైమ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో, ఈ రోజు ఓపెనింగ్ సెషన్‌లో పేటీఎం షేర్లు 5 శాతం పెరిగి, మళ్లీ కిందకు దిగాయి.
1:5 స్టాక్ విభజన ప్రకటించడంతో, కెనరా బ్యాంక్ స్టాక్ 1 శాతం పెరిగింది. బోర్డ్ నిర్ణయం ప్రకారం.. రూ.10 ముఖ విలువ కలిగిన ప్రతి షేరును రూ.2 ముఖ విలువకు కుదించి, ఐదు షేర్లుగా విభజిస్తారు.
ప్రమోటర్ కంపెనీ సియోన్ ఇన్వెస్ట్‌మెంట్ బ్లాక్ డీల్ కారణంగా, సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ 2.5 శాతం పతనమైంది.
ఆంధ్ర సిమెంట్స్ షేర్లు 4 శాతం తగ్గాయి. ప్రమోటర్ కంపెనీ సాగర్ సిమెంట్స్, ఆంధ్ర సిమెంట్స్‌లో 5 శాతం వాటాను ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా విక్రయించనుంది.
ఈ రోజు ఉదయం 09.50 గంటల సమయానికి, BSE సెన్సెక్స్ 55 పాయింట్లు లేదా 0.07% పెరిగి 72,845.13 దగ్గర; NSE నిఫ్టీ 15.40 పాయింట్లు లేదా 0.07% పెరిగి 22,137.45 వద్ద ట్రేడవుతున్నాయి.
ప్రైమరీ (IPO) మార్కెట్‌లో… ఎక్సికామ్ టెలి సిస్టమ్స్, ప్లాటినం ఇండస్ట్రీస్ IPOల సబ్‌స్క్రిప్షన్ ఈ రోజు ప్రారంభమైంది. ఒక్కో షేరును ఎక్సికామ్ టెలి సిస్టమ్స్ రూ.135-142 రేంజ్‌లో, ప్లాటినం ఇండస్ట్రీస్ రూ.162-రూ.171 రేంజ్‌లో ఆఫర్ చేస్తున్నాయి.
గ్లోబల్ మార్కెట్లు
ఈ ఉదయం ఆసియా మార్కెట్లు నిస్తత్తువగా అడుగులు వేస్తున్నాయి. నికాయ్, తైవాన్ తలో 0.3 శాతం వరకు పెరిగాయి. హ్యాంగ్ సెంగ్, కోస్పి, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.5 శాతం వరకు పడిపోయాయి. అమెరికాలో వడ్డీ రేటు తగ్గింపు సమయంపై ఒక అంచనాను తెలిపే ద్రవ్యోల్బణం గణాంకాలు ఈ వారంలో వెలువడతాయి. అక్కడి ఇన్వెస్టర్లు ఇప్పుడు ఇన్‌ఫ్లేషన్ డేటాపై దృష్టి పెట్టడంతో US మార్కెట్లు నెగెటివ్ సైడ్‌లో క్లోజ్ అయ్యాయి.
10-సంవత్సరాల US ట్రెజరీ బాండ్ ఈల్డ్ దాదాపు 4.27 శాతంగా ఉంది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు మళ్లీ 82 డాలర్లకు పెరిగింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు – ఈ రోజు రేట్లు ఇవే!
[ad_2]
Source link
Leave a Reply