బ్యాంక్‌లు 4 రోజులు బంద్‌, అర్జంట్‌ పనిపై వెళ్లే ముందు ఈ లిస్ట్‌ చూసుకోండి

[ad_1]

Bank Holiday in January 2024: బ్యాంకులో మీకు ఏదైనా ముఖ్యమైన లేదా అత్యవసర పని ఉందా?, ఈ వారంలో బ్యాంక్‌లకు చాలా సెలవులు ఉన్నాయని గుర్తుంచుకోండి. ఈ రోజు (2024 జనవరి 25) నుంచి ఆదివారం (2024 జనవరి 28) వరకు చాలా రాష్ట్రాల్లో బ్యాంకులు పని చేయవు. బ్యాంక్‌ లావాదేవీల్లో మీకు ఎలాంటి ఇబ్బంది రాకూడదనుకుంటే, బ్యాంక్‌కు వెళ్లడానికి ముందే బ్యాంక్‌ సెలవుల జాబితాను ఒకసారి చెక్‌ చేయండి.

బ్యాంక్‌ సెలవుల కారణంగా ఖాతాదార్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసేందుకు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI), ప్రతి నెల హాలిడేస్‌ లిస్ట్‌ను ఆ నెల రాకముందే విడుదల చేస్తుంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఏయే రోజుల్లో బ్యాంక్‌లు పని చేయవో ఆ లిస్ట్‌లో ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంక్‌ల సెలవు తేదీలు కూడా అందులో ఉంటాయి. మీరు ఏదైనా పనిపై బ్యాంక్‌కు వెళ్లాలనుకున్నా, ఒకవేళ వేరే రాష్ట్రంలోని బ్యాంక్‌లో మీకు పని ఉన్నా బ్యాంక్‌ హాలిడేస్‌ లిస్ట్‌ను చూసుకుంటే సరిపోతుంది. దానిని బట్టి మీ పనిని ప్లాన్ చేసుకోవచ్చు.

ఈ రాష్ట్రాల్లో జనవరి 25 నుంచి 28 వరకు సెలవులు       
థాయ్ పోషం, హజ్రత్ మొహమ్మద్ అలీ జయంతి కారణంగా.. ఈ రోజు (గురువారం, 25 జనవరి 2024) చెన్నై, కాన్పూర్, లక్‌నవూ, జమ్మూలో బ్యాంకులు పని చేయడం లేదు. జాతీయ పండుగైన గణతంత్ర దినోత్సవం సందర్భంగా, జనవరి 26 శుక్రవారం (Republic Day 2024 Holiday) రోజున దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఇవి కాకుండా.. జనవరి 27న నాలుగో శనివారం, 28న ఆదివారం కారణంగా బ్యాంకులను మూసివేస్తారు. 

ఈ నేపథ్యంలో… చెన్నై, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో, ఈ రోజు నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు సెలవుల్లో ఉంటాయి. మిగిలిన రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులు బ్యాంకులు పని చేయవు. బ్యాంక్‌ సిబ్బందికి సుదీర్ఘ వారాంతం కలిసి వచ్చింది.

మరో ఆసక్తికర కథనం: పెరిగేది కొండంత, తగ్గేది గోరంత – ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే 

ఈ నెలలో (జనవరి 2024), దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంక్‌లకు మొత్తం 16 రోజులు సెలవులు వచ్చాయి. జనవరి 01, సోమవారం రోజున, నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా ప్రారంభమైన సెలవుల జాబితా, 28న ఆదివారంతో ముగుస్తుంది. 

బ్యాంక్‌ సెలవులో ఉన్నా మీ లావాదేవీ ఆగదు     
ఇప్పుడు, చాలా మంది చేతుల్లో స్మార్ట్‌ ఫోన్‌లు ఉన్నాయి, గ్లోబల్‌ టెక్నాలజీ వాటిలో నిక్షిప్తమై ఉంది. కాబట్టి, సెలవుల కారణంగా బ్యాంక్‌లు పని చేయకపోయినా ప్రజలు పెద్దగా ఇబ్బందులు పడడం లేదు. డబ్బులు విత్‌డ్రా చేసుకోవడానికి ATMలను ఉపయోగించవచ్చు, బ్యాంక్‌ సెలవు రోజుల్లోనూ ATMలు 24 గంటలూ పని చేస్తాయి. ఒక ఖాతా నుంచి మరొక ఖాతాకు నగదు బదిలీ చేయడానికి నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ లేదా UPI అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా నిరంతరాయంగా పని చేస్తాయి. 

మరో ఆసక్తికర కథనం: భారతీయుల భయాలు అవే, ప్రి-బడ్జెట్‌ సర్వేలో ఆసక్తికర విషయాలు

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *