ప్రి-అప్రూవ్డ్‌ లోన్‌ నుంచీ యూపీఐ పేమెంట్స్‌, కొత్త ఫీచర్‌ గురూ!

[ad_1]

UPI Payments: మన దేశంలో UPI (Unified Payments Interface) పరిధి జెట్‌ స్పీడ్‌తో పెరుగుతోంది, ఈ సిస్టం ద్వారా ప్రజలకు అందే ఫెసిలిటీలు కూడా పెరుగుతున్నాయి. ఇప్పుడు యూపీఐ పరిధిలోకి మరో కొత్త సదుపాయం వచ్చి చేరింది. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ సిస్టమ్‌లోకి ప్రి-శాంక్షన్స్‌ (pre-sanctioned) లేదా ప్రి-అప్రూవ్డ్ (pre-approved) క్రెడిట్ లైన్స్‌ను కూడా చేరుస్తున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

ప్రజలకు ఏంటి ప్రయోజనం?
ప్రి-అప్రూవ్డ్‌ లోన్స్‌ను యూపీఐలోకి చేర్చడం వల్ల బ్యాంక్‌ కస్టమర్‌ ప్రయోజనం పొందుతాడు. అంటే, డిపాజిట్‌ అకౌంట్‌లో డబ్బు లేకపోయినా, ప్రి-అప్రూవ్డ్‌/ప్రి-శాంక్షన్డ్‌ లోన్‌ ఉంటే యూపీఐ ద్వారా పేమెంట్స్‌ చేయవచ్చు. ఉదాహరణకు, ఒక కస్టమర్‌ 50 వేల రూపాయల ప్రీ-అప్రూవ్డ్ క్రెడిట్ లైన్‌కు అర్హత ఉంటే, ఆ మొత్తాన్ని UPI పేమెంట్స్‌ కోసం రుణంగా ఉపయోగించుకోవచ్చు. 

బ్యాంకులు అనుమతించిన ప్రి-అప్రూవ్డ్‌/ప్రి-శాంక్షన్డ్‌ క్రెడిట్ లైన్స్‌ నుంచి పేమెంట్‌ చేయడం/ స్వీకరించడం ద్వారా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ పరిధిని పెంచాలని ఈ ఏడాది ఏప్రిల్ 6న రిజర్వ్ బ్యాంక్ (RBI) ప్రతిపాదించింది. అది ఇప్పుడు అమల్లోకి వచ్చింది.

ప్రి-అప్రూవ్డ్‌/ప్రి-శాంక్షన్డ్‌ లోన్స్‌ నుంచి యూపీఐ పేమెంట్ల అనుమతులకు సంబంధించిన రూల్స్‌ బ్యాంక్‌ను బట్టి మారే అవకాశం ఉంది. బ్యాంక్‌ పాలసీ ప్రకారం, ఆ తరహా క్రెడిట్ లైన్ల నిబంధనలు & షరతులు ఉంటాయి. క్రెడిట్ పరిమితి, క్రెడిట్ వ్యవధి, వడ్డీ రేటు వంటి విషయాలను బ్యాంకులు డిసైడ్‌ చేస్తాయి.

కొత్త ఆఫర్లు రావడానికి అవకాశం
ప్రి-అప్రూవ్డ్‌/ప్రి-శాంక్షన్డ్‌ క్రెడిట్‌ లైన్స్‌ను యూపీఐ పరిధిలోకి తేవడం వల్ల బ్యాంకులకు కూడా బెనిఫిట్‌ ఉంటుంది. ఈ తరహా ఆఫర్లకు అయ్యే వ్యయాలు తగ్గుతాయి. యూపీఐ సిస్టమ్‌ గేట్లు మరింతగా ఓపెన్‌ అయ్యాయి కాబట్టి… ఇండియన్‌ మార్కెట్లు, కస్టమర్ల కోసం కొత్త తరహా ఆఫర్లు కూడా పుట్టుకొచ్చే ఛాన్స్‌ ఉంది.

గతంలో, అకౌంట్‌లో జమ చేసిన డబ్బుతోనే UPI సిస్టమ్ ద్వారా లావాదేవీలు జరిపే వీలుండేది. ఆ తర్వాత UPI పరిధిని ఇంకొంచం పెంచారు. ప్రస్తుతం… సేవింగ్స్ అకౌంట్స్‌, ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాలు, ప్రీపెయిడ్ వాలెట్లు, క్రెడిట్ కార్డ్స్‌ను UPIకి లింక్ చేయవచ్చు. ఈ UPI లావాదేవీలు బ్యాంకుల్లోని డిపాజిట్ అకౌంట్స్‌ మధ్య జరుగుతాయి. వాలెట్స్‌ వంటి ప్రి-పెయిడ్ ఇన్‌స్ట్రుమెంట్స్‌ (PPI) ద్వారా కూడా UPI ట్రాన్జాక్షన్లు చేయవచ్చు.

UPI సిస్టమ్‌ ఇండియాలో అత్యంత వేగంగా విస్తరిస్తోంది, బలంగా నాటుకుపోయింది. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా జరుగుతున్న రిటైల్ డిజిటల్ పేమెంట్స్‌లో 75% వాటా యూపీఐదే. ఇటీవల, రూపే క్రెడిట్ కార్డ్స్‌ను UPIకి లింక్ (RuPay credit cards‌) చేసే ఫెసిలిటీ కల్పించారు. దీంతో, యూపీఐ ట్రాన్సాక్షన్లు మరో మెట్టు ఎక్కాయి.

ఆగస్టులో 10 బిలియన్లు దాటిన UPI లావాదేవీలు
గత నెలలో (ఆగస్టు. 2023‌) UPI లావాదేవీలు మరో ల్యాండ్‌మార్క్‌ సాధించాయి, 10 బిలియన్ల మార్కును (1,000 కోట్లు) దాటాయి. అంతకుముందు నెల జులైలో, UPI లావాదేవీల సంఖ్య 9.96 బిలియన్లకు (996.4 కోట్లు) చేరుకుంది. 

మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు – ఇవాళ్టి రేట్లివి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *