ప్రారంభ నష్టాలను పూడ్చుకున్న మార్కెట్లు – ఐటీ, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌లో కొనుగోళ్లు

[ad_1]

Stock Market News Today in Telugu: ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్లు ఈ రోజు (సోమవారం, 18 డిసెంబర్‌ 2023) ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి, ఆ వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే, ఐటీ సెక్టార్‌తో పాటు కొన్ని ఫైనాన్షియల్‌ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో ప్రారంభ నష్టాల నుంచి రీబౌండ్‌ అవుతున్నాయి.

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది…
గత సెషన్‌లో (శుక్రవారం, 15 డిసెంబర్‌ 2023) 71,484 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 46.40 పాయింట్ల పతనంతో 71,437 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది, నిమిషాల్లోనే భారీగా పడిపోయింది. గత సెషన్‌లో 21,457 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 21.85 పాయింట్లు లేదా 0.10 శాతం క్షీణతతో 21,434 స్థాయి వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. ఉదయం 9.16 గంటలకు సెన్సెక్స్ 327.32 పాయింట్లు లేదా 0.46 శాతం పతనంతో 71,156 స్థాయి వద్ద ట్రేడయింది. నిఫ్టీ 79.35 పాయింట్లు లేదా 0.37 శాతం బలహీనతతో 21,377 వద్ద ఉంది.

సెన్సెక్స్ షేర్ల పరిస్థితి
మార్కెట్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో, సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లోని 14 స్టాక్స్‌ లాభపడగా, 16 స్టాక్స్‌ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ టాప్ గెయినర్లలో…. సన్ ఫార్మా 1.35 శాతం, టైటన్ 0.93 శాతం, టాటా స్టీల్ 0.66 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.66 శాతం, రిలయన్స్ ఇండస్ట్రీస్ 0.45 శాతం పెరిగాయి. పవర్ గ్రిడ్ 1.22 శాతం, ఐటీసీ 1.18 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 1.16 శాతం, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ 1.08 శాతం, ఇండస్‌ఇండ్ బ్యాంక్ 0.93 శాతం నష్టపోయాయి.

నిఫ్టీ చిత్రం
నిఫ్టీ 50 ప్యాక్‌లో, టైటన్ దాదాపు 2 శాతం లాభపడింది. సన్ ఫార్మా, టీసీఎస్, టెక్ మహీంద్ర కూడా లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ టాప్‌ లూజర్స్‌ లిస్ట్‌లోకి ఐటీసీ, మహీంద్ర & మహీంద్ర, పవర్ గ్రిడ్, ఎన్‌టీపీసీ చేరాయి.

బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి
ఈ రోజు బ్యాంక్ నిఫ్టీలో భారీ క్షీణత కనిపించింది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే బ్యాంక్ నిఫ్టీ 201 పాయింట్లు పడిపోయి 47,942 స్థాయి వద్దకు చేరింది. ఐదు నిమిషాల తర్వాత కోలుకుని 48,068 స్థాయికి చేరుకుంది. బ్యాంక్ నిఫ్టీలోని 12 షేర్లలో 9 స్టాక్స్‌ పెరిగాయి, 3 షేర్లు క్షీణించాయి. 

ప్రి-ఓపెనింగ్‌ సెషన్‌
మార్కెట్‌ ప్రి-ఓపెనింగ్‌ సెషన్‌లో సెన్సెక్స్ 43.08 పాయింట్లు నష్టపోయి 71,440 వద్ద, నిఫ్టీ 18.60 పాయింట్లు నష్టపోయి 21,438 వద్ద ట్రేడయ్యాయి.

JSW గ్రూప్ చీఫ్ సజ్జన్ జిందాల్‌ను చుట్టుముట్టిన వివాదాల వల్ల, మార్కెట్‌ ప్రారంభ సెషన్‌లో JSW స్టీల్ 3 శాతానికి పైగా పడిపోయింది. విలీన గడువు దగ్గర పడుతున్నా CEO నియామకంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో, సోనీ ఇండియాతో  విలీనానికి జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ గడువు పొడిగింపును కోరినట్లు వచ్చిన వార్తలతో ఈ స్టాక్‌ దాదాపు 4 శాతం పతనమైంది. 

ఈ రోజు ఉదయం 10.15 గంటల సమయానికి, BSE సెన్సెక్స్‌ 30.76 పాయింట్లు లేదా 0.043% తగ్గి 71,452.99 దగ్గర; NSE నిఫ్టీ 0.049 పాయింట్లు లేదా 0.00023% పెరిగి 21,456.70 వద్ద ట్రేడవుతున్నాయి.

గ్లోబల్ మార్కెట్ల పరిస్థితి 
ఈ ఉదయం, బ్యాంక్ ఆఫ్ జపాన్ యొక్క ద్రవ్య విధానం నేపథ్యంలో జపాన్ నికాయ్‌ 1 శాతానికి పైగా పడిపోయింది. హాంగ్ సెంగ్ కూడా దాదాపు 1 శాతం క్షీణించగా, షాంఘై, కోస్పి 0.5 శాతం చొప్పున తగ్గాయి.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

మరో ఆసక్తికర కథనం: మహత్తర అవకాశం మళ్లీ వచ్చింది – సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ సబ్‌స్కిప్షన్‌ ప్రారంభం

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *