ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు – 20k మార్క్‌ను నిలబెట్టుకున్న నిఫ్టీ

[ad_1]

Stock Market Today News in Telugu: బుధవారం భారీ లాభాలతో మురిపించిన స్టాక్‌ మార్కెట్లు, ఈ రోజు (గురువారం, 30 నవంబర్‌ 2023) ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. టాటా టెక్నాలజీస్, గాంధార్ ఆయిల్, ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ షేర్ల లిస్టింగ్‌ నేపథ్యంలో, మార్కెట్‌ స్తబ్ధుగా ఓపెన్‌ అయింది. బ్యాంక్ నిఫ్టీ నుంచి ఓవరాల్‌ మార్కెట్‌కు మద్దతు లభించింది. బ్యాంక్ షేర్లతో పాటు మీడియా, FMCG, ఆటో స్టాక్స్‌ పాజిటివ్‌ నోట్‌తో ట్రేడ్‌ అవుతున్నాయి. 

ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది…
నిన్న (బుధవారం, 28 నవంబర్‌ 2023) 66,902 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 61.30 పాయింట్ల లాభంతో 66,963 స్థాయి వద్ద (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. గత సెషన్‌లో 20,096 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 11.90 పాయింట్ల లాభంతో 20,108 వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 

సెన్సెక్స్ షేర్ల చిత్రం
మార్కెట్‌ ఓపెనింగ్‌ టైమ్‌లో… సెన్సెక్స్‌ 30 ప్యాక్‌లోని 18 స్టాక్స్‌ లాభాల్లో ఉండగా, మిగిలిన 12 కంపెనీలు నష్టాలతో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్‌ టాప్ గెయినర్స్‌లో… అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు 2.05 శాతం లాభపడ్డాయి, తాజా కొనుగోలు వార్తలు ఈ స్టాక్‌పై సెంటిమెంట్‌ను పెంచాయి. M&M 1.91 శాతం, యాక్సిస్ బ్యాంక్ 1.52 శాతం పెరిగాయి, విప్రో 0.95 శాతం, HUL 0.85 శాతం లాభపడ్డాయి.

నిఫ్టీ షేర్ల పరిస్థితి
నిఫ్టీ 50 ప్యాక్‌లోని 35 స్టాక్స్‌ పుంజుకుంటే, 15 స్టాక్స్‌ క్షీణించాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్‌లో.. హీరో మోటోకార్ప్ అగ్రస్థానంలో ఉంది, 3.16 శాతం పెరిగింది. అల్ట్రాటెక్ సిమెంట్ 1.78 శాతం, BPCL 1.66 శాతం, SBI లైఫ్ 1.45 శాతం, M&M 1.24 శాతం గెయిన్స్‌లో ట్రేడవుతున్నాయి. 

నిఫ్టీ టాప్ లూజర్స్‌లో… అదానీ స్టాక్స్ ఈ రోజు పతనమయ్యాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్ 1.40 శాతం, అదానీ పోర్ట్స్ 0.75 శాతం క్షీణించాయి. హిందాల్కో 1.09 శాతం, టాటా మోటార్స్ 0.76 శాతం దిగి వచ్చాయి. NTPC 0.72 శాతం తగ్గింది.

ఉదయం 10.15 గంటల సమయానికి, బీఎస్‌ఈ సెన్సెక్స్ 230.54 పాయింట్లు లేదా 0.34% తగ్గి 66,671.37 వద్ద; నిఫ్టీ 54.65 పాయింట్లు లేదా 0.27% రెడ్‌ కలర్‌లో 20,041.95 వద్ద ట్రేడవుతున్నాయి.  

ఈ రోజు స్టాక్ మార్కెట్ ప్రి-ఓపెన్ సెషన్‌లో, S&P BSE సెన్సెక్స్ ఇండెక్స్ 58.20 పాయింట్ల లాభంతో 66,960 వద్ద ఉండగా; నిఫ్టీ నామమాత్రంగా 1.15 పాయింట్లు పెరిగి 20,097 వద్ద ఉంది.

మార్కెట్‌ అనాలిసిస్‌
మార్కెట్‌లో మొమెంటం కొనసాగుతుందని ఎనలిస్ట్‌లు భావిస్తున్నారు. అయితే.. GDP డేటా, మంత్లీ F&O ఎక్స్‌పైరీ, ఎగ్జిట్ పోల్స్, ఈ రోజు జరిగే OPEC+ సమావేశం వంటి కీలక అంశాలు మార్కెట్‌ డైరెక్షన్‌ను మార్చే అవకాశం ఉందని చెబుతున్నారు. 

నిఫ్టీ, 19900 స్థాయిని బ్రేక్‌ చేసింది కాబట్టి, భవిష్యత్‌ సెషన్స్‌లో 20250-20350 స్థాయిలకు చేరే ఛాన్స్‌ ఉంది, కొత్త ఆల్-టైమ్ గరిష్టాలు ఏర్పడొచ్చు. తక్షణ మద్దతు 19950 స్థాయిలో ఉంది.

గ్లోబల్‌ మార్కెట్లు
బుధవారం U.S. స్టాక్స్ నష్టాల్లో క్లోజ్‌ అయ్యాయి. డో జోన్స్‌ 0.04%, S&P ఆఫ్ 0.09%, నాస్‌డాక్ 0.16 శాతం క్షీణించాయి. 2024 ప్రథమార్థంలో ఫెడరల్ రిజర్వ్ తన వడ్డీ రేట్లను తగ్గించే పనిని ప్రారంభించే అవకాశం ఉందన్న అంచనాలతో ఆసియాలో షేర్లు కొద్దిగా అటుఇటు మారాయి. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని ‘abp దేశం’ చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *