[ad_1]
Foreign Portfolio Investors: కొత్త సంవత్సరం (2023) మొదటి 15 రోజుల్లోనే విదేశీ పెట్టుబడిదారులు (foreign investors లేదా FIIs) రూ. 15,000 కోట్ల పెట్టుబడులను ఇండియన్ ఈక్విటీస్ నుంచి వెనక్కు తీసుకున్నారు. అయితే, ఈ రూ. 15 వేల కోట్లలోనూ రూ. 10 వేల కోట్లకు పైగా డబ్బు కేవలం రెండు రంగాల నుంచే ఉపసంహరించుకున్నారు. అవి.. ఐటీ (IT Sector), ఫైనాన్షియల్స్ (Financial Sector). కేవలం 15 రోజుల్లో, ఈ రెండు సెక్టార్ల నుంచే రూ. 10,158 కోట్ల విలువైన స్టాక్స్‌ను అమ్మేశారు.
వాస్తవానికి, ఈ రెండు రంగాలకు ఫారిన్ ఫోర్ట్ఫోలియోల్లో హెవీ వెయిట్ ఉంది. ఎఫ్ఐఐల పెట్టుబడులలో ఎక్కువ భాగం ఈ సెక్టార్ల స్టాక్స్‌లోనే ఉన్నాయి.
వద్దనుకున్న రంగాలు
తొలి పక్షం రోజుల్లో, ఆర్థిక రంగంలోని స్టాక్స్ నుంచి ఎఫ్ఐఐలు రూ. 6,701 కోట్ల విలువైన షేర్లను నికరంగా అమ్మగా, ఐటీ స్టాక్స్‌లో రూ. 3,457 కోట్ల నికర అమ్మకందార్లుగా ఉన్నారు. అంటే, ఈ రంగాల్లో కొన్న షేర్ల విలువ కంటే, అమ్మిన షేర్ల విలువ ఎక్కువగా ఉంది.
ఇదే కాలంలో.. ఆయిల్ అండ్ గ్యాస్ (oil and gas), టెలికాం (telecom), ఆటో స్టాక్స్‌పై (auto stocks) కూడా ఎఫ్ఐఐలు బేరిష్ వైఖరిని అనుసరించారు. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్లో రూ. 2,824 కోట్ల విలువైన షేర్లను, టెలికాం రంగంలో రూ. 1,752 కోట్లు, ఆటో రంగంలో రూ. 1,064 కోట్లు విలువైన షేర్లను వదిలించుకున్నారు.
కన్జ్యూమర్ డ్యూరబుల్స్‌లో రూ. 864 కోట్లు, విద్యుత్ రంగంలో రూ. 664 కోట్లు, కెమికల్స్ రంగంలో రూ. 432 కోట్లు, కన్జ్యూమర్ సర్వీసెస్‌లో రూ. 375 కోట్లు, ఎఫ్ఎంసీజీలో (FMCG) రూ. 333 కోట్లు, మీడియా & ఎంటర్టైన్మెంట్లో రూ. 150 కోట్లు, స్థిరాస్తి రంగంలో (Realty), టెక్స్టైల్స్ రంగంలో రూ. 55 కోట్ల విలువైన షేర్లను విదేశీ మదపుదార్లు విక్రయించారు.
కొనుగోళ్లు జరిపిన రంగాలు
అయితే.. అన్ని రంగాల మీదా బేరిష్ వైఖరినే ఫారిన్ ఇన్వెస్టర్లు అనుసరించలేదు. కొన్ని రంగాల్లో నికర కొనుగోలుదార్లుగా ఉన్నారు. అంటే, ఆ రంగంలో అమ్మిన షేర్ల విలువ కంటే కొన్న షేర్ల విలువ ఎక్కువగా ఉంది.
ఈ నెల మొదటి 15 రోజుల్లో… మెటల్స్ & మైనింగ్ రంగంలో దాదాపు రూ. 2,518 కోట్ల విలువైన షేర్లను ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు కొన్నారు. నిర్మాణ రంగంలో రూ. 390 కోట్లు, నిర్మాణ సామాగ్రి (Construction Materials) రంగంలో రూ. 223 కోట్లు, సేవల రంగంలో రూ. 205 కోట్లు, క్యాపిటల్ గూడ్స్‌లో రూ. 168, ఆరోగ్య సంరక్షణ (Healthcare) రంగంలో రూ. 105 కోట్లు విలువైన నికర పెట్టుబడులు పెట్టారు. నిర్మాణ రంగం మీద విదేశీ పెట్టుబడిదార్లు ఫుల్ బుల్లిష్‌గా ఉన్నట్లు ఈ డేటాను బట్టి అర్ధం చేసుకోవచ్చు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
[ad_2]
Source link
Leave a Reply